Drop Down Menus

ధనదేవత లక్ష్మి దేవి ఉండే స్థానాలు ఏవో తెలుసా ? Goddess Laxmi - Sacred Places Where Goddess Laxmi Resides

ధనం మూలం ఇదం జగత్‌ అంటారు పెద్దలు. ధనానికి అధిదేవత అయిన శ్రీ లక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. అయితే ఆయా స్థానాలలో, కొన్ని పనులు చేసే దగ్గర ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెప్తారు. ఆ ప్రదేశాల గురించి తెలుసుకుందాం…

నారదుడు శ్రీ మహావిష్ణువుని శ్రీలక్ష్మి దేవి ఎక్కడ వుంటుంది అని అడుగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మి దేవి ఎక్కడెక్కడ ఉంటుందో ఆ స్థానాలు…

జీవితంలో ఆర్ధికపరమైన సమస్యలు .. మిగతా సమస్యల కంటే ఎక్కువగా బాధిస్తుంటాయి. అలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్టుగా నడచుకోవలసి ఉంటుంది. పాలు .. పూలు .. పసుపు .. కుంకుమ .. దీపం .. గోవు .. ధనం .. ధాన్యం ..  ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలుగా చెప్పబడుతున్నాయి. అందువలన వాటి విషయంలో  ఎప్పుడూ నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆధ్యాత్మిక  గ్రంథాలు చెబుతున్నాయి. వాటి విషయంలో ఎప్పుడూ భక్తి శ్రద్ధలతో వ్యవహరించవలసి ఉంటుంది.
అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అధీనంలో ఉంటే , నేను నా భక్తుల అదీనంలో ఉంటాను . మీరు నా భక్తులు, కనుక మీకు పరమైస్వర్యాన్ని అందించే ఆచలలక్ష్మిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి – అంటూ లక్ష్మి ఎవరెవరి వద్ద ఉంటుందో, ఎవరివద్ద వుండదో, వివరించాడు. ధనదేవత అయిన శ్రీలక్ష్మీని కోరుకునే వారందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవే…

శంఖద్వని వినిపించని చోటా,  తులసిని పూజించని చోట,  శంఖరుని అర్చించని చోట,  బ్రహ్మవేత్తలకు , అతిధులకు భోజన సత్కారాలు జరగని చోట. లక్ష్మి దేవి నివసించదు.  ఇల్లు కళ కళ లాడుతూ ఉండని చోట.  ఇల్లాలు ఎల్లవేళలా కంటతడి పెట్టిన చోట.  విష్ణువును ఆరాధించకుండ.  ఏకాదశి జన్మాష్టమి రోజులలో భోజనం చేసేవారి ఇంట లక్ష్మి నివసించదు.  హృదయములో పవిత్రత లోపించిన, ఇతరులను హింసింస్తున్న. ఉత్తములను నిందిస్తున్న లక్ష్మి ఆ ఇంటిలోనుంచి పారిపోతుంది. భగవద్భాక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మిదేవే కాదు.శ్రీ హరి కుడా ఉండదు.

లక్ష్మీదేవి ఉండే చోటు…
శ్రీహరి దివ్యచరిత్ర, గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖద్వని ఉన్నచోట , లక్ష్మీదేవి నివసిస్తుంది. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలు, పిల్లలను ఆదరించే చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇళ్లు శుభ్రంగా ఉన్నచోట, ప్రశాంత వాతావరణం, పసుపు, కుంకుమ వంటి సుమంగళపదార్థాలు ఉన్నచోట, ఉప్పు, తాటాకులు, మహిళల పాపిడి, మాంగళ్యం, గాజులు, దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీ నివసిస్తుందని పెద్దలు పేర్కొన్నారు.

అలాగే బాగా పొద్దుపోయేవరకూ నిద్రించేవారి ఇళ్లలోను .. సాయంత్రపు వేళలో నిద్రించే వారి ఇళ్లలోను లక్ష్మీదేవి ఉండదు. కష్టపడకుండా సోమరితనంతో కాలాన్ని వృథా చేసేవారి ఇళ్లను లక్ష్మీదేవి విడిచిపెట్టేస్తుంది. ఇక ఎప్పుడు చూసినా కలహాలతో వుండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదట. ఎక్కడైతే పవిత్రత .. ప్రశాంతత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందనే విషయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.

Famous Posts:
సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి


ధనదేవత లక్ష్మి దేవి, లక్ష్మి, లక్ష్మి దేవి, lakshmi devi nivasa stanalu, lakshmi god, lakshmi facts, lakshmi goddess, goddess lakshmi story, lakshmi mata, lakshmi statue, lakshmi devi songs, lakshmi devi katha telugu lo
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.