Drop Down Menus

తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుందా..? Talli Tandrulu Chesina Tappulu | Dharma Sandehalu

తల్లితండ్రులు చేసిన పాపాలు పిల్లలకు వస్తుంది అని పూర్వీకులు చెబుతుంటారు. అయితే దాన్నే జాతకంలో పితృశాపం అని, స్త్రీ శాపం అని అంటారు. నన్నడిగి కన్నావా? కన్నప్పుడు భరించాలి అని అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము.
నిజానికి అడిగి కనడం కాదు, వారిని నీవే ఎంచుకున్నావు. జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లితండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. ఆ కుటు౦బంలో ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది. అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది. సర్పాలను చంపినప్పుడు సర్పశాపం పితృ దేవతలకు శ్రాద్దం నిర్వహించనందువలన పిత్రుశాపం సంక్రమిస్తాయి. వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగాలు రావు, వచ్చినా అభివృద్ధి ఉండదు. సంతానం కలగదు. వ్యాపారాలలో నష్టం మొదలయినవి వస్తాయి. ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తరువాతి తరం అనుభవిస్తుంది.
ఆడా, మగ అయినా సరే వయసులో దురలవాట్లకు బానిసైతే, ఆ పాపం తరువాతి తరం వ్యాధుల రూపంలో అనుభవిస్తుంది. అవిటిగా పుట్టడం, పుట్టుకతోనే భయంకరమైన వ్యాధులు సోకడం. ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా, కాల క్రమేనా అవయవాలు పాడవడం జరుగుతుందని కొంత మంది పండితులు చెబుతున్నారు. దానినే "వంశపార్యపరం" అంటారు. అందుకే మనం వయసులో "ధర్మoగా" ఉంటే, మనకు పుట్టే వారు కూడా అదే ధర్మాన్ని పంచుకుని పుడతారు. జీవితంలో వృద్ధి చెందుతారు.

అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లలు జీవితంలో వ్రుద్ది ఉండదు. పిల్లలను చూసి తల్లితండ్రులు భాద, మనస్తాపానికి గురవుతారు. నిజానికి ఆనుభవించేవారికంటే వారిని చూసేవారి బాధే ఆధికంతా ఉంటుంది.

|| గురుధ్యానం ప్రపద్యామి పుత్ర పిడోపశాంతయే || అని శాస్త్ర వాక్కు. గురు/బృహస్పతి ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తోలగుతుంది. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినపుడు, అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు. అతడిపై ఆ ప్రభావం ఉంటుంది.
ఈ లోకంలో ఉండే అన్ని జీవులలో దత్తుడు ఉన్నాడు. అంటే గురు అవతారం దత్తాత్రేయుడు తెలిసో తెలియకో ఇతరులను విమర్సి౦చడం అంటే దత్తుడిని అవమానించడం, విమర్శించడమే. అది కూడా కొంత పాపాన్ని సమకూర్చిపెడుతుంది. అది కూడా గురుశాపానికి కారణమవుతుంది.

పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది. పచ్చని మొక్కలు/చెట్లను నరికితే, అది జాతకంలో గురుదోశంగా కనిపిస్తుంది. కళ్ళముందే పిల్లలు మరణించడం, స్త్రీ సంతానం ఉంటే వారు వైవిధ్యం పొందడం వంటివి జరుగుతాయి. అదే పండ్లు, కాయలు, పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే, సంతానం కూడా కలగని సందర్బాలు౦టాయి. అంటే ఆ పిల్ల పుట్టింట్లో కుర్చుని ఏడుస్తుంది. ఆమెను చూసి తల్లితండ్రులు ఏడుస్తారు. దానికి కారణం ఆ బిడ్డ తల్లితండ్రులు చేసిన పాపం. అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతుంటే, పిల్లలున్న వాడివి, పచ్చని చెట్లు కొడుతున్నావ్, ఎంత తప్పు చేస్తున్నావో అని మన పెద్దలు అంటూ ఉంటారు.
ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసం, తన పిల్లల కోసం. వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు. ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే, ఇతరులకు ద్రోహం చేస్తే, వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది. ఆ అవినీతి పరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే. అందుకే వారి పిల్లలు అకాలమరణాల పాలవుతారు.

ఇలా ఎన్నో రకాలుగా తల్లితండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది.
Related Posts:





శివ గుణాలు లోకానికి సందేశాలు

భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


తల్లిదండ్రులు, పాపం, పిల్లలు, Talli Tandrulu, Tappulu, dharma sandehalu telugu, dharma sandehalu telugu book, parents meaning, parents, importance of parents, devotional Story's.
ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.