Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

భార్య ఎప్పుడూ భర్తకు ఎడమ వైపున ఉండాలని ఎందుకంటారో తెలుసా? | Why Wife Should Be Left Side Of Husband

భర్తకు ఎడమ వైపున భార్య ఉంటే... శక్తి సామర్థ్యంగా...| .
సాధారణంగా వివిధ ప్రాంతాలలోని ఆలయాలను దర్శించినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంటుంది. అమ్మవారితో సహా స్వామివారు వెలసిన ఆలయాల్లో ఆయనకి ఎడమ భాగంలోనే అమ్మవారు కొలువుదీరి ఉంటుంది.
అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాల్లోనూ, శుభకార్యలలోనూ భార్యభర్తలు పాలుపంచుకుంటున్నప్పుడు భర్తకి ఎడమవైపున మాత్రమే భార్య ఉండాలని పెద్దలు చెబుతుంటారు.

భార్యాభర్తలు ఫోటో దిగుతున్నా ఈ విషయాన్ని మాత్రం మరచిపోరు. ఈ ఆచారం భారతీయుల జీవన విధానంతో పెనవేసుకుపోయింది. పూర్వికులు ఏ పనిచేసిన అందులో ఒక అర్థం, పరమార్థం తప్పకుండా దాగివుంటుంది. కుడిభాగానికి ఉండే శక్తి సామర్థ్యాలు ఎడమభాగానికి అధికంగా ఉండవు. అందువలన ఎప్పటికప్పుడు ఎడమభాగానికి అదనపు శక్తి అవసరమవుతుంటుంది.

కుడిభాగాన్ని శివునికి సంకేతంగాను, ఎడమభాగం శక్తికి సంకేతంగాను చెబుతుంటారు. ఈ కుడి ఎడమల కలయికనే అర్థనారీశ్వర రూపమని అంటుంటారు.శరీరంలో ఎడమభాగం శక్తి భాగం కనుక భర్తకి ఎడమవైపున భార్య ఉండాలనే నియమాన్ని విధించారు. ఈ విధమైన ఆచారాన్ని పాటించడం వలన ఆలోచన ఆచరణ అనేవి సమపాళ్లుగా కలిసి జీవితాన్ని ఉత్సాహంగా ముందుకు నడిపిస్తాయని విశ్వసిస్తుంటారు.

Famous Posts:
పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?

సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము

శనేశ్వరుడు శనివారాల నోము

శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

శివదేవుని సోమవారపు నోము కథ

తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?


భార్య, భర్త, which side should wife stand, how husband and wife should sleep, which side husband and wife should sleep, why bride sits on right or left, what side of a man should a woman sit, wife and husband.

Comments