8.పాశురము
కీళ్ వానమ్ వెళ్ళెన్రు ఎరుమై శిరువీడు మేయ్ వాన్ పరన్దనకాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుమ్ పోవాన్ పోగినా పోగామల్ కాత్తున్నై కూవువాన్ వన్దు నిన్రోమ్ కోదుకలముడైయ పావాయ్ ! ఎళున్దిరాయ్ పాడిప్పరైకొణ్డు మావాయ్ ! పిళన్దనై మల్లరై మాట్టియ దేవాదిదేవనై చ్చెన్రునామ్ శేవిత్తాల్ ఆవావెన్రా రాయ్ న్దరుళేలో రెమ్బావాయ్.
భావము: తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్చగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'ప' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:
Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu, తిరుప్పావై 6వ పాశురం