సోమావతి అమావాస్య అంటే ఏంటి ఆ రోజు ఏం చేయాలో తెలుసా ?
శివునికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే.అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని చెబుతారు. ఇక సోమవారము అమావాస్య కలసి వచ్చే రోజే ‘సోమవతి అమావాస్య’. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. మరి ఆ రోజు వెనుక ఉన్న కథ ఏమిటో, ఆనాడు ఏం చేయాలో పెద్దలు చెబుతున్న మాటలు విందాం…
దక్షయజ్ఞం కథ అందరికీ తెలిసిందే ! తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు.అక్కడ తనకి చోటు లేదని శివుడు వారిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్లింది. సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెని అవమానించాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది.
సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన వెంట్రుకతో వీరభద్రుని సృష్టించాడు. ప్రమథ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుని మీదకు దాడి చేశాడు.అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావుదెబ్బలు తిన్నవారిలో చంద్రుడు కూడా ఉన్నాడు.. చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు.అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు.
నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు.తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్లి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు.చంద్రుని బాధను చూసిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదనీ ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిచ్చాడు.
శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం, అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని ‘సోమవతి అమావాస్య’ పేరుతో పిలవడం జరుగుతోంది.. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది. ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు.
సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని చెబుతారు.. ఇందుకోసం తలార స్నానం చేసి శివుని పంచామృతాలతోనూ, జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు.ఇలా అభిషేకించిన శివుని బిల్వపత్రాలతో పూజించి, శివ స్తోత్రాలతో కొలిస్తే.. సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు లభిస్తాయని నమ్మకం.
ఈ పూజ పంచారామాలలో కానీ, రాహు కాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందట... ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా ఈ రోజుని గడపమని చెబుతున్నారు.
Also Read : మీ పుట్టిన తేది ప్రకారం ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంచితే శుభం
సోమవతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో వుండే సకల దోషాలు తొలగి పోతాయని విశ్వాసం.సోమవతి అమావాస్య రోజున
శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమవతి కథను ఒకసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి.
ఈ అమావాస్య స్త్రీలకు ప్రత్యేకం.ఈనాడు ఉపవాసము చేసిన స్త్రీ కి సంతాన భాగ్యము తో పాటు, ఆమె జీవితంలో ఆమెకు వైధవ్యం ప్రాప్తించదట. అందుకే దీనిని సోమవతి అమావాస్య అంటారు.
Famous Posts:
> విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం
> పాపాలను, శాపాలను పోగొట్టి, కష్టాలను తీర్చి, ఆయుష్షును పెంచే ఆదిత్య హృదయం
> బిల్వ వృక్షాన్ని ఇంట్లో పెంచితే వచ్చే ఫలితాలు
> ఏ రాశి వారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలి?
> కొత్త గా పెళ్ళి చేసుకున్న కొడుకుకు ఒక తల్లి చెప్పిన 5 ముఖ్య విషయాలు
> జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకం ఎప్పుడు రాయించుకోవాలి?
> తల్లితండ్రుల గొప్పదనం గురించి శాస్త్రాలలో చెప్పబడిన విధానం
Somvati Amavasya, mouni amavasya, amavasya pooja, mone amavasya, barsati amavasya katha, amavasya ki kahani, amavasya pitra dosh, satvai amavasya, సోమవతి అమావాస్య, somvati amavasya importance in telugu