Tiruppavai Pashuram Day 7 in Telugu - Meaning | తిరుప్పావై ఏడవ రోజు రోజు పాశురం - పద్యం మరియు భావము

Thiruppavai 7 Pasuram Lyrics in Telugu

7 పాశురము

కీశు కీశెవైజ్ఞుమానై చాత్తకలను ! పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయో ! పేయ్ ప్పెణ్ణి ! కాశుమ్ పిరప్పుమ్ కలగలప్పక్కై పేరు: వాశ నరుజ్జుళ లాయిచ్చియర్ మత్తినాల్ ఓపడు రవమ్ కేట్టిలైయో నాయకప్పెణ్ణిళ్ళాయ్ ! నారాయణన్ మూర్తి కేశావనై ప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో తేశ ముడైయాయ్ ! తిర వేలో రెమ్బావాయ్.

భావము: ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా ? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! భాగవద్విషయానుభవము నెరిగినదానవు. సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము.

ఐనా... వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మా తల్లీ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యందేనికి? అని 'ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.

1 నుండి 30 వరకు తిరుప్పావై పాశురములు:

తిరుప్పావై 1వ పాశురం

తిరుప్పావై 2వ పాశురం

తిరుప్పావై 3వ పాశురం

తిరుప్పావై 4వ పాశురం

తిరుప్పావై 5వ పాశురం

తిరుప్పావై 6వ పాశురం

తిరుప్పావై 7వ పాశురం

తిరుప్పావై 8వ పాశురం

తిరుప్పావై 9వ పాశురం

తిరుప్పావై 10వ పాశురం

తిరుప్పావై 11వ పాశురం

తిరుప్పావై 12వ పాశురం

తిరుప్పావై 13వ పాశురం

తిరుప్పావై 14వ పాశురం

తిరుప్పావై 15వ పాశురం

తిరుప్పావై 16వ పాశురం

తిరుప్పావై 17వ పాశురం

తిరుప్పావై 18వ పాశురం

తిరుప్పావై 19వ పాశురం

తిరుప్పావై 20వ పాశురం

తిరుప్పావై 21వ పాశురం

తిరుప్పావై 22వ పాశురం

తిరుప్పావై 23వ పాశురం

తిరుప్పావై 24వ పాశురం

తిరుప్పావై 25వ పాశురం

తిరుప్పావై 26వ పాశురం

తిరుప్పావై 27వ పాశురం

తిరుప్పావై 28వ పాశురం

తిరుప్పావై 29వ పాశురం

తిరుప్పావై 30వ పాశురం

Tags: తిరుప్పావై, పాశురం, thiruppavai pasuram in telugu, tiruppavai telugu pdf, thiruppavai telugu, తిరుప్పావై పాశురాలు, pasuralu in telugu , తిరుప్పావై 6వ పాశురం

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS