Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు - 25 Quick Ways to Reduce Stress - Managing Stress

 

ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !

2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !

3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను 

తగ్గించగలదని గుర్తించుకో !

4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !

5. కక్ష కన్నా క్షమ గొప్పది క్షమ కన్నా జీవుల పట్ల కరుణ గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !

6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !

7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!

8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !

9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !

10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !

11. మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో  శాకాహారిగా ఉండడం ధ్యానం చేయడం నేర్చుకో!

12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!

13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !

14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో ! 

15. టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో !

16. పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో !

17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !

18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !

19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  

20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !

21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!

22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !

23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !

24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !

25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.

Famous Posts:

Managing Stress, how to reduce stress and tension, how to relieve stress quickly, how to relieve stress and anxiety, how to reduce stress response, how to relieve stress in 5 minutes, stress relief activities, mindfulness-based stress reduction pdf, mindfulness-based stress reduction techniques, ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు

Comments

  1. మంచి విషయాలు చెప్పారు ధన్యవాదములు మీకు.

    ReplyDelete

Post a Comment

Popular Posts