Drop Down Menus

గణపతి మంత్రం విశిష్టత తెలుసా? Ganapati Mantram in Telugu | Hindu Temple Guide

గణపతి మంత్రం విశిష్టత తెలుసా?
భారతీయ సంస్కృతి, హిందూ పురాణాల ప్రకారం ఏ దైవ కార్యక్రమం అయినా వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది. దాదాపు అన్ని దైవ కార్యక్రమాల్లోనూ విఘ్నేశ్వర మంత్రాలను తప్పనిసరిగా ఉచ్చరిస్తారు. వీటిని అత్యంత శక్తివంతమైనవి నమ్ముతారు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం వీటికి చాలా శక్తి ఉంది. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు. హిందూ సంప్రదాయం శైవం, వైష్ణవం అన్ని ప్రాంతాల్లోనూ, అన్ని ఆచారాల్లోనూ వినాయకుని ప్రార్థన, పూజ సాధారణం. 
" ఓ గం గణపతియే నమ: "

ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది. కౌండిన్య యోగ ప్రకారం మూల అంటే వేరు.. అధార అంటే పునాది. ఒక్కసారి ఈ చక్రం ఉత్తేజితమై శక్తి జనించి, సక్రియమైతే శరీర వ్యవస్థ మొత్తం మన అధీనంలోనే ఉంటుంది.
Also Read : > విచిత్ర వినాయక  దేవాలయము ఓ అద్భుతమైన దేవాలయం ఉంది
ఈ మంత్రాన్ని జపించడం ద్వారా ఆటంకాలు తొలగిపోతాయి. అంటే దీని వల్ల జీవితంపై సానుకూల ధృక్పథం ఏర్పడుతుంది. దీనికి గురుగ్రామ్‌లో జరిగిన ఓ సంఘటనే ఉదాహరణ. మంత్ర యోగాలో భాగంగా 8 మంది సాధకులు వీరిలో సంప్రదాయ సంగీత కళాకారుడు కూడా ఉన్నాడు. 
Also Read> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

గణపతి మంత్రాన్ని ఉచ్చరిస్తూ తంబురను వాయిస్తుండగా శరీరంలో ఒకరకమైన వైబ్రేషన్లు, ఆనందకరమైన అనుభూతి చెందారు. అలాగే సున్నితమైన ధ్వని తన శరీరం నుంచి కూడా వెలువడిందని సంగీత కళాకారుడు కూడా తెలిపాడు. అమెరికా పర్యటించిన ఓ భారతీయ ఆధ్యాత్మిక వేతక్తు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మంత్రాలను ఉచ్చరించేటప్పుడు శరీరంలో జరిగే చర్యలను ఏడుపు, కన్నీళ్ల ద్వారా బయటకు వ్యక్తం చేస్తుంటారు.
గణేశుడుకి సంబంధించి అనేక మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలన్నీ సమాన శక్తివంతమైనవే. వీటిలో మీకు ఇష్టమైన దానిని ఎంపిక చేసుకుని ఉచ్చరించవచ్చు. ఏదైనా మంత్రం తాలూకా సామర్ధ్యం ప్రాథమికంగా భావాలు, భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది. అలా పఠించినప్పుడే మరింత తీవ్రమైన ప్రభావం చూపుతుంది. చిలుకకు మనం నేర్పించిందే మళ్లీ వినిపిస్తుంది. దానికి అర్థం చేసుకునే కళగానీ, ప్రాముఖ్యత తెలియదు. అలాగే మంత్రోచ్ఛారణ విషయంలోనూ అర్థం తెలియకుండా వల్లిస్తే ప్రయోజం లభించదు.

Famous Posts:

వారాహీ తల్లిని పూజిస్తే పంటలు బాగా పండుతాయి  

శ్రీలక్ష్మీపూజ ఇలా చేస్తే ధనమే ధనం 

 > యూట్యూబ్ ద్వారా డబ్బు సంపాదించాలని ఉంటే, ఈ విధంగా చెయ్యండి

బియ్యపు గింజతో ఇలా చేస్తే ధన లాభం కలుగుతుంది ఎలాగో తెలుసా ? 


ganapati mantra visistatha, ganesh mantra lyrics in telugu, ganapati mantra lyrics, ganesh mantra 108 times, ganesh mantra in sanskrit, ganapati, ganapati matram telugu, lord ganapati.
ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.