శ్రీ సాయి బాబా చాలీసా :
షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభోదత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా || 1 ||
కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి
నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం || 2 ||
చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని
గుర్రము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలములను
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం || 3 ||
బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం || 4 ||
నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయమునిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి || 5 ||
ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి || 6 ||
భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం || 7 ||
కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిమనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము || 8 ||
డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిదంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి || 9 ||
రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలు
శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి || 10 ||
అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమాయం
ఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము || 11 ||
భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి || 12 ||
మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి || 13 ||
వందనమయ్యా పరమేశా ఆపద్భాందవ సాయీశా
మా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం || 14 ||
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment