Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

మీరు పడుకునే విధానం బట్టి మీ గత జన్మ ఎలాంటిదో తెలుసుకోవచ్చు | What your sleeping position says about you?


మానవుని శయనవిధ సంస్కారం...

మనిషి నిద్రించేటప్పుడు ముఖ్యం గా గాఢ నిద్రలో ఉన్నప్పుడు అతను పడుకున్న విధానం బట్టి అతని పూర్వజన్మ సంస్కారం ఎలాంటిదో తెలుస్తుంది. 

అయితే ఈ సిద్ధాంతం అందరికీ అన్వయించ కూడదు. ఆయా వ్యక్తులలో మంచి అయినా చెడు అయినా ప్రస్ఫుటం గా వ్యక్తం అవుతున్నప్పుడు మాత్రమే అన్వయించి చూడాలి. ఈ జన్మలోని అతని పుట్టుక, వంశము, గుణ గణాలని బట్టి సందర్భాను సారంగా ఆయా వ్యక్తులకి అన్వయించాలి.

రెండు చేతులు గుండెల మీద కలిపి పెట్టుకుని, మంచం గాని, పరుపు పక్క దిండు లేకుండా గాని, లేక చాప మీద గాని, ఏదైనా గుడ్డ పరుచుకుని గాని, లేక కటిక నేల మీద గానీ సుఖంగా నిద్రించే వాడు అతని జన్మాంతరమున యోగై ఉంటాడు.

చేతులు రెండు నమస్కారం చేసే విధంగా గుండె మీద పెట్టుకుని పడుకునే వాడు తన పూర్వ జన్మలో మంచి భక్తుడై ఉంటాడు. 

రెండు చేతులని దిండు గా చేసి కాళ్ళు చక్కగా ఇమిడ్చి ఒక పాదం మీద ఇంకో పాదం పెట్టుకుని గురక పెట్టి నిద్రించే వాడు పూర్వజన్మలో మంచి సాధకుడు అయి ఉంటాడు. 

విష్ణు మూర్తి శేష శయ్యపై పడుకున్నట్టు గా పడుకున్న వాడు విష్ణు వంశంలో పుట్టిన వాడు సర్వ శుభ లక్షణాలు కలవాడు అయి ఉంటాడు.

చేతులు రెండూ గుండె మీద కట్టుకుని పైన చెప్పిన విధంగానే పడుకున్న వాడు ఈశ్వరాంశ లో పుట్టిన వాడు అయి ఉంటాడు. 

ఎడమ వైపుకి గాని కుడి వైపుకి గాని ఒక పాదం పై ఒక పాదం ఉంచి చక్కగా పడుకున్నవాడి కంటే అలానే ఎడమ వైపుకి తిరిగి పడుకున్న వాడు శ్రేష్టుడు. అతనికి శాంత గుణం అధికంగా ఉంటుంది.

బోర్లా పడుకోవడం చాలా హీన మైన స్వభావం.  వాళ్ళ జన్మ అంత శ్రేష్టమైనది కాదు.  మగవాళ్ళు బోర్లా పడుకోవడం,  ఆడవాళ్ళూ వెల్ల కిల్లా పడుకోవడం మంచిది కాదు.   అయితే యోగ ధ్యానములు చేసే వాళ్ళకి ఆ సందర్భం లో అలా పడుకోడం దోషం కిందికి రాదు. 

మన శరీరంలో మలిన రక్తము శరీరము ముందు భాగములో ఎడమ వైపు ఉన్న నాడుల ద్వారానూ,  చెడు రక్తము శరీరము ముందు భాగంలో కుడి పక్కన ఉన్న నాడుల ద్వారాను ప్రవహిస్తుంది.  కాబట్టీ కుడి లేదా ఎడమ పక్కకి తిరిగి పడుకోవడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఉంటాము. 

పడుకున్నప్పుడు తలా, చేతులు, కాళ్ళు అస్తవ్యస్తం గా పెట్టుకొని పడుకొనే వాళ్ళు శుద్ధాత్మ కలవాళ్ళు కాదు.  వాళ్ళు గత జన్మలలో తిర్యగ్జంతువులలో [ పశుసంబంధ ] జన్మించిన వారు అయి ఉంటారు.

రెండు మోకాళ్ళు రొమ్ము లోపలికి లాక్కుని ముడుచుకొని, రెండు చేతులు తొడల మధ్యలో పెట్టుకుని పడుకునే వాళ్ళు పూర్వజన్మలో శునకమై ఉంటారు.  ఇది అన్నిటి కన్నా నికృష్ట మైన పడక.

Famous Posts:

అప్పులకు స్వస్తి చెప్పే ఐశ్వర్య దీపం.. ఎలా వెలిగించాలి?


కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?


భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?


వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...?

sleeping positions meaning personality couples, sleeping positions names, healthy, sleeping positions, sleeping in the middle of the bed meaning, comfortable sleeping, positions for couples, what your sleeping position says about your health, sleeping, sleeping position meaning in Telugu

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు