Drop Down Menus

ఉల్లి వెల్లుల్లి ఎందుకు నిషేదించారో తెలుసా | Onion and garlic in Vedas

బ్రాహ్మణులు ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు ? వాళ్లకు అది నియమమా ? ఆచారమా ? మూఢ నమ్మకమా ? బ్రాహ్మణులు ఉల్లి, వెల్లుల్లిని అసలు ఇంట్లోకి కూడా తీసుకెళ్లకపోవడానికి కారణమేంటి ? బ్రహ్మణులతో పాటు కొన్ని కులాల వారు మాంసం తినరని మనకు తెలుసు…
అయితే వాస్తవానికి వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా తీసుకోవడం హిందూ  సాంప్రదాయం ప్రకారం నిషిద్దమట. ఇప్పటికీ మనలో ఆచారాలను నిష్టగా పాటించే వారు చాలామంది తమ భోజనంలో మాంసాన్ని వెల్లుల్లి, ఉల్లిపాయలను తీసుకోరు. అయితే వారు ఎందుకు వీటిని తమ ఆహారంలో నిషేధించారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.

బ్రాహ్మణుల కట్టుబాట్లు కఠినంగా ఉండటమే కాకుండా వీరి ఆహారపు అలవాట్లు కూడా కఠినంగానే ఉంటాయి. వీరు అస్సలు ఏ విధమైన మసాలాలూ తినరు. ముఖ్యంగా ఉల్లీ, వెల్లుల్లి వీరికి నిషిద్ధం. పూర్వీకులు ఎప్పుడూ వీటిని తినలేదు. బ్రాహ్మణులు అస్సలు వీటిని ఇంట్లొకి తీసుకొచ్చేవాళ్లు కాదు. కానీ ఈ మధ్య ఈ అలవాటు కాస్త మారింది. కానీ స్మార్తులు, అయ్యర్, అయ్యంగార్ కుటుంబాలలో ఇప్పటికీ ఉల్లీ, వెల్లుల్లీ నిషేధం. భగవంతునికి నివేదించే నైవెద్య పదార్ధాలలో ఉల్లీ, వెల్లుల్లీ అస్సలు వాడరు. అసలు దీనికి గల కారణమేంటో తెలుసా ?

ఆయుర్వేదం ప్రకారం,మనం తీసుకునే ఆహారం మొత్తం మూడు భాగాలుగా విభజించారు.అవే సాత్విక, రాజసిక మరియు తామసిక. వీటిలో ఒక్కో కేటగిరీలోని పదార్థాలు మనిషిలోని ఓక్కో గుణాన్ని పెంచడమో, తగ్గించడమో చేస్తాయి. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి , ఇంకా కొన్ని మొక్కలు రాజసిక క్యాటగిరీకి చెందినవి. వీటిని తీసుకోవడం వలన అభిరుచి మరియు అజ్ఞానం ఎక్కువగా కలుగుతాయట. అంతే కాకుండా ఉల్లి, వెల్లుల్లి కామాన్ని ప్రేరేపిస్తాయట. నిష్టతో ఉండాలనుకునే వారిని ఇవి డైవర్ట్ చేస్తాయట.. అందుకే ఆహారంలో వాటిని నిషేదించారట.
హిందూమతంలో సూక్ష్మజీవులను చంపడం కూడా పాపంగా భావిస్తారట. ఉల్లి, వెల్లుల్లి వేర్లుగా భూ అంతర్భాగం నుండి లభిస్తాయి.వాటిని శుభ్రం చేసే సమయంలో ఆ సూక్ష్మజీవులు హత్యకు గురవుతాయని వాటిని తినడానికే దూరంగా ఉంటారట.! మాంసం,ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తీసుకోవడం వలన ప్రవర్తన మార్పులు వస్తాయట. ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఉంటారట. ఈ విషయాలను ఆయుర్వేదంలో చెప్పారట!

హిందూ పురాణాల ప్రకారం,వేదాంతులు చెప్పిన విషయాలను బట్టి ఉల్లిపాయ, వెల్లుల్లి, పుట్ట గొడుగులు మలినపదార్థాలుగా భావిస్తారఠ. అవి పెరిగే ప్రదేశం కూడా మలినమైన చోటులో, సుచీశుభ్రత లేకుండా ఉంటాయని వాటికి దూరంగా ఉంటారట, దేవుడ్ని స్వచ్చతో కొలిచేటప్పుడు ఇలాంటివి సేకరించడం తప్పుగా భావిస్తారట.
ఇంకో మాటలో చెప్పాలంటే మనుషులు తమ మనస్సుని స్వాధీనంలో ఉంచుకోలేరు. అందువల్ల తమో గుణాలని కలిగించే ఉల్లీ, వెల్లుల్లి, మాంసము లాంటి ఇతరత్రా పదార్థాలని తీసుకోవడం తగ్గిస్తే మానసిక ప్రశాంతత కలిగి జీవిత పరమార్ధాన్ని తెలుసుకోవచ్చని బ్రాహ్మణులు నమ్ముతారు. ఈ పదార్ధాలు భగవంతునిపై మన మనస్సుని లగ్నం కాకుండా అడ్డుకుంటాయని బ్రాహ్మణులు వీటిని తినరు.
Famous Posts:

> ధనదేవత లక్ష్మి దేవి ఉండే స్థానాలు ఏవో తెలుసా ?
శ్రీ త్రివిక్రమ స్వామి | చెరుకూరు | ప్రకాశం జిల్లా 
ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం?
మీ జన్మ నక్షత్రం ప్రకారం ఏ చెట్టు నాటితే మంచిదో తెలుసా?
అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి


ఉల్లి, వెల్లుల్లి, benefits of not eating onion and garlic, why iskcon do not eat onion and garlic
onion and garlic story, why don't hare krishnas eat onion and garlic, why brahmins don t eat onion and garlic, why garlic is not an important foodstuff, onion and garlic in vedas, why yogis don t eat onion and garlic
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.