Drop Down Menus

శ్రీ త్రివిక్రమ స్వామి | చెరుకూరు | ప్రకాశం జిల్లా | Sri Trivikrama Swamy Cherukuru | Prakasam Dist | Hindu Temples Guide

శ్రీ త్రివిక్రమ స్వామి | చెరుకూరు | ప్రకాశం జిల్లా:

శ్రీమహావిష్ణు మహిమాన్విత అవతారాలలో చాలా ముఖ్యంగా విశేషంగా మన పురాణాలలో ఉపదేశించిన టువంటి అవతార గాధ వామన అవతారం. 

సురుల రక్షణార్థం బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి నటువంటి గాధ మనకు తెలిసినదే. పూర్వం గొప్ప దానశీలి మరియు మహా శక్తి సంపన్నుడు అయినటువంటి బలి చక్రవర్తి గర్వంగా విర్రవీగిన అటువంటి సందర్భంలో శ్రీమహావిష్ణువు వామన అవతారంనకు  నాంది పలకడం జరిగింది. 

విశ్వాన్ని జీవించాలన్న కోరిక తో విశ్వజిత్ యాగాన్ని తల పెట్టినటువంటి బలిచక్రవర్తి అడిగినవారికి అడిగినంత దానములు చేస్తూ ఉంటాడు. మహావిష్ణువు అద్భుతమైన వర్చస్సుతో వటువు రూపంలో వామనావతారము లో ఆ యాగ శాలకు చేరుకుంటారు. కేవలం మూడు అడుగుల దాన్ని దానమును  ఇవ్వవలసిందిగా కోరుతారు. బలి చక్రవర్తి దానం ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఇచ్చిన మూడు అడుగుల లో మొదటి అడుగును ఊర్ధ్వ లోకాలకు, రెండవ అడుగుతో భూతలమున ఆక్రమించి.. మూడవ అడుగు నకు చోటు చూపించవలసిందిగా కోరగా తన శిరస్సుపై ఉంచవలసిందిగా బలిచక్రవర్తి ప్రార్థిస్తాడు. అలా మూడవ అడుగును ధనస్సు రూపంలో చేసి బలి బలి తలపై ఉంచి పాతాళంలోకి తొక్కి వేయడం జరుగుతుంది. 
అంతటి గొప్ప అయినటువంటి బలిచక్రవర్తి కోరిక మేరకు ఆ మహిమాన్విత విశ్వరూపమును ముందు తరాలకు దర్శన భాగ్యము కల్పించవలసిందిగా కోరుతారు. అల ఇక్షు పురిగా,వామన నగరి గా, బలి ని చెరబట్టిన ఊరు కాబట్టి  చెరయూరు గా.. కాలక్రమేణా చెరుకూరు గా  పుణ్యక్షేత్ర మై భాసిల్లుతున్నది. 

చెరుకూరు లో  వెలసిన స్వయంభు శ్రీ త్రివిక్రమ స్వామి వారు 9:30 అడుగులు ఎత్తు లో, భూమి మీద అత్యంత అరుదైన లేత గులాబీ వర్ణంలో, మూడు పాదములతో, బలి చక్రవర్తి మరియు అతని భార్య వింధ్యావళి, తాతగారైన ప్రహ్లాదుడు, గురువుగారైన శుక్రాచార్యుడు, నారద తుంబురులు, బ్రహ్మ దేవుడు తలక్రిందుగా ఊర్ధ్వ పాద మును కడుగుతూ (అదే బ్రహ్మ కడిగిన పాదము అంటే) సూర్య చంద్రులు నిండిన రూపముతో అత్యద్భుతమైన ఏకశిలా వర్ణములో కన్నులపండుగగా స్వామి దర్శనమిస్తారు. ఈ భూతలం మీద 7 వామనావతార ఆలయాలు దర్శనమిస్తాయి. కానీ వామన అవతారమునకు స్వయంభూ సాక్ష్యంగా.. మొత్తం వామనావతార సన్నివేశాన్ని ఏకశిలపై దర్శనమిచ్చే అరుదైన ఆలయం కేవలం చెరుకూరు నందు మాత్రమే కలదు. 
ఇంతటి మహోన్నతమైన స్వామి దర్శనం జీవిత కాలంలో ఏక కాలంలో అయినా చేసుకోవలసిన పుణ్య ధామం మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత ప్రకాశం జిల్లా పరుచూరు మండలం చెరుకూరు పుణ్యక్షేత్రంలో ఉండడం మన అదృష్టం.

ఈ స్వామి సేవలో ఎందరో మహానుభావులు సేవించి తరించారు. ఈ స్వామి వారికి ఎందరో మహానుభావులు చేసినటువంటి సేవలలో శ్రీ త్రివిక్రమ ఆవిర్భావం పేరిట శ్రీ భారతుల రామకృష్ణ గారు రూపొందించినటువంటి శబ్ద కావ్యము మిక్కిలి ప్రఖ్యాతి గా పేర్కొంటారు. ఇదిగో క్రింద ఉన్న ఈ లింక్ ద్వారా మనము కూడా విని తరిద్దాం(https://archive.org/details/TrivikramaAvirbhavamBharatulaRamakrishna

ఈ పుణ్యక్షేత్రంలో వామనజయంతి, ధనుర్మాస విశేష పూజలు, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు, అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లాంఛనాలతో, దేవాదాయ శాఖ నిర్వహణలో కన్నులపండుగగా జరుగుతాయి. 
ఇంకొక విశేషం ఏమిటంటే ఈ చెరుకూరు శివకేశవ అభేదాన్ని చాటే మరొక ఆనవాలు అయినది. ఈ పుణ్య గ్రామంలోనే అగస్త్య మహాముని ప్రతిష్టించినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత అగస్త్యేశ్వర స్వామి వార్లకు మరియు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత స్వయంభు శ్రీ త్రివిక్రమ స్వామి వారికి ఏకకాలంలో కళ్యాణములు, సేవలు, బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతాయి. 
చెరుకూరు గ్రామం పర్చూరు మరియు బాపట్ల కి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో చీరాల కు 20 కిలోమీటర్ల దూరంలో గుంటూరు కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది రోడ్డు మార్గాన ఎందరో భక్తులు స్వామి సేవకై వస్తూ ఉంటారు 
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని దర్శనమునకు రండి..! సేవించండి.. తరించండి.. మన ఈ ఆధ్యాత్మిక అరుదైన సంపదను ముందు ముందు తరాలకు తెలియజేయండి. మీ రాక కోసం పదివేల మంది గ్రామ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. 
శ్రీ త్రివిక్రమాయ నమః

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

Key Words : sri Trivikrama Swamy Temple, Cherukuru, Lord Vishnu, Famous Temples In Prakasham Dist, Hindu Temples Guide, trivikrama temple history in telugu, trivikrama templea prakasham district, 
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.