Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

పెళ్లి రోజు పెళ్లి కూతురుతో అస్సలు చెప్పకూడని అనకూడని 6 విషయాలు ఇవే..! | The 6 Talks a Couple Needs to Have Before Marriage

 

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం . ముఖ్యంగా ఆడపిల్లకి. ఎందుకంటే పెళ్లి తర్వాత తన పుట్టింటిని వదిలేసి, అత్తవారింట్లో కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్యకి వెళ్లాల్సి వస్తుంది.

అలాంటప్పుడు మనసులో ఎన్నో సందేహాలు, ఆలోచనలు సహజం. అలాంటప్పుడు మనం పెళ్లి కూతురితో మరికొన్ని విషయాలు మాట్లాడి తనని మరింత కృంగదీయకూడదు. పెళ్లికూతురితో ఏ విషయాలు మాట్లాడకూడదో, వేటికి వాళ్లెక్కువ డిస్టర్బ్ అవుతారో ఒకసారి చదవండి.

Also Readకొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది..

1. పెళ్లంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆడపెళ్లి వారికి మరీ ఖర్చులెక్కువ, కట్నం, పెళ్లి పనులు వగైరా బరువంతా ఆడపెళ్లి వారిపైనే ఉంటుంది. కాబట్టి మనం పెళ్లికూతురితో కట్నం ఎంత? పెళ్లికి ఎంత ఖర్చుపెడుతున్నారు ? లాంటి క్వశ్చన్స్ అడగకూడదు. దీనివల్ల మనకి తెలియకుండానే ఆ అమ్మాయిలో ఆలోచన స్టార్ట్ అవుతుంది నా గురించి మా ఫ్యామిలి ఇంత ఖర్చు పెడుతుందా అని.

2. జీవితంలో ఒకేసారి వచ్చే ముఖ్యమైన అకేషన్ పెళ్లి . అలాంటి పెళ్లి లో అందంగా కనపడాలని బంధువులే అనుకుంటారు. మరి పెళ్లికూతురు ఇంకెంత అందంగా ఉండాలి. దానికోసం పెళ్లికి ముందే ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంది. దానివల్ల కొంచెం లావైంది అనుకోండి. అంతే మనవాళ్లు ఒళ్లు చేసినట్టున్నావ్ అని కామెంట్స్ చేస్తారు. లావు అనేది ఒక పెద్ద సమస్య, అది మనిషిని సైకలాజికల్ గా ఎంత కృంగదీస్తుందో అందరికి తెలిసిన విషయమే. కాబట్టి నో బాడీ షేమింగ్.

3. ఆంటీ అనే పిలుపు, కేవలం పెళ్లైనంత మాత్రానా ఆంటి అయిపోతారా? ఆంటీ ఆంటీ అంటూ స్నేహితులు, చుట్టాలు ఆటపట్టించడం కామన్ . కాని ఆ మాటలు మెంటల్ గా బాగా డిస్టర్బ్ చేస్తాయి.

4. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా పెళ్ళి కుదిరిందో లేదో, లేదంటే పెళ్లయిందో లేదో వెంటనే వచ్చే ప్రశ్న పిల్లల కోసం ప్లాన్స్ ఏం చేయట్లేదా? ఎన్నో కలలతో అత్తింట్లో అడుగుపెట్టే అమ్మాయికి భర్తతో, తన ఫ్యామిలితో మింగిల్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. వెంటనే పిల్లలు అంటే ,తాను కేవలం పిల్లల్ని కనే మెషీన్నా అనే నెగటివ్ ఆలోచనలకి మనమే బీజం వేసినవారమవుతాం.

5. పెళ్లి అన్నాక వరుడి తరపు వారు మర్యాదల్లో లోటు జరిగిందని, కోపతాపలు సహజం. కాని వీలైనంత వరకు ఈ గొడవల్ని పెళ్లి కూతురి దృష్టి కి తీసుకురాకపోవడం మంచిది.

6. పెళ్లి చేసుకునేది సంతోషంగా బతకడానికి, అలాంటి పెళ్లిలో భర్తతో గొడవపడకు, దేనికైనా సర్దుకుపోవాలి అని చెప్తుంటారు. పిల్లకి మంచి చెప్తున్నాం అనుకుంటారు చాలామంది. కాబట్టి పెళ్లయ్యక గొడవలుంటాయి అనే లేని భయాల్ని క్రియేట్ చేయకుండా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి.

Famous Posts:

గుడి దగ్గర్లో ఇల్లు ఉండకూదనడానికి ఖచ్చితమైన కారణాలు ఇవే


ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?


చేతిలోని డబ్బు నిలవాలంటే...ఏమి చేయాలి?


రజస్వల వివరణ - దోషము -నియమ నిబంధనలు


అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..?


మనసులోని కోర్కెలు తీర్చే దశావతార నృసింహ మంత్రము


దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకో తెలుసా?

pelli, marriage, marriage importance, tali, importance of marriage essay, marriage history, పెళ్లి, పెళ్లి కూతురు, bridal, bridal meaning

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు