Drop Down MenusCSS Drop Down MenuPure CSS Dropdown Menu

జీవితంలో ఎవరికీ చెప్పకూడని విషయాలు ! Don't tell anyone these things | don't tell anyone ?


జీవితంలో ఎవరికీ చెప్పకూడని విషయాలు!
మనిషి తన వయస్సు గురించి గానీ, ధనం గురించి గానీ, ఆయుస్సు గురించి గానీ ఇతరులకు ఎవరితోను పంచుకోకూడదట... ఎన్నో అనర్ధాలు తెచ్చిపెడుతుందట. ఆయువు,అంటే వయస్సు చెప్పకూడదు అని ఒక అర్థం.
పురాణాలు మరియు ఋషులు ప్రకారం అయ్యుష్హు ఎంతో తెలిసినా చెప్పకూడదు.ఇద్దరు కలిసి ఇష్టపడి పంచుకున్న ప్రేమను మరియు యింటిలోని కలతలు, బయటి వారికి చెప్పకూడదు.మీరు చేసిన దానము కూడా నేనింత చేశానని చెప్పుకోకూడదట.మనకు జరిగిన అవమానమును కూడా.ఎవరికీ చెప్పకూడదట.ఇద్దరు ఎంతో మంచి హృదయంతో కలిసిన సంగమము గురించి కూడా చెప్పకూడదట. మంత్రమును, ఔషధము ఎలాగ తయారు చేసినదీ కూడా గోప్యముగానే వుంచుకొనవలయును. ఈ తొమ్మిదింటినీ గోప్యముగా వుంచవలయునని పురాణాలు మరియు ఋషులు యొక్క భావము.
ఆయువు: 
భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ 'వివేకము' అనే గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు. అలాగే నిన్న జరిగిన విషయం గుర్తుకుతెచ్చుకుంటే తప్ప గుర్తుకురాదు. ఇపుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు. రేపు జరుగబోయేది ఏం చేసినా తెలియదు.

ఈమూడు కారణాలవల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు. మరుక్షణంలో మనిషి ఛస్తాడని తెలిస్తే, ముందు ఆ క్షణమే విపరీతంగా ఆలోచనతో చావడం ఖాయం. నిజంగా నీ ఆయుఃప్రమాణం ఇదీ అని తెలిసినా, నిబ్బరంగా ఉండి, దాన్ని రహస్యంగా ఉంచాలి. లేకుంటే అది బహిరంగ రహస్యమై వాడిని బాధిస్తుంది.

కాబట్టి భవిష్యత్తు జ్ఞానంలో ఆయుష్షుది ప్రధాన పాత్ర. అది తెలిసినా గోప్యంగా ఉంచమన్నాడు శాస్తక్రారుడు.

విత్తం - ధనం:
ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి. దానివల్లఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఎంత ధనం ఉన్నా, ఆ మనిషి జీవన విధానం క్రమబద్ధంగా, క్రమశిక్షణతో నీతి నిజాయితీ గా భగవంతుని దీవెనలు ఆశీస్సులతో ఆయన బిడ్డ గా మంచి ఆలోచనలతో ఉన్నపుడు మనకు నష్టం జరుగదట. 'లక్షాధికారైనా లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మ్రింగబోడు' అన్నట్లు అతి సాదారణ నిరాడంబర జీవనం గడపడానికి అలవాటు చేసుకోవాలి. ధనం ఉప్పులాంటిది. అది ఎక్కువైనా, తక్కువైనా రెండూ కష్టమే.
అతి సంచయేచ్ఛ తగదు' అన్న నీతి చంద్రిక వాక్యం ధనం విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజం. అయినా మన దగ్గర ధనం ఉన్నవిషయం (భార్య భర్తలు మధ్య మాత్రమే ఉండాలట) అలాకాకుండా ఇతరులకు చెప్పి, (భార్య భర్తలు కాకుండా) నేను, చాలా గొప్ప అని అనిపించుకోవడం కోసం, లేదా పొగడ్తల కోసం అనవసరంగా బయటకు వెల్లడించడం ప్రమాదకరం. ధనానికి ధర్మం, రాజు, అగ్ని, దొంగ అనే నలుగురు వారసులు. ఇందులో పెద్దవారసుడు ధర్మం.

అతడు నలుగురికీ అన్న. తండ్రి ధనంలో పెద్దన్నకు పెద్ద వాటా రావాలి. అంటే ధర్మానికి డబ్బు ఎక్కువ వినియోగించాలి. తల్లిదండ్రుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు, వారి కోరిక మేరకు వారు ఆశించిన పనులు తప్పక చేయాలట..

ఎందుకంటే మొదటి ధైవం తల్లిదండ్రులు కనుక వారి ఆశీస్సులు దీవెనలు ఎప్పుడూ బిడ్డలకు ఉండాలని భగవంతుని కోరికట. ధర్మకార్యాలకు ధనం వినియోగించకపోతే, నీతి నియమాలు పాటించకపోతే దాన్ని ఇతర దుర్మార్గమైన వ్యక్తులు స్వాధీనపరచుకోవడమో, అగ్ని ప్రమాదాలవల్ల నష్టమో, దొంగలు దోచుకోవడమో స్వంత రక్త సంబంధం వారే మోసం చేయడమో జరుగుతుందట.
గృహచ్చిద్రం - ఇంట్లోని గొడవలు: 
ఇంట్లో ఎన్నో సమస్యలుంటాయి. దానినే 'ఇంటిగుట్టు' అని పిలుస్తారు. కుటుంబంలో ప్రేమ పూర్వక వాతావరణం నిర్మాణం చేయాలి. అప్పుడప్పుడు ఆ ప్రేమలకు అవరోధం ఏర్పడి కలహాలు సంభవిస్తూంటాయి. అయినా సరే, వాటిలో రహస్యాలను ఇతరులకు అంటే మూడో వ్యక్తికి వారు ఎంత పెద్ద వారైనా సరే బహిరంగం చేయాలనుకోవడం తెలివితక్కువ పని. దాని వల్ల కలిగే నష్టాలను అంచనా వేయలేరట.

ఆ ప్రేమ బంధం ఆ ఇద్దరు సామరస్యంగా పరిష్కారం కనుక్కోవడం తెలివైన పని. తండ్రి- కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు, అక్కాచెలెళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. వ్యక్తిగత అహంకారాలు, ఒంటరిగా జీవించాలనుకొనే స్వార్థబుద్ధి, మా వరకే మంచిగా వుండాలనే వ్యక్తిత్వం- ఇవన్నీ ఈరోజు మన కుటుంబ వ్యవస్థను ధ్వంసం చేశాయి. ఏది జరిగినా ఇంటి గుట్టును ఈశ్వరునికే తెలిసేటట్లు ఉంచాలిగాని బహిరంగపర్చడం ధర్మంకాదు. అందుకే మన పెద్దలు అనేవారు . ఇంట్లో గొడవ ఉంటె ఇల్లెక్కి అరవొద్దు, కంట్లో నలుసు పడితే కన్నును పోడుచుకొవద్దు. అని అన్నారు. 

మంత్రం: 
''మననం చేసేది మంత్రం''- మంత్రం రహస్యంగా చెవిలో ఉపదేశం చెయ్యడం మన సంప్రదాయం.

మంత్ర వైశిష్ట్యం తెలిసినవారికి చెప్పడంవల్ల దాని ప్రయోజనం నెరవేరుతుంది కాని అపాత్రునికి చెప్పడంవల్ల నష్టమని భావన. దానిమీద భక్తిలేని వాడికి చెబితే అది అభాసుపాలవుతుంది. మంత్రంపై అచంచల నమ్మకం ఉండాలి. *ఔషధం: ప్రపంచంలో ప్రతి మొక్క ఔషధమే.

ఇవాళ భయంకర రసాయనాలు ఔషధాలుగా ఉపయోగిస్తున్నాం. ఇవి అందరికి బహిరంగ పరచి ఎవ్వరంటే వారు తయారుచేయకూడదు. ఔషధం రహస్యంగా ఉంచడం మంచిదే.
సంగమం - శృంగారం:
సంగమం అంటే కలయిక. మనుషులు భార్య భర్త మధ్య జరిగిన కలయిక సంగమము గురించి ఒక్క కన్న తల్లి తప్ప మరో ఏ ఇతర వ్యక్తులకు ఆ అందమైన అనుభవం గురించి చెప్పకూడదట. ఆ రహస్యమైన భగవంతుని దీవెనలు ఆశీస్సులతో రెండు మనసులు కలిసి ఎంతో పవిత్రమైన కార్యం జరుపుతారట . అటువంటి కార్యాన్ని ఏ ఇతర మూడో వ్యక్తి కి ప్రాణం పోయినా చెప్పకూడదట. రహస్యంగా ఉంచడం ఉత్తమం.

అలాగే గొప్పవారు అనుకునే వారి జీవితాల్లో ఎన్నో రహస్యలున్న ఒక్క భగవంతుని క్షమాపణలు అడిగి తప్పు తెలుసుకుని వాటి నుండి మంచి మార్గంలో పయనించాలి. అవి బహిర్గతమైనపుడు వారి వ్యక్తిత్వాలపై మచ్చ ఏర్పడుతుంది. కాబట్టి మనం చేసే సంగమం (భార్య భర్తలు) రహస్యంగా ఉంచడం మంచిది. *దానం: దానం అన్నింటిలో చాలా గొప్పది.

అది రహస్యంగా చేస్తే మంచిది. చేసిన దానం ఊరికే చెబితే ఫలం ఇవ్వదు. మనం చేసిన దానం రహస్యంగా ఉంచితే వెంటనే ఫలం ఇస్తుంది. దానినే గుప్త దానం అంటారు.

గొప్పలు చెప్పుకుంటున్న భగవంతుని ఆగ్రహం తప్పదట. మనది కాదు అని తెలిసిన మరుక్షణం అది మన వద్ద ఉంచుకోకూడదట. దాని వల్ల మన వద్ద ఉన్న మన స్వంత సంపదను దేవుడు మరింత తీసివేస్తాడట. ఈ విధంగా పురాణాలు ధైవ గ్రంధాలలో రాశారు.
మానం: 
అంటే శరీరం. శరీరాన్ని బహిర్గతం చేయకూడదు. ఒళ్ళును ఎప్పుడూ దాచుకోవాలి. ఒక భార్య భర్తలు తప్ప మరో ఏ ఒక్క వ్యక్తి కి నీ శరీరాన్ని చూపిన లేదా ఆ వ్యక్తి తో శృంగారం జరిపిన దేవుని కి వ్యతిరేకంగా జీవించడమే కాకుండా ఘోరంగా శిక్ష ఉంటుందట.

రవి కాంచని చోటు కవి కాంచున్ అంటారు. అంటే శరీరం అవయవాలు సూర్యుడు కూడా చూడడు అంట. అంత గుప్తంగా ఒళ్ళును దాచుకోవాలి. నేడు విదేశ సంస్కృతికి అలవాటుపడి ఆహార్యంలో అనేక వింత ధోరణులు చోటుచేసుకున్నాయి. ఇది మంచిది కాదు.

అవమానం: 
తనకు జరిగిన అవమానం మరిచిపోవాలి. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి మోసం చేస్తున్నారని ఆ అవమానాలను అస్తమానం మననం చేస్తే క్రోధం పెరుగుతుందట. తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించండి అని వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయాలట.

దీని వల్ల దేవుని ఆశీస్సులు దీవెనలతో వీరికి మంచి జరుగుతుందట. ఆ వ్యక్తిని భగవంతుడు తన బిడ్డగా చేరతీస్తారట. భార్య భర్తల మద్య లేదా దేవుని ఆశీస్సులు తో ఇద్దరు కలిసి ఇష్టపడి జరిగిన ఎటువంటి సంభాషణలు కూడా ఎవరితో చర్చలు జరపకూడదట. దాంతో పగ.. అలా అంతే ఉండదు. 
ప్రపంచంలో ఉన్న ముళ్ళను మొత్తం మనం తొలగించలేం కానీ మనం చెప్పులు వేసుకొని వెళ్ళడం సులభం. ఈ తొమ్మిది రహస్యలను కాపాడుకోవడం విజ్ఞుల లక్షణం అని పెద్దలు చెప్పిన జ్ఞానబోధ.
Famous Posts:

చిట్టి చిట్టి గింజలు ఎన్ని ఉపయోగాలో తెలిస్తే అస్సలు నమ్మలేరు


ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? ప్లాస్మాను ఎలా తీస్తారు?


నువ్వుల నూనెతో నూరు లాభాలు | రహస్యాలు


నిలబడి అస్సలు నీరు తాగకండి ..తాగితే ఎంత డేంజ‌రో తెలుసా..?


ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు.


don't tell anyone meaning, never disclose 3 things, జీవితంలో ఎవరికీ చెప్పకూడని విషయాలు, How to maintain good relationship, life, secrets, telugu story's, motivational story's Telugu .

Comments