ఆడవాళ్లు వేసుకునే జడ ల వల్ల లాభాలు, సాంప్రదాయాలు | Hair style definition and meaning - Sanatana dharma | Hinduism
ఆడవాళ్లు వేసుకునే జడ ల వల్ల లాభాలు, సాంప్రదాయాలు చదవండి.
ఆడవాళ్లు వేసుకొనే... కొప్పు,,,,,ఒకజడ,,,,రెండు జడల వెనుక,,,,,ఆంతర్యమేమిటి, దేనికి సంకేతాలు?
మన సనాతన సాంప్రదాయ ఆచార వ్యవహార శాస్త్రంలో చెప్పబడినట్టుగా కొన్ని సంకేత రూపముగా... స్త్రీలకు ప్రత్యేక ఆచార కట్టుబాట్లు పెట్టారు.
1) అమ్మాయి రెండు జడలు వేసుకుంటుంది అంటే (చిన్నపిల్లలు ,యుక్తవయసు బాలికలు ) ఇంకా పెళ్లి కాలేదు అని అర్ధం .....
అంటే జీవేశ్వర సంబంధం ఇరువురిగా ఉన్నారు,
ఇంకా ఒక్కటిగా కాలేదు, వివాహం కాలేదు అని అర్ధం . స్వేచ్ఛగా ఉంది ,ఆనందంగా ఉంది అని చెబుతారు ...
2) ఏ అమ్మాయైతే ఒక జడ వేసుకుంటుందో ఆమెకు వివాహం_జరిగిపోయింది అని భావం....
ఇక్కడ రెండు జడలు ఒక్కటి అవడం ...ఒక్కటి అవడం అంటే రెండు జడలే ఉంటాయా.. కాదు,
మూడుగా త్రివేణీ సంగమంగా (వేణీ అంటే తమిళపాదం లో జడ ) చెబుతారు ,మూడు పాయలుగా అల్లుకుని ఉంటేనే ఒక జడ అల్లడానికి వీలవుతుంది.
మూడూ అంటే 1) నేనూ 2) భర్త 3) సంతానం (కావచ్చు ,కాకపోవచ్చు ) అనేభావం ,అలాగే జీవుడు ,ఈశ్వరుడు ,ప్రకృతీ ,మాయ మోహం అని అర్ధం . సత్వ ,రజో ,తమో గుణాలుగా ఉంటాయని అర్ధం .
3) ఒకవేళ జడ ముడిసి కట్టుగా (కొప్పు ) కట్టారో... అంటే వివాహిత స్త్రీ అయ్యి ఉండి,సంతానం కలిగి ఉంది అని అర్ధం.అన్నీ బాధ్యలతో కలిపి గుట్టుగా ముడుచుకుని ఉందని అర్ధం ...
ఇలా వారి రూపురేఖలలో, ఆహార్యంలో , వేష భూషణలో చూచి మనం తెలుసుకొనవచ్చును ... వీళ్ళేమిటి అని చూడగానే తెలిసిపోతుంది.
వేసుకునే జడలను బట్టివారి శారీరక స్థితిని తెలియజేస్తాయి .
ఇదంతా కూడా ఆచార ధర్మంలో ఉంది.
ఆచారం క్రిందేకే వస్తాయి ...
నాగరికత తెలిసినవాళ్ళు జుట్టు తప్పనిసరి సరియైన పద్దతిలో ఏదో ఒక రకముగా అందముగా తీర్చి దిద్దుకుంటారు . ...
కానీ
ఇప్పుడు మోడనైజేషన్ ముసుగులో అభివృద్ధి ,ఆధునికత పేరుతో ప్రాశ్చాత్త్యా పోకడలతో విషసంస్కృతిని దిగుమతి చేసుకొని, మన ఆచారాలను మంటకలుపుతున్నారు ...
చిన్నపిల్లల నుండి పండు ముదుసలి వరకు కొందరు స్త్రీలు వివిధరకాల ఫ్యాషన్ కట్టింగులు చేయించుకుంటున్నారు...
కొందరు మహాతల్లులు చదువులు, ఉద్యోగాలవేటలో భాగంగా ,,,జుత్తు విరబోసుకొని శక్తి రూపాలుగా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా తిరుగుతున్నారు.
ఎక్కడ స్త్రీ జుట్టు ముడవకుండా విరబోసుకొని విహరిస్తుందో వారి వెనుకాల భూత, ప్రేత, పిశాచాలు,,పాతకులు, లంకిణిలు పూతనలు తిరుగుతాయని.
ఇది నిక్కచ్చిగా రాక్షస స్వభావమే ననీ ధర్మ ప్రభోధం.
శాస్త్రం ప్రకారం స్త్రీలు తలంటి బోసుకున్నాక జట్టు ఆరబెట్టుకోవడానికి కూడా కొసరి భాగాన ముడివేసి ఆరబెట్టుకోవాలి.
కానీ కొన్ని పురాణగాథల్లో వాళ్ళు చేసిన శపథం మేరకు వారి జుట్టు విరబోసుకున్నట్టు చెబుతారు,
రామాయణంలో సీతామాత వల్ల లంకాదహనమే జరిగింది.
భారతంలో ద్రౌపదీ కారణంగా మహాభారత యుద్ధమే సంభవించింది.అయినా కూడా అది అనర్ధదాయకమే అయ్యింది .
ఇవినాకు పెద్దలద్వారా తెలిసిన వివరాలు మాత్రమే.
తెలుపుతున్నా....
Famous Posts:
> చాలా శక్తివంతమైన లక్ష్మీ మంత్రాలు
> పిల్లల పెంపకంలో ప్రతి తల్లి తండ్రి చేస్తున్న అతి పెద్ద తప్పులు ఇవే
> ఇది వినాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ఉండాలి..
> కాలుకి నల్ల దారం కట్టుకోవడం వెనక రహస్యమేంటి?
> పూజలో కొబ్బరికాయ చెడిపోతే అపచారమా ?
> అమ్మాయి పుష్పావతి అయిన సమయములో చేయవలసినవి
> దిష్టి, దృష్టి - నివారణ మార్గాలు
> శివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది?
> అగ్నిసాక్షిగా వివాహం ఎందుకు చేస్తారు..?
> అన్నదానం చేసేటపుడు 100 లో 99 మంది చేసే అతి పెద్ద తప్పు
ladies hair style in meaning, hair style meaning, hairstylist meaning, list of hairstyles female, types of hairstyle, hindu sanathana dharmam, sanatan dharma history, sanatan dharma rules, sanatan dharma pdf
Comments
Post a Comment