19th Question :
ప్రశ్న ) ప్రయత్నానికి ముందే 'ఎంత ప్రయోజనం కలుగుతుంది?' అని అంచనాలు వేసికొని పనిలో దిగడం అలవాటు. ఎందువల్లనో ఈ మధ్య ఏ పని మొదలుపెట్టినా మంచి జరగడం లేదు. దాంతో చాలా భయం కలుగుతుంది. ఎందుకులే ప్రయత్నించడం అని నిరుత్సాహం ఏదో చెప్పలేని ఆందోళన. అన్నింటివల్ల నాలో అసమర్ధత బాగా పెరిగింది. ఏమిటి పరిష్కారం ?
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ |
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ‖ (2వ అ - 48వ శ్లో)
జవాబు : మీ సంకల్పంలోనే పొరపాటు ఉంది. ఏదో పెద్ద ప్రయోజనాన్ని కోరి మీరు పని మొదలు పెడుతున్నారు. దైవం అనుకూలించని ఫలితం కాలక్కపోతే వెంటనే మీరు తలక్రిందులై పోతున్నారు. నిరుత్సాహ పడిపోతున్నారు. ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడైనా గ్రహించారా ? ఫలా పేక్ష వీటికన్నింటికీ కారణం. ఫలసిద్ది కలిగినా కలగకపోయినా రెండింటి విషయంలో సమభావనతో వ్యవహరించే వారికి ఫలాసంగం ఉండదు. వారికి పుణ్యపాపాలు అంటావు.
తదుపరి భగవద్గీత యొక్క ప్రశ్నలు జవాబులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
శివ సంబంధ ఉచిత పిడిఎఫ్ పుస్తకాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
లలిత సహస్రం పిడిఎఫ్ పుస్తకం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత శ్లోకాలు వాటి భావాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Tags
Bhagavad Gita Q&S