Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఇవి కనిపిస్తే శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది | Shani Anugram | SaniShani Poojan Vidhaan

శనివారం ఇవి కనిపిస్తే.. శనిదేవుడి అనుగ్రహం కలుగుతుంది .. 
శనివారానికి.. శనిదేవుడికి అవినాభావ సంబంధముంది. ఈ రోజు కొన్ని సంఘటనలు కనిపిస్తే ఎంతో శుభంగా పరిగణించాలి.
అంతేకాకుండా శనిదేవుడి అనుగ్రహం కూడా మీపై ఉందని మీరు భావించాలి. ముఖ్యంగా యాచకులు, ఊడ్చేవారు, నల్లని కుక్క లాంటివి కనిపిస్తే మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి.

శని దేవుడికి అనుకూలమైన రోజు శనివారం. సాధారణంగా శనివారం అనగానే చాలా మంది అశుభమని భ్రమపడుతుంటారు. అయితే ఇలా అనుకుంటే పొరబడినట్లే. ఈ రోజు శనిదేవుడికి అంకితం చేయబడింది. న్యాయానికి భగవత్ స్వరూపమైన శనీశ్వరుడు ఎప్పుడూ ప్రజలకు హాని చేయాలని అనుకోడు. అయితే శని చెడు ప్రభావం సోకితే మాత్రం ఇంట్లో సమస్యలు తలెత్తే అవకాశముంది. ఈయనను భక్తి, శ్రద్ధలతో కొలిస్తే సంతోషంతో పాటు ఆయురారోగ్య ఐశ్వార్యాలా సంప్రాప్తిస్తాయి. ఈ రోజు మనం అలాంటి విషయాలే తెలుసుకోబోతున్నాం.
శనివారం రోజు ఎలాంటివి శుభంగా పరిగణిస్తారు? ఎలాంటి సంఘటనలు జరిగితే పవిత్రంగా చూస్తారు? లాంటి విషయాలను ఈ రోజు మనం తెలుసుకుందాం.
​ఉదయాన్ని యాచకులు ఇంటికి వస్తే..
ఉదయాన్నే ఎవరైన వ్యక్తులు బిక్షాటన చేస్తూ ఇంటికి వస్తే చాలా మంది విసుక్కుంటారు. ఈ విధానం సరికాదు. దీన్ని శుభంగా పరిగణించాలి. అందులోనూ శనివారం ఉదయాన్నే ఎవరైనా యాచకులు ఇంటికి వస్తే త్వరలో అదృష్టం రానున్నట్లు భావించాలి. ఒకవేళ యాచకులు మీ ఇంటికి రాకపోయినా.. ఉదయాన్నే వారిని చూసినా శుభం కలుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీరు వారికి తగిన సాయం చేయాలి. ఫలితంగా మీకు శనిదేవుడి అనుగ్రహం పొంది ఎల్లవేళలా మీకు సమస్యలు రాకుండా రక్షణగా ఉంటాడు.
రోడ్లను ఊడ్చేవారు కనిపిస్తే..
శనివారం ఉదయం పూట మీ ఇంటి దగ్గర కానీ లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఎవరైన ఉడ్చేవాళ్లు కనిపిస్తే అది శుభంగా పరిగణించాలి. రోడ్లను శుభ్రపరిస్తూ వారు కనిపిస్తే ఇంకా మంచిది. ఒకవేళ ఈ విధంగా కనిపించినట్లయితే వారికి ఎంతో కొంత సొమ్మును ఇచ్చి సాయం చేయాలి.
ఈ విధంగా చేసినట్లయితే మీరు అనుకున్న పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా శనిదేవుడి అనుగ్రహం కూడా మీపై మెరుగవుతుంది.
నల్ల కుక్కని చూస్తే..
చాలామంది నలుపు వస్తువులేవైనా కనిపిస్తే అశుభంగా కనిపిస్తారు. అయితే శనిదేవుడికి ప్రీతికరమైంది నలుపు రంగే. కాబట్టి శనివారం రోజు నల్లని కుక్కని మీరు చూసినట్లయితే మంచి జరగబోతుందని మీరు భావించాలి. అంతేకాకుండా వాటికి ఆహారం అందించాలి. ఆవనూనేతో తయారు చేసిన రొట్టేను శనివారం నల్లటి కుక్కకు ఆహారంగా ఇస్తే ఇంకా మంచి జరుగుతుంది. సమయానికి మీ ఇంట్లో రొట్టే సిద్ధంగా లేకపోయినట్లయితే బిస్కట్లను అందించినా సరిపోతుంది.
ఈయన శుభదాయకుడిగా ఉంటే ఉద్యోగాలు, సేవలు, లోహాలు, పరిశ్రమలు అన్నీ అద్భుతంగా సాగుతాయి. ఉద్యోగ, ఉపాధి, వ్యాపార, వాణిజ్య రంగాలలో పేరు, కీర్తి చేకూరాలంటే శనిదేవుని అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా పరిశ్రమలలో పనిచేసేవారికి శని అనుగ్రహం తప్పనిసరి. శనివారాలలో, శనిదశ నడుస్తున్న రోజులలో భక్తులు ఆలయానికి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేసినట్టే శనివారవ్రతం అనే వ్రతం ఒకటి ఉంది. కష్టాలు, కలహాలు లేకుండా జీవితం సాఫీగా సాగాలంటే 23వేల శనిజపం చేయాలని పెద్దలు చెబుతారు.
Famous Posts:
పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు

> తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

విచిత్ర వినాయక  దేవాలయము ఓ అద్భుతమైన దేవాలయం ఉంది

రాబోయే రోజుల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించిన ఈ నిజాలు మీకు తెలుసా ?

ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా ?

తెలుగు సంవత్సరాలు 60 మాత్రమే ఎందుకు ఉంటాయో తెలుసా

అమెరికా ఏడారిలో 22 కిమీల శ్రీ చక్రం


navagraha pradakshina, navagraha pradakshina rules in telugu, saniswaran wife, saniswaran mantra, saniswaran story, Shani Bhagawan, shani pooja vidhanam, shani images, shaswaran history in telugu

Comments

Post a Comment