విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం | Sri Hemachala Laxmi Narsimha Swamy Temple
విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు..ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే..
భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో పాటు జైనం, భౌద్ధం కూడా విరాజిల్లింది. ఈ క్రమంలో నిర్మించిన దేవాలయాలు, స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాల్లో కొన్నింటి మర్మాలను తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. వేలాది సంవత్సరాలుగా ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా సఫలం కాలేక పోతున్నారు.
ఇక భక్తులు మాత్రం ఇదంతా దేవుడి మహత్యంగా భావిస్తూ తరతరాలుగా దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. కోరిన కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఇలాగే తమను, తమ బిడ్డలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. ఇటువంటి కోవకు చెందినదే ఓ స్వయంభువుగా చెప్పుకునే నారసింహుడి విగ్రహం. ఈ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఆ ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం..
1.దశావతారాల్లో ఒకటి.. విష్ణు దశావతారల్లో ఒకటిగా చెప్పుకునే నరసింహావతారం ఉగ్రస్వరూపం. సింహపుతల, మనిషి మొండెం కలిగిన రూపంలోన నరసింహుడు మనకు దర్శనమిస్తాడు.
పురాణాల ప్రకారం లోక కంటకుడిగా మారిన హిరణ్యకసిపుడిని సంహరించడం కోసమే ఇలా విచిత్రమైన రూపంలో ఈ నరసింహుడు భూమి పై అవతరించాడని తెలుస్తోంది. అటు మనిషితో కాని ఇటు జంతువుతో కాని, పగలు కాని రాత్రి కాని, ఇంటి బటక కాని లోపల కాని, భూమి పై కాని ఆకాశంలో కాని... ఏ ఆయుధంతో కాని హిరణ్యకసిపుడికి మరణం ఉండదు. దీంతో అతని ఆగడాలకు అంతు ఉండదు.
ముఖ్యంగా విష్ణు భక్తులను చాలా హింసించేవాడు. చివరికి తన సొంత కుమారుడైన ప్రహ్లదుడిని కూడా వదలలేదు.
2. అందుకే నర..సింహ రూపం ఈ క్రమంలో విష్ణువు నరసింహుడి (మానవుడు, జంతువు కలగలిసిన రూపం) రూపంలో వచ్చి సాయంత్రం (పగలు రాత్రి కాని సమయం) సమయంలో ఇటి గడప (ఇంటి బయట కాదు లోపలా కాదు) పై కుర్చొని తన ఒళ్లో హిరణ్యకసిపుడిని అడ్డంగా పడుకోబెట్టుకుని (భూమి ఆకాశానికి మధ్య అన్న సంకేతం) తన చేతి గోళ్ల (ఏ వస్తువుతో చేసిన ఆయుదం కాదు) తోనే హిరణ్య కసిపుడి పొట్టను చీల్చి అతడిని సంహరిస్తారు.
ఇది పురాణాల ప్రకారం నరసింహుడి అవతారం వెనుక ఉన్న కథనం.
3. దేశంలో అనేక చోట్ల ఈ విగ్రహాలు.. దేశంలో అనేక చోట్ల నరసింహుడి విగ్రహాలు కనిపిస్తాయి. సదరు విగ్రహాలన్నీ చాలా వరకూ కొండల్లో గుట్టల పైన ఉంటాయి. ముఖ్యంగా నరసింహుడి దేవాలయాలన్నీ చాల వరకూ గుహాలయాలే. అయితే మనం ఇప్పడు చెప్పుకోబోయే విగ్రహం మాత్రం పచ్చని అడవుల్లో ఉంటుంది. ఈ విగ్రహం రూపుతో నుంచి ప్రతి ఒక్కటి ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
4. స్వయంభువుడు.. చర్మం వలే మెత్తగా ఉన్న విగ్రహం రూపంలో వెలిసిన వాడే హేమాలచల నరసింహుడు. చాలా చోట్ల నరసింహుడు లక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఇక్కడ మాత్రం నరసింహుడు ఒక్కడే స్వయం భువుగా వెలిసినాడు. విగ్రహం పూర్తి నలుపు రంగులో కనిపిస్తుంది.
5. శిలాజిత్తు రూపం.. అన్ని చోట్ల శిల రూపంలో కనిపిస్తే ఇక్కడ శిలాజిత్తు రూపంలో కనిపిస్తాడు. అంటే ఒంటికి చర్మం ఉన్నట్లు శిలను తాకితే మొత్తగా ఉంటుంది.
మనకు నోరు, నుదురును గుర్తించవచ్చు. విగ్రహాలంకరణను అనుసరించి మీసాలు, చెవులు, ముక్కు తదితరాలను గుర్తించవచ్చు. నుదురు నుంచి పాదం వరకూ ఎక్కడ తాకినా సొట్ట పడుతుంది. మరలా యథాస్థితికి చేరుకుంటుంది. మనిషిని ముట్టుకున్నట్లు మెత్తగా ఉంటుంది. చర్మాన్ని తాకిన అనుభూతి కలుగుతుంది.
6. వెంట్రుకలు కూడా.. ఇలా చర్మంకలిగిన నరిసింహస్వామి విగ్రహమే కాదు మరే ఇతర దేవుళ్ల విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. అభిషేకం చేసే సమయంలో స్వామి వారి విగ్రహం నుంచి వెంట్రుకలు రాలి పోతుంటాయి. ఆ అనుభూతి తమకు కలుగుతుందని ఇక్కడి పూజారులు చెబుతారు..
7. నాభి నుంచి నిత్యం స్వేదం..ఇక స్వామి వారి నాభి నుంచి నిరంతరం స్రవాలు కారుతుంటాయి. దాన్ని స్వామి వారి స్వేదం అని అంటారు. ఈ స్వేదం అలా కారి పోకుండా అక్కడ చందనాన్ని ఉంచుతారు. ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఈ చందనాన్ని భక్తులకు అందజేస్తారు. ఈ చందనం ప్రసాదంగా తీసుకుంటే సంతానలేమి సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
8. అన్ని కాలల్లో ఒకే విధంగా ప్రవహించే జలధారఇక స్వామి వారి పాదల నుంచి నీటి ఊట ఎల్లప్పుడూ పారుతూ ఉంటుంది. ఇది జలధారగా మారుతుంది. దీనిని చింతామణి జలధారగా పిలుస్తారు. అయితే స్వామి వారి పాదల నుంచి కొంత దూరంలో ఉన్న జలధారకు నీరు ఎలా వచ్చి చేరుతుందనేది ఎవరూ కనిపెట్టలేక పోతున్నారు. మరో విచిత్రమేమంటే అన్ని కాలాల్లోనూ ఈ జలధారలో నీటి వేగం ఒకే విధంగం ఉండటం..
9. విదేశాలకు కూడా..ఈ ఇందులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. రాణి రుద్రమదేవి ఒకానొక దశలో పేరు తెలియని వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ ఉంటే రాచవైద్యుల సూచనల మేరకు ఈ జలధార నీటిని తాగిందని దీంతో రోగం తగ్గి పోయిందని చెబుతారు.
ఇదే విషయాన్ని భక్తులు కూడా నమ్ముతారు. మరోవైపు ఇక్కడి నీటిని విదేశాల్లో ఉన్న తమవారికి కూడ ఇక్కడి వారు పంపించడం ఆనవాయితీగా వస్తోంది.
10. కాలం తగ్గట్టు విగ్రహం రూపు.. ఇక్కడి విగ్రహం వేసవిలో ఒక లాగా, మిగిలిన కాలాల్లో ఒకలాగా ఉంటుంది. వేసవిలో చాల పలచగా ఉండే విగ్రహం మిగిలిన కాలాల్లో వెనుక ఉన్న రాతి నిర్మాణం నుంచి ముందుకు చొచ్చుకు వచ్చి ఉంటుంది. గరిష్టంగా స్వామి వారి విగ్రహం నాలుగు అడుగులు ముందుకు వస్తుంది. దీనిని కూడా స్వామి వారి మహత్యంగా చెబుతారు.
11. స్థల పురాణం..ఆరోశతాబ్ధంలో దిలీపకులకర్ణి మహారాజు ఈ ప్రాంతాన్నిపరిపాలించాడు. ఆ సమయంలో ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో స్వామి వారు రాజు కలలో వచ్చి తవ్వకా లసమయంలో ఓ గునపం తన విగ్రహంలోని నాభి ప్రాంతంలో దిగిందని తెలిపారు.
భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని భక్తులు సందర్శించే ఏర్పాటు చేయాలని చెబుతారు. స్వామి వారి ఆదేశాలను అనుసరించి అక్కడ రాజు దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇక నాభి గుచ్చుకున్న స్థలంలోనే స్రావాలు వస్తున్నట్లు భక్తులు భావిస్తున్నారు.
12. ఎక్కడ ఉంది. తెలంగాణ రాష్ట్రం జై శంకర్ భూపాల్ జిల్లా, మంగపేట మండలం, మల్లూరు గ్రామానికి దగ్గరా హేమచల నరసింహుడు కొలవై ఉన్నాడు. అడవుల్లో చెట్ల పొదలను దాటు కుంటూ వెళ్లాలి. పచ్చని అడవుల్లో ప్రశాంత వాతావరణంలో ప్రయాణం. ఈ ప్రాంతాన్ని మల్లూరు గుట్టఅని స్థానికంగా పిలుస్తారు.
నృసింహ స్వామి వారి విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే..
ఆనందం వచ్చినా, కష్టాలు కలిగినా మనకి వెంటనే గుర్తుకు వచ్చేది ఆ దేవుడే. దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని అంటూ ఉంటారు.
అంటే దిక్కున్న వారికి దేవుడు ఉండడని కాదు, అందరికి దిక్కు ఆదేవుడున్నాడు, నాకు ఎవరూ లేరని చింతించాల్సిన అవసరం లేదని అర్ధం.
దైవ దర్శనానికి మనం అనేక దేవాలయాలకు వెళతాము. అయితే ప్రతీ దేవాలయం లో ఎదో ఒక ప్రత్యేకత ఉంటుంది.
వరంగల్ జిల్లా లో మండపేట మండలం లో, మల్లూరు గ్రామంలో హేమాచల నృసింహ స్వామి దేవాలయం ఉంది.
ఈ దేవాలయం అందులో ఉన్న నృసింహ స్వామి విగ్రహం గురించి వింటే ఆశ్చర్యపోతారు. భగవంతుడు నిజంగానే ప్రత్యక్షంగా ఉన్నాడని అనే అనుభూతిని కలిగిస్తుంది.
భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో పాటు జైనం, భౌద్ధం కూడా విరాజిల్లింది. ఈ క్రమంలో నిర్మించిన దేవాలయాలు, స్వయంభువుగా చెప్పుకునే విగ్రహాల్లో కొన్నింటి మర్మాలను తెలుసుకోవడం అసాధ్యమవుతోంది.
వేలాది సంవత్సరాలుగా ఆ రహస్యాలను తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించినా సఫలం కాలేక పోతున్నారు. ఇక భక్తులు మాత్రం ఇదంతా దేవుడి మహత్యంగా భావిస్తూ తరతరాలుగా దేవుళ్లను కొలుస్తూ తమ కోరికలను తీర్చాల్సిందిగా ప్రార్థిస్తున్నారు.
కోరిన కోర్కెలు తీరిన తర్వాత మొక్కులు చెల్లిస్తూ ఇలాగే తమను, తమ బిడ్డలను చల్లగా చూడాలని వేడుకుంటున్నారు. ఇటువంటి కోవకు చెందినదే ఓ స్వయంభువుగా చెప్పుకునే నారసింహుడి విగ్రహం.
ఈ విగ్రహానికి చర్మం, వెంట్రుకలు ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఆ ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించిన వివరాలు..
1.దశావతారాల్లో ఒకటి..
విష్ణు దశావతారల్లో ఒకటిగా చెప్పుకునే నరసింహావతారం ఉగ్రస్వరూపం. సింహపుతల, మనిషి మొండెం కలిగిన రూపంలోన నరసింహుడు మనకు దర్శనమిస్తాడు.
పురాణాల ప్రకారం లోక కంటకుడిగా మారిన హిరణ్యకశ్యపుడిని సంహరించడం కోసమే ఇలా విచిత్రమైన రూపంలో ఈ నరసింహుడు భూమి పై అవతరించాడని తెలుస్తోంది.
అటు మనిషితో కాని ఇటు జంతువుతో కాని, పగలు కాని రాత్రి కాని, ఇంటి బయట కాని లోపల కాని, భూమి పై కాని ఆకాశంలో కాని.. ఏ ఆయుధంతో కాని హిరణ్యకశ్యపుడికి మరణం ఉండదు. దీంతో అతని ఆగడాలకు అంతు ఉండదు. ముఖ్యంగా విష్ణు భక్తులను చాలా హింసించేవాడు. చివరికి తన సొంత కుమారుడైన ప్రహ్లదుడిని కూడా వదలలేదు..
2. అందుకే నర..సింహ రూపం..
ఈ క్రమంలో విష్ణువు..నరసింహుడి (మానవుడు, జంతువు కలగలిసిన రూపం) రూపంలో వచ్చి.. సాయంత్రం (పగలు రాత్రి కాని సమయం) సమయంలో.. ఇటి గడప (ఇంటి బయట కాదు లోపలా కాదు) పై.. కుర్చొని తన ఒళ్లో హిరణ్యకశ్యపుడిని అడ్డంగా పడుకోబెట్టుకుని (భూమి ఆకాశానికి మధ్య అన్న సంకేతం) తన చేతి గోళ్ల (ఏ వస్తువుతో చేసిన ఆయుదం కాదు) తోనే..హిరణ్య కశ్యపుడి పొట్టను చీల్చి అతడిని సంహరిస్తారు. ఇది పురాణాల ప్రకారం నరసింహుడి అవతారం వెనుక ఉన్న కథనం..
3. దేశంలో అనేక చోట్ల ఈ విగ్రహాలు..
దేశంలో అనేక చోట్ల నరసింహుడి విగ్రహాలు కనిపిస్తాయి. సదరు విగ్రహాలన్నీ చాలా వరకూ కొండల్లో గుట్టల పైన ఉంటాయి. ముఖ్యంగా నరసింహుడి దేవాలయాలన్నీ చాల వరకూ గుహాలయాలే.
అయితే మనం ఇప్పడు చెప్పుకోబోయే విగ్రహం మాత్రం పచ్చని అడవుల్లో ఉంటుంది. ఈ విగ్రహం రూపుతో నుంచి ప్రతి ఒక్కటి ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
4. స్వయంభువుడు..
చర్మం వలే మెత్తగా ఉన్న విగ్రహం రూపంలో వెలిసిన వాడే హేమాలచల నరసింహుడు. చాలా చోట్ల నరసింహుడు లక్ష్మీ సమేతుడై ఉంటాడు. ఇక్కడ మాత్రం నరసింహుడు ఒక్కడే స్వయం భువుగా వెలిసినాడు. విగ్రహం పూర్తి నలుపు రంగులో కనిపిస్తుంది.
ఈ దేవాలయం వయసు 4,796 సంవత్సరములు.ఇక్కడ స్వామి వారి విగ్రహం మెత్తగా ఉంటుంది. నాభి నుంచి చీము కారుతుంది. పాదాల నుంచి కోనేటిలోకి నీళ్ళు రావడం, ఆ స్వామి విగ్రహం పై రోమాలు ఉండటం ఈ విగ్రహం ప్రతేకత.
స్వామి విగ్రహం 9 అడుగులుల 2 అంగుళాలు ఉంటుంది. మే నెలలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరగగా, ఆ వేడుకని వీక్షించేందుకు ప్రతీ ఏడాది ఇరవై, ముప్పై లక్షల మంది భక్తులు వస్తారు.
ఇక్కడ చింతామణి అనే ధార పడుతూ ఉంటుంది. ఈ నీరు సర్వరోగ నివారిణి అని నమ్ముతారు.
5. శిలాజిత్తు రూపం..
అన్ని చోట్ల శిల రూపంలో కనిపిస్తే ఇక్కడ శిలాజిత్తు రూపంలో కనిపిస్తాడు. అంటే ఒంటికి చర్మం ఉన్నట్లు శిలను తాకితే మొత్తగా ఉంటుంది. మనకు నోరు, నుదురును గుర్తించవచ్చు. విగ్రహాలంకరణను అనుసరించి మీసాలు, చెవులు, ముక్కు తదితరాలను గుర్తించవచ్చు. నుదురు నుంచి పాదం వరకూ ఎక్కడ తాకినా సొట్ట పడుతుంది. మరలా యథాస్థితికి చేరుకుంటుంది. మనిషిని ముట్టుకున్నట్లు మెత్తగా ఉంటుంది. చర్మాన్ని తాకిన అనుభూతి కలుగుతుంది.
6. వెంట్రుకలు కూడా..
ఇలా చర్మంకలిగిన నరిసింహస్వామి విగ్రహమే కాదు మరే ఇతర దేవుళ్ల విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. అభిషేకం చేసే సమయంలో స్వామి వారి విగ్రహం నుంచి వెంట్రుకలు రాలి పోతుంటాయి. ఆ అనుభూతి తమకు కలుగుతుందని ఇక్కడి పూజారులు చెబుతారు..
7. నాభి నుంచి నిత్యం స్వేదం..
ఇక స్వామి వారి నాభి నుంచి నిరంతరం స్రవాలు కారుతుంటాయి. దాన్ని స్వామి వారి స్వేదం అని అంటారు. ఈ స్వేదం అలా కారి పోకుండా అక్కడ చందనాన్ని ఉంచుతారు.
ప్రతి శని, ఆది, సోమవారాల్లో ఈ చందనాన్ని భక్తులకు అందజేస్తారు. ఈ చందనం ప్రసాదంగా తీసుకుంటే సంతానలేమి సమస్యలు తీరుతాయని భక్తుల విశ్వాసం.
8. అన్ని కాలల్లో ఒకే విధంగా ప్రవహించే జలధార..
ఇక స్వామి వారి పాదల నుంచి నీటి ఊట ఎల్లప్పుడూ పారుతూ ఉంటుంది. ఇది జలధారగా మారుతుంది. దీనిని చింతామణి జలధారగా పిలుస్తారు.
అయితే స్వామి వారి పాదల నుంచి కొంత దూరంలో ఉన్న జలధారకు నీరు ఎలా వచ్చి చేరుతుందనేది ఎవరూ కనిపెట్టలేక పోతున్నారు. మరో విచిత్రమేమంటే అన్ని కాలాల్లోనూ ఈ జలధారలో నీటి వేగం ఒకే విధంగా ఉండటం..
9. విదేశాలకు కూడా..
ఈ ఇందులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని భక్తులు విశ్వసిస్తారు. రాణి రుద్రమదేవి ఒకానొక దశలో పేరు తెలియని వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ ఉంటే రాచవైద్యుల సూచనల మేరకు ఈ జలధార నీటిని తాగిందని దీంతో రోగం తగ్గి పోయిందని చెబుతారు.
ఇదే విషయాన్ని భక్తులు కూడా నమ్ముతారు. మరోవైపు ఇక్కడి నీటిని విదేశాల్లో ఉన్న తమవారికి కూడ ఇక్కడి వారు పంపించడం ఆనవాయితీగా వస్తోంది.
10. కాలం తగ్గట్టు విగ్రహం రూపు..
ఇక్కడి విగ్రహం వేసవిలో ఒక లాగా, మిగిలిన కాలాల్లో ఒకలాగా ఉంటుంది. వేసవిలో చాల పలచగా ఉండే విగ్రహం మిగిలిన కాలాల్లో వెనుక ఉన్న రాతి నిర్మాణం నుంచి ముందుకు చొచ్చుకు వచ్చి ఉంటుంది. గరిష్టంగా స్వామి వారి విగ్రహం నాలుగు అడుగులు ముందుకు వస్తుంది. దీనిని కూడా స్వామి వారి మహత్యంగా చెబుతారు.
11. స్థల పురాణం..
ఆరో శతాబ్ధంలో దిలీప కులకర్ణి మహారాజు ఈ ప్రాంతాన్నిపరిపాలించాడు. ఆ సమయంలో ఇక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో స్వామి వారు రాజు కలలో వచ్చి తవ్వకాల సమయంలో ఓ గునపం తన విగ్రహంలోని నాభి ప్రాంతంలో దిగిందని తెలిపారు.
భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని భక్తులు సందర్శించే ఏర్పాటు చేయాలని చెబుతారు. స్వామి వారి ఆదేశాలను అనుసరించి అక్కడ రాజు దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఇక నాభి గుచ్చుకున్న స్థలంలోనే స్రావాలు వస్తున్నట్లు భక్తులు భావిస్తున్నారు.
12. ఎక్కడ ఉంది..
తెలంగాణ రాష్ట్రం జై శంకర్ భూపాల్ జిల్లా, మంగపేట మండలం, మల్లూరు గ్రామానికి దగ్గర హేమచల నరసింహుడు కొలవై ఉన్నాడు. అడవుల్లో చెట్ల పొదలను దాటు కుంటూ వెళ్లాలి. పచ్చని అడవుల్లో ప్రశాంత వాతావరణంలో ప్రయాణం. ఈ ప్రాంతాన్ని మల్లూరు గుట్ట అని స్థానికంగా పిలుస్తారు.
ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమో నమః
Famous Posts:
> అరుణాచలంలో శివలింగానికి దగ్గరగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసా..?
> మనసులోని కోర్కెలు తీర్చే దశావతార నృసింహ మంత్రము
> దేవాలయాల్లో ఇతరులకు నమస్కారం చేయకూడదు ఎందుకో తెలుసా?
> స్త్రీ మూర్తులకి ఇవి అవసరం..
> శుక్రవారం విడిచిన దుస్తుల్నే_ధరిస్తే..?
> ఎంతటి కష్టమైన సమస్య తీరాలన్న, ప్రతి పని లో విజయం కావాలన్నా ఏమిచెయ్యాలి ?
> గుడికి ఎందుకు వెళ్ళాలి? దాని వెనక రహస్యాలు
> ఉపయోగం ఉత్తమ పరిహారాలు - చిట్టి తంత్రాలు
> తిరుమల వెళ్ళే ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు
హేమాచల లక్ష్మీ నృసింహ స్వామి, Sri Malyadri Lakshmi Narasimha Swamy, malluru temple photos, hemachala lakshmi narasimha swamy temple timings, malluru narasimha swamy temple history telugu, warangal to malluru temple distance, హేమాచల లక్ష్మీ నరసింహ స్వామీ దేవాలయం,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment