Drop Down Menus

ఈ ఫోటో ని చూస్తూ ఈ స్త్రోత్రం రోజూ చదవండి కష్టంగా అవుతున్న పనులు సులభంగా పూర్తవుతాయి - Argala Stotram Benefits & Meaning

ఈ ఫోటో ని చూస్తూ ఈ స్త్రోత్రం రోజూ చదవండి చాలా కష్టంగా అవుతున్న పనులు సులభంగా అవుతుంది, అవుతుందో కాదో అని అనుమానంగా ఉన్నవి ఆటంకాలు తొలగి పోతాయి, చాలా రోజులుగా అవుతునట్టే ఉండి కాకుండా వెనక్కి పోతున్న పనులు చేతికి అందుతుంది. ఎవరి వల్ల అయినా భయం కానీ, బాధ కానీ ఉంటే ఆ సమస్య తిరిపోతుంది..

Also Read : పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు

అనారోగ్యంతో చాలా రోజుల నుండి బాధ పడుతూ ఉన్నవారికి  ఉపశమనం లభిస్తుంది... ఇది అమ్మవారిని అనుగ్రహం కోసం ప్రసన్నం చేసుకునే శ్లోకం, మొదలు పెట్టే ముందు మీ సమస్య సంకల్పములో చెప్పుకొని ప్రారంభించాలి, ఏ సమస్య లేని వారు కూడా ఆ  తల్లి అనుగ్రహం కోసం ఈ స్త్రోత్రం నిత్యం పారాయనఁ చేయవచ్చు.. పరిహారంగా చేసే వాళ్ళు ఉదయం సాయంత్రం చదవాలి.. కచ్చితంగా దీపం వెలిగించి బెల్లం ముక్క అటుకులు, కుదిరితే దానిమ్మ గింజలు కూడా నైవేద్యంగా పెట్టి చదివి హారతి ఇవ్వాలి...

అస్యశ్రీ అర్గళా స్తోత్ర మంత్రస్య విష్ణుః ఋషిః| అనుష్టుప్ఛందః| శ్రీ మహాలక్షీర్దేవతా| మంత్రోదితా దేవ్యోబీజం|

సంకల్పమ్: మీ పేరు గోత్రం మీ కోరిక చెప్పుకుని పారాయణ చేయండి...

ధ్యానం

ఓం బంధూక కుసుమాభాసాం పంచముండాధివాసినీం|

స్ఫురచ్చంద్రకలారత్న ముకుటాం ముండమాలినీం||

త్రినేత్రాం రక్త వసనాం పీనోన్నత ఘటస్తనీం|

పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్||

దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితాం|

అథవా

యా చండీ మధుకైటభాది దైత్యదళనీ యా మాహిషోన్మూలినీ

యా ధూమ్రేక్షన చండముండమథనీ యా రక్త బీజాశనీ|

శక్తిః శుంభనిశుంభదైత్యదళనీ యా సిద్ధి దాత్రీ పరా

సా దేవీ నవ కోటి మూర్తి సహితా మాం పాతు విశ్వేశ్వరీ||

ఓం నమశ్చండికాయై

మార్కండేయ ఉవాచ

ఓం జయత్వం దేవి చాముండే జయ భూతాపహారిణి|

జయ సర్వ గతే దేవి కాళ రాత్రి నమోఽస్తుతే||1||

మధుకైఠభవిద్రావి విధాత్రు వరదే నమః

ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ ||2||

దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తుతే

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||3||

మహిషాసుర నిర్నాశి భక్తానాం సుఖదే నమః|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||4||

ధూమ్రనేత్ర వధే దేవి ధర్మ కామార్థ దాయిని|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||5||

రక్త బీజ వధే దేవి చండ ముండ వినాశిని |

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||6||

నిశుంభశుంభ నిర్నాశి త్రైలోక్య శుభదే నమః

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||7||

వంది తాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్య దాయిని|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||8||

అచింత్య రూప చరితే సర్వ శతృ వినాశిని|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||9||

నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||10||

స్తువద్భ్యోభక్తిపూర్వం త్వాం చండికే వ్యాధి నాశిని

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||11||

చండికే సతతం యుద్ధే జయంతీ పాపనాశిని|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||12||

దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవీ పరం సుఖం|

రూపం ధేహి జయం దేహి యశో ధేహి ద్విషో జహి||13||

విధేహి దేవి కల్యాణం విధేహి విపులాం శ్రియం|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||14||

విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||15||

సురాసురశిరో రత్న నిఘృష్టచరణేఽంబికే|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||16||

విధ్యావంతం యశస్వంతం లక్ష్మీవంతంచ మాం కురు|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||17||

దేవి ప్రచండ దోర్దండ దైత్య దర్ప నిషూదిని|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||18||

ప్రచండ దైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయమే|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||19||

చతుర్భుజే చతుర్వక్త్ర సంస్తుతే పరమేశ్వరి|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||20||

కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||21||

హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||22||

ఇంద్రాణీ పతిసద్భావ పూజితే పరమేశ్వరి|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||23||

దేవి భక్తజనోద్దామ దత్తానందోదయేఽంబికే|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||24||

భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీం|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి||25||

తారిణీం దుర్గ సంసార సాగర స్యాచలోద్బవే|

రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి ||26||

ఇదంస్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః|

సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభం ||27||

|| ఇతి శ్రీ అర్గలా స్తోత్రం సమాప్తం ||

Famous Posts:

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.


భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

అర్గళా స్తోత్రం, Argala Stotram Lyrics in Telugu, Devi Mahatmyam Argala Stotram, Argala Stotram Telugu, Durga Saptashati Argala Stotram, sri argala stotram, youtube argala stotram

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.