Drop Down Menus

గ్రహదోషం, శతృదోషం, వాస్తుదోషం సమస్యలు ఉన్న వారికి కూష్మాండ దీపారాధన చేయాలి? Kalabhairava kushmanda amavasya deepam

కూష్మాండ(గుమ్మడికాయ)దీపం..

గ్రహదోషం, ఋణదోషం,శతృదోషం, వాస్తుదోషం సమస్యలు ఉన్న వారికి కూష్మాండ(బూడిద గుమ్మడి కాయ) దీపారాధన చేయాలి.

పౌర్ణమి వెళ్లిన తరువాత వచ్చే అష్టమిని బహుళ అష్టమి అంటారు. దానినే కృష్ణ అష్టమి మరియు కాళాష్టమి అని కూడా అంటారు. కాల బైరవ స్వామికి ఈ అష్టమి అంటే చాలా ఇష్టం.అందుకని ఆ రోజు కాలబైరవ స్వామికి కూష్మాండ(బూడిద గుమ్మడి కాయ) దీపారాధనచెయ్యాలి.

కూష్మాండ(గుమ్మడికాయ)దీపం అంటే ఏంటి, ఎలా వెలిగిస్తారు, దేని కోసం వెలిగిస్తారనేది తెలుసు కుందాం, ముందుగా కూష్మాండ దీపం ఎలా పెడతారనేది తెలుసుకుందాం, ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే గుడిలో వేరుగా చెయ్యాలి. ఒక వ్యక్తికి దృష్టి దోషం, నర ఘోష ,శని దోషం, ఆర్ధిక సమస్యలు, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ అవ్వడం పిల్లలు మాట వినకపోవడo మొదలైన సమస్యలు ఉన్న వారికి కాల భైరవ తత్వం ప్రకారం, మంచి పరిహారం ఇది అందరు చేసుకోవచ్చు, కేవలం భక్తి శ్రద్ధ కావాలి అంతే,

ఈ దీపారాధన ను ఎలా చేయాలి అంటే , ఎవరైతే ఈ దీపారాధన చెయ్యాలి అనుకుంటారో వారే స్వయంగా బూడిద గుమ్మడి కాయను మధ్యకు సమానం గా కోసి, దాని లోని గుజ్జుని, గింజలను తీసివేసి ,దానికి పసుపు కుంకుమ పెట్టి ,నువ్వుల నూనెను పోసి,పత్తి తో గాని,గుడ్డతో గాని వత్తిని వెలిగించాలి.దాని క్రింద ఇత్తడి పళ్లెం పెట్టాలి. అంతే గాని వేరే వాళ్ళు రెడి చేసిన గుమ్మడి కాయ దీపాన్ని మనం వెలిగిస్తే ఫలితం కచ్చితంగా రాదు.

ఆ తరువాత వెలిగించిన కూష్మాండ(బూడిద గుమ్మడికాయ) దీపారాధన కు నమస్కరించి మొదట తల్లికి, తండ్రికి, గురువుకి, కుల దేవునికి, గ్రామ దేవతకు,చండి మాతకు, చివరగా కాల బైరావ స్వామికి నమస్కారం చెప్పుకొని, అప్పుడు ఇలా అనుకోవాలి నేను కూష్మాండ(బూడిద గుమ్మడికాయ) దీపారాధన చేస్తున్నాను నా జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు అన్ని తొలగింప బడి సుఖం, సంతోషం, సౌభాగ్యం కావాలని కోరుకోవాలి.ఆతరువాత పంచోప చార పూజ (అంటే గంధం,కుంకుమ,పసుపు,దీపం)చేసి అగరు వత్తులు వెలిగించి గుమ్మడి కాయకు గుచ్చండి.తర్వాత కాల బైరావ నామవలి లేక అష్టకం చదవండి.ఈ పూజ కులం, మతం, లింగ భేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు.

ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర కాల భైరవ అష్టకం 11 సార్లు చదవాలి. ఈ దీపారాధన

బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ చెయ్యాలి.

ధన యోగం కోసమైతే అష్టమి రోజు చెయ్యాలి.

జనాకర్షణ కోసమైతే అమావాస్య రోజు చెయ్యాలి.

ఈ దీపారాధన 19 అష్టమి తిథులు కానీ 

లేదా 19 అమావాస్య తిథులు కానీ చెయ్యాలి.

పూజ చివరకు ఎండు ఖర్జూరం ప్రసాదంగా పెట్టాలి.

పూజ చేసిన రోజు ఉపవాసము ఉండాలి ఘన పదార్థం తినకుండా ద్రవ పదార్థం మాత్రమే తీసుకోవాలి. ఉదయం 4:30 నుండి 6:00 మద్యలో చెయ్యాలి, సంకల్పము చెప్పుకోవాలి కోరిక లేదా సమస్య తీరాలి అని చెప్పుకోవాలి. చండి హోమం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఈ కూష్మాండ దీపారాధన చేస్తే అంత ఫలితం వస్తుంది అనేది శాస్త్ర నిర్వచనం.

ఇది భక్తి శ్రద్ధలతో చేసినవారి జీవితంలో ఉన్న పూర్తి నరదృష్టి గ్రహ వాస్తు పీడలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ దీపారాధన అత్యంత శక్తి వంతం అయినది విపరీత జన/ధన ఆకర్షణ పెరుగుతుంది. సమస్యలు సమసిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కూష్మాండ(బూడిద గుమ్మడికాయ) దీపారాధన చేసుకొని మీరు కోరిన కోరికలు తీర్చుకుంటారు అని ఆశిస్తూ.

Famous  Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

కూష్మాండ దీపారాధన, Kushmanda, Kalabhairava kushmanda amavasya deepam, ratri goddess, kaushiki goddess, kalratri maa, goddess skandmata images, katyayani devi story, nav durga significance, skandamata mantra in telugu, 9 days of navratri devi names

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.