భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 13 అందమైన పురాతన దేవాలయాలు ! The 13 Best Ancient Temples in India You Should Visit
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 13 అందమైన పురాతన దేవాలయాలు !
భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులకు కొదువలేదు. అప్పట్లో రాజులు, రాజవంశాలు అనేక ఆలయాలను నిర్మించి వాటి పోషణార్థం మన్యాలను, మడులను, భూమిని ధారాదత్తం చేశారు. ఆ రోజుల్లో అత్యధిక ధనిక, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. పరమతస్థులు ఆలయాల మీద దాడికి తెగబడటానికి కారణమూ ... అదే
భారతదేశంలోని ఆలయాలను చాలావరకు రాజవంశ పాలకులు నిర్మించినవే. వీటిలో కొన్ని మాత్రమే అద్భుత కట్టడాలుగా, వారసత్వ సంపదలుగా నిలిచాయి. ఇండియాలోని కొన్ని పురాతన మరియు అద్భుత ఆలయాల నిర్మాణాలను ఒకసారి గమనిస్తే ..!
బృహదీశ్వరాలయం
తంజావూరు లోని బృహదీశ్వరాలయాన్ని చోళ రాజు రాజరాజ చోళుడు క్రీ.శ. 1002 లో నిర్మించాడు. ఇందులో ప్రధాన దైవం శివుడు. ఈ దేవాలయం అష్టదిక్పాలకుల విగ్రహాలు కలిగిన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయము ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటి.
కైలాశనాథ్ ఆలయం
కైలాశనాథ్ ఆలయం ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లోరా గుహలలో కలదు. పెద్ద రాతి కొండల నుండి తవ్వబడిన ఈ గుహలలో హిందూ, బౌద్ధ మరియు జైన మత దేవాలయాలు, సన్యాసి ఆశ్రమాలు ఉన్నాయి. 16 వ గుహలో ఉన్న కైలాస నాథ దేవాలయం 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. కైలాశనాథ్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్దదైన ఏకశిలా శివాలయం.
చెన్నకేశవ దేవాలయం
కర్ణాటకలో ప్రసిద్ధి గాంచిన చెన్నకేశ దేవాలయం బేలూరు లో కలదు. ఈ దేవాలయాన్ని మృదువైన సున్నపురాయిని ఉపయోగించి నిర్మించారు. హొయసల విష్ణువర్ధనుడు క్రీ. శ. 11 వ శతాబ్దంలో దీనిని నిర్మించాడు. విజయనగర కాలంలో ఆలయం యొక్క రాజగోపురాలు నిర్మించబడ్డాయి.
తుంగనాథ్ మందిర్
తుంగనాథ్ మందిర్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చొప్త లో కలదు. ఈ ఆలయం ప్రపంచంలోనే ఎత్తైన శివాలయంగా పేరుగాంచినది. ఇతిహాసాల మేరకు, పాండురాజులలో ఒకడైన అర్జునుడు దీనిని నిర్మించాడు. ఆలయంలో తంగనాథ్ (పీక్స్ లార్డ్) దేవుడే కాక, వివిధ దేవుళ్ళు, దేవతల ప్రతిమలు కూడా ఉన్నాయి.
ఆది కుంభేశ్వరర్ ఆలయం
ఆది కుంభేశ్వరర్ ఆలయం తమిళనాడు లోని కుంభకోణం పట్టణంలో కలదు. ఇందులో ప్రధాన దైవం శివుడు (ఈయననే ఆది కుంభేశ్వరర్ అని పిలుస్తారు). ఈ దేవాలయాన్ని చోళులు నిర్మించినట్లు చెబుతారు. 9 అంతస్తుల ఎత్తుకలిగిన రాజగోపురం గుడి యొక్క ప్రధాన ఆకర్షణ.
జగత్ పిత బ్రహ్మెశ్వర్ మందిర్
సృష్టికర్త బ్రహ్మ కు ఆలయాలు అరుదు. రాజస్థాన్ లోని పుష్కర్ అందులో ఒకటి. 2000 సంవత్సరాల పురాతన ఈ ఆలయం క్రీ. శ. 14 వ సంవత్సరంలో నిర్మించినట్లు చెబుతారు. నాలుగు శిరస్సులతో కమలంలో కూర్చొని ఉన్న బ్రహ్మదేవునికి ఒకవైపు గాయత్రీ దేవి, మరోవైపు సావిత్రీ దేవిల చిత్రం కలదు.
శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం
తిరునల్వేలి లోని శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని కృష్ణవర్మ రాజు నిర్మించాడు. ఆలయం తమిరబరని నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రధాన విరాట్టు లేదా "మూలవార్" వీరరఘవన్ కాగా ఉత్సవమూర్తి శ్రీ వరదరాజ పెరుమాళ్, ఆలయ సమయాలు ఉదయం 7.00 గంటల నుండి 11.00 వరకు సాయంత్రం 6.00 నుండి 9.00 వరకు.
సూర్యదేవాలయం
భువనేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోణార్క్ స్మారక కట్టడాలు కలిగిన అందమైన పట్టణం. ఇక్కడ గల అత్యంత ఆకర్షనీయమైన సూర్యదేవాలయాన్ని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తుంటారు. దీనిని క్రీ. శ. 13 వ శతాబ్దంలో నరసింహదేవ నిర్మించాడు.
దిల్వార జైన దేవాలయం
దిల్వార జైన దేవాలయం రాజస్థాన్ లోని మౌంట్ అబూ సమీపంలో కలదు. రాజస్థాన్ మొత్తం మీద అత్యంత అందమైన దేవాలయాలుగా జైన దేవాలయాలు ప్రసిద్ధి గాంచాయి. ఈ దేవాలయాలను తెల్లటి పాలరాయితో అత్యంత అందంగా చెక్కారు.
పంచ రత్న ఆలయం
పశ్చిమ బెంగాల్ లోని బంకురా పట్టణంలో పంచ రత్న ఆలయం కలదు. దీనిని క్రీ.శ. 1643 వ సంవత్సరంలో రాజు రఘునాథ సింఘ కట్టించాడు. సున్నపురాయి, ఇటుకల సహాయంతో నిర్మించిన ఈ అద్భుత కట్టడం బెంగాల్ వారసత్వ సంపదగా నిలిచింది. ఆలయ గోడలపై పలు ధార్మిక, సాంస్కృతిక కథలు, కథనాలు గమనించవచ్చు.
బాదామి గుహలు
బాదామి కర్ణాటక రాష్ట్రంలోని ఒక పురాతన పట్టణం. చాళుక్యులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించేవారు. బాదామి దాని గుహాలయాలు ప్రసిద్ధి చెందినది. ఇందులో మొత్తం నాలుగు గుహాలయాలు ఉన్నాయి.
విఠల ఆలయం
విఠల ఆలయం విజయనగర సామ్రాజ్యానికి రాజధానైన హంపి లో కలదు. ఇది విష్ణుమూర్తి దేవాలయం. క్రీ.శ. 16 వ శతాబ్దంలో రెండవ దేవరాయ రాజు ఈ ఆలయాన్ని తుంగభద్ర నది ఒడ్డున నిర్మించాడు. ఈ ఆలయంలో ఏ స్తంభాన్ని తాకినా సంగీతం వినిపిస్తుంది.
Also Read : ఇంటి ముందు ముగ్గులు ఎందుకు వెయ్యాలి ?
ఓర్చా ఆలయాల సముదాయం
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని తికంగర్ జిల్లాలో బెత్వా నది తీరాన క్రీ.శ. 15 వ శతాబ్దంలో బుందేల్ఖండ్ రాజు రుద్ర ప్రతాప్ సింగ్ ఓర్చా పట్టణాన్ని స్థాపించాడు. దీనికి సమీపంలో ఖజురహో ఆలయాల సముదాయం కలదు. పట్టణంలో చతుర్భుజ ఆలయం, లక్ష్మి ఆలయం మరియు రామ్ రాజ ఆలయంలు కలవు.
Famous Posts:
> కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?
> మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి
> సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం
> మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.
> భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?
> మహాభారతం నుండి నేర్చుకోవాల్సిన 12 ముఖ్యమైన విషయాలు.
> భారతీయులు ప్రతి ఒక్కరూ తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు
> ఈ స్తోత్రం ప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి
top 100 richest temples in india, top 10 temples in india, top 10 richest temples in india, famous temples in india with states, famous temples in india list, top 5 temples in india, top 10 hindu temples in the world, biggest temple in india
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment