Drop Down Menus

ఇవ్వడానికి నీ దగ్గర ఏముందో తెలుసుకో | Hindu Temple Guide

ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది తెలుసుకో:
ఇవ్వడానికి నీ దగ్గర ఏముంది తెలుసుకో మేము బీదవాళ్ళము ఇవ్వడానికి ఏమీ లేదు అని మీరు అనుకుంటే అది మీ పొరబాటు..దేవుడు ఇచ్చిన స్వచ్ఛమైన చిరు నవ్వు , పదునైన మాట అనే ఆయుదం మీ దగ్గర ఉంది. ఒక మనిషిని నవ్వుతూ పలకరించడం, బాధలో ఓదార్చడం , కష్టంలో వెంట నిలవడం , భయపడ కుండా నేను ఉన్నాను అని తోడు చెప్పడం ఇవన్నీ మీరు ఇవ్వగలిగినవే.
అలాగే కొందరి చాడీలు చెప్పే గుణం వల్ల కాలక్షేపం కోసం చేసే నిందలు వల్ల కొందరి జీవితమే నాశనం అవుతుంది కుటుంబాలు కూలిపోతుంది,అది మహా పాపం . మంచి మాటలు మాట్లాడాలి మీ మాటతో ఆత్మ హత్య చేసుకోవాలి అనుకునే వారి మనసు మార్చగలరు, కుటుంబన్ని కలప గలరు. ధైర్యాన్ని సంతోషాన్ని ఇవ్వగలరు. అనారోగ్యంతో ఉన్న వారికి సేవచేయగలరు. సహాయం అంటే ధనమే అనుకుంటే డబ్బు ఉన్న వారికి మనిషి తోడు అవసరం ఉండదుకాని డబ్బు లేకున్నా మనిషి బతుకుతున్నారు కానీ ఇంకో మనిషి తోడు లేకుండా కాటికి కూడా చెరలేడు. ఎన్ని రోజులు బతుకుతాము తెలియదు ఉన్న రోజుల్లో కలిగిన దాంట్లో సంతోషం ఉండే ప్రయత్నం చేయాలి. చిన్న తప్పులు క్షమిస్తే వ్యక్తులు మధ్య బంధం బల పడుతుంది. నిజం చెప్తే చిన్న మాటతో పోతుంది అపద్దo చెప్తే నమ్మకం పోతుంది. నీవల్ల ఒకరికి కోపం వస్తే క్షమించండి అంటే సరిపోతుంది సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. నీ పైన నమ్మకం పోతే ఆ బంధం తెగిపోతుంది. పగ ప్రతికారం తో రగిలిపోవడం అంటే నీకు నువ్వు విషాన్ని నింపుకోవడం అంటే అనారోగ్యం తెచ్చుకుంటారు అందుకే ద్వాషాన్ని వదిలేయాలి.
దానం ధర్మం:
అవంతీపురం అనేరాజ్యాన్ని విజయుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆ రాజు భార్య మందార- వారికి సంతానం లేదు; అందుకని ఎంతో బాధపడుతూ ఉండేవాళ్ళు. కానీ రాజు మాత్రం తన రాజ్యంలోని ప్రజలను చాలా పీడించి, హింసించి పన్నులు వసూలు చేసేవాడు. అంతేకాదు- కరువుకాటకాలు వచ్చినప్పుడు కూడా ప్రజలను పట్టించు-కునేవాడు కాదు. పైపెచ్చు వారిపైన ఇంకా ఎక్కువ పన్నులు వేసి, పన్నులు కట్టాల్సిందేనని ఒత్తిడి చేసేవాడు. తన ఖజానాలోని డబ్బులను ఎంత మాత్రం ఖర్చు చేసేవాడు కాదు. ఏ మాత్రం దాన ధర్మాలు చేసేవాడుకాదు.

రాజు రాణి ఇద్దరూ సంతానం కోసం తిరగని చోటు లేదు; చూడని గుడి లేదు. చివరికి, అట్లా తిరుగుతూ,తిరుగుతూ వాళ్ళు ఒక ముని ని కలుసుకున్నారు. అప్పుడు ఆ ముని తన దివ్య దృష్టితో చూసి, రాజుతో "చూడండి, మీరు చేసిన పాప ఫలం ఇది. ఇప్పటికైనా గుర్తించండి- ప్రజలంటే ఎవరో కాదు- రాజుకు ప్రజలంతా బిడ్డలే. అలాంటి ప్రజలను పీడించటం వల్ల మీకంటూ వేరే సంతానం కలగలేదు. కాబట్టి, మీ జీవితాలు బాగుపడాలంటే మీరు మీ పిసినారి తనాన్ని విడిచిపెట్టాలి. ఘనంగా దాన ధర్మాలు చేయాలి. పేదలను హింసించకూడదు . అప్పుడు, మీ పుణ్యం కొద్దీ మీకు సంతానం కలుగుతుంది" అని చెప్పాడు.
ఆ మాటలు రాజు-రాణి ఇద్దరిలోనూ అలజడి రేపాయి. వాళ్ళు మునికి ధన్యవాదాలు చెప్పి తమ రాజ్యానికి వెళ్ళారు. అటుపైన రాజుగారు పూర్తిగా మారిపోయినట్లు, గుడులు, సత్రాలు కట్టించాడు; దానధర్మాలు చేశాడు; బలవంతపు పన్నుల వసూళ్లు మానుకున్నాడు; 'ఆ రాజు-ఈ రాజు ఒకరేనా' అన్నట్లు ప్రవర్తించాడు.

అనతి కాలంలోనే ఆ దంపతులకు ఒక పాప పుట్టింది. రాజు, రాణి, రాజ్య ప్రజలు అందరూ ఎంతో సంతోషించారు. ఆ పాప పుట్టిన తరువాత కొన్నేళ్ళపాటు రాజ్యం చాలా సుభిక్షంగా ఉండింది. సకాలానికి వర్షాలు వచ్చాయి; పంటలు బాగా పండాయి; ప్రజలు అందరూ సుఖంగా ఉన్నారు. అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు- రాజ్యంలో మళ్ళీ‌ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఒక ఏడాది.

ప్రజల మేలు కోసం ఖజానాలోంచి డబ్బులు బయటికి తీయాలనేసరికి రాజుకు మళ్ళీ లోభం పుట్టింది. 'ప్రజావసరాలు తీరాలంటే ప్రజలు పన్ను కట్టకపోతే ఎలా?'అన్నాడు. ప్రజలు గతంలో ఎదుర్కొన్న కష్టాలు మళ్ళీ మొదలయ్యాయి- రాజుగారు ప్రజలను హింసించడం మళ్ళీ నిత్య కృత్యమైంది. ఈలోగా రాజు కూతురు కూడా పెరిగి పెద్దదైంది.

ఒక రోజు పాపకు జబ్బు చేసింది. రాజు వైద్యులకు చూపించాడు, కాని జబ్బుమాత్రం తగ్గలేదు. రాజ్యంలోని వైద్యులందరిని పిలిపించి పాప జబ్బును నయం చేయమన్నాడు రాజు. కానీ ఏవైద్యుడూ పాపకొచ్చిన జబ్బును నయం చేయలేకపోయాడు.
రాజుకు చాలా భయం వేసింది. ఒక్కగానొక్క పాప దూరం ఐపోతుందేమోనని బాధపడ్డాడు, చివరికి ఆ సమయంలో రాజుకు ముని గుర్తుకొచ్చాడు. "రాజుకు ప్రజలంతా బిడ్డలే" అని ముని చెప్పటం గుర్తుకొచ్చింది. 'తను ఆ సంగతిని ఎంత త్వరగా మర్చిపోయాడు?!' అని విచారం వేసింది. పశ్చాతాపంతో రాజు మునిని స్మరించి, తనను క్షమించమని వేడుకొన్నాడు. ఆక్షణంలోనే ఆయన తన మనసును ప్రజా సంక్షేమం వైపుకు మరల్చాడు. ప్రజలనుండి పన్నుల రూపేణా వసూలు చేసిన ధనాన్ని తిరిగి వాళ్ళకోసమే ఖర్చు చేసేటట్లు ఆజ్ఞలు జారీ చేశాడు. పంటకాలువలను, చెరువులను, నీటి పారుదల వ్యవస్థలను, జల సేకరణ వ్యవస్థలను బలోపేతం చేసేసరికి, రాజ్యం మళ్లీ ఒక గాటన పడింది.

ఆలోగా యువరాణి ఆరోగ్యమూ బాగుపడింది. తను మంచిపనులు చేయటం వల్లనే తన కూతురు బ్రతికిందన్న విశ్వాసంవల్లనేమో, రాజు అటుపైన ఎన్నడూ ప్రజల్ని కష్టపెట్టలేదు. కాలక్రమేణా ఆయనలోని క్రూరత్వం అంతా పోయి, సహజమైన దయాగుణం వేళ్ళూనుకున్నది. 'విజయ మహారాజు మంచివాడు' అన్న ఖ్యాతి నలుదిశలా వ్యాపించింది.

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.