ప్రతి సమస్యకు భగవద్గీత చెప్పిన పరిష్కారాలు ప్రశ్నల రూపం లో | Bhagavad Gita Give Solutions for every Problem 20th Question
20th Question :
ప్రశ్న ) ఎన్నోపనులు చేస్తుంటాం. కొన్ని సరిగా చేస్తాం. ఇంకొన్ని సరిగా చేయలేం. లోపల దడుపుగా ఉంటుంది. ఈ పని వల్ల పుణ్యం వస్తుందో, పాపం వస్తుందోనని. మంచిగా చేస్తున్నానో లేక చెడ్డ చేస్తున్నానో అని లోపల సంశయం. వీటితో ఏ పనీ చేయలేకపోతున్నాను. నేనెలా భావించాలి ? ఎలా ఆలోచించాలి? ఏది మంచి మార్గం?
బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృతదుష్కృతే |
తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలమ్ ‖ (2వ అ - 50వ శ్లో)
జవాబు : ఫలాకాంక్షలేకుండా, కార్యసిద్ది కలిగిన కలక్కపోయినా దైవనుగ్రహమని సమాన భావనతో స్వీకరించడానికి సిద్దపడి ఏ పనినైనా చేయాలి. ప్రతి పనినీ ఇలా చేయడానికి అలవాటుపడితే, ఫలాంశాన్ని భగవంతునికి వదిలివేయగలిగితే బాధ్యత మనపైన ఉండదు. మనస్సు నెమ్మదిగా ఉంటుంది. ఏరకమైన పుణ్యపాపాలు మనకంటవు. కనుక ఈ భావనను పెంపొందుచుకొని ప్రయత్నాలు చేయడం నేర్చుకోండి. కర్మలనాచరిస్తూ కూడా ఫలాపేక్ష లేకుండా సమభావనతో ఉండటం, పుణ్యపాపబంధం లేకుండా చేసుకోవడమే నేర్పరితనం. దీన్నే యోగమంటారు. ఇలాంటి భావన మీకుంటే మీరు ఏ పనైనా ధైర్యంగా చేయవచ్చు.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment