Drop Down Menus

పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు - Small, inexpensive solutions to big problems.

పెద్ద పెద్ద సమస్యలకి ఖర్చు లేనటువంటి చిన్న చిన్న పరిష్కారాలు.

సంతానం విషయంలో విచారం ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయలదండ సమర్పిస్తే సంతానవృద్ధి చెందుతారు. నిమ్మకాయలు బేసి సంఖ్యలో ఉండేట్లు చూసుకోవాలి.

భూవివాదాలు ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతివంట లేదా స్వగృహంలోనే భోజనంచేయడం కొంతవరకు వివాదాల్ని తగ్గిస్తుంది.

Also Readనిమ్మకాయల దీపం పెట్టటం వలన కలిగే ఫలితాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇల్లు అమ్ముడుపోక ఇబ్బందులు పడుతున్నవారు ఇంటిలోపల ఏదోఒక గదిలో పసుపురంగును వేయిస్తే ఆఇల్లు అతితొందరలో మంచిధరకు అమ్ముడువుతుంది.

రహస్య శత్రువులు ఉన్నవారు 7 ఎండు మిరపకాయలను పసుపురంగు గుడ్డలోవేసి కట్టి దానిని తీసుకెళ్లి ఇంటికిదూరంగా పడేసిరండి. ఇది రాహుకాలంలో చేయడం సత్ఫలితాన్నిస్తుంది. ఇలా చేసేటప్పుడు మనసులో శత్రునివారణ జరగాలని కోరుకోవాలి.

పంట దిగుబడి సరిగారాని రైతులు పొలంలో భూసూక్త పారాయణం చేస్తే మంచిఫలితం ఉంటుంది.

చుట్టుపక్కలవారితో మీకు గొడవలు జరుగుతుంటే ఉత్తరంవైపున ఏవైనా పిచ్చిమొక్కలు ఉన్నాయేమో గమనించుకుని అవిలేకుండా చూసుకోండి.

అధికమైన రుణబాధలతో మీరు బాధ పడుతుంటే ప్రతినిత్యం ఇంట్లోనుంచి వెళ్ళేటప్పుడు, ఇంట్లోకి వచ్చేటప్పుడు మీకాళ్లు గడపకు తగలకుండా చూసుకోండి.

ఏదైనా కార్యాలలో ఆటంకాలు ఎదురవుతుంటే వినాయకుడిని గరికతో నిత్యం పూజించండి.

ఆ కారణంగా అవమానాలపాలు ఆవుతున్నవారు ఎడమచేతికి ఎరుపురంగు తాడు రక్షగా కట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది.

దాయాదులతో ఆస్తి తగువులు ఉన్నవారు  ఉన్నవారు పిత్రుకర్మలను నిర్వర్తించడం తోపాటు ప్రతినిత్యం కాకికి అన్నంముద్దపెడితే తప్పకుండా న్యాయంగా మీకురావాల్సిన ఆస్తి వస్తుంది.

మీ సంపాదన చాలీచాలకుండా ఉంటే శుక్రవారంనాడు గులాబీపువ్వును అత్తరులోముంచి మీపూజామందిరంలో ఉంచండి. ఇలా 6 శుక్రవారాలు చేస్తే మీసంపాదన  గతంకంటే కొంతపెరుగుతుంది.

అకారణవివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటే వెంటనే నవగ్రహాలకు ప్రదక్షిణలు ప్రారంభించండి.

చదువులో వెనకపడిపోతుంటే మీరు చదువుకునే గదిలో హంసబొమ్మను పెట్టుకొని దాని ఎదురుగా చదువుకోండి.

మీకు శత్రువులు ఎక్కువవుతుంటే మంగళవారంనాడు పారుతున్ననీటిలో ఆముదంలో ముంచిన తొమ్మిది రాగిముక్కలను విడిచిపెట్టండి.

దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ వయసెంతో అన్ని బొగ్గు ముక్కలను తీసుకుని పారేనీటిలో వదలండి.

ఏ కారణం చేతనైనా మీరు విదేశాలు వెళ్లే అవకాశం మిస్ అయిపోతుంటే గణపతి ఆలయంలో నిమ్మకాయడొప్పలో దీపారాధన చేయండి.

చదువుకునే పిల్లలకి ఏకాగ్రత కుదరడానికి ఐదు గోమతిచక్రాలను ఆకుపచ్చని వస్త్రంలోవేసి మూటకట్టి 

స్కూల్ బాగ్ లో పెట్టండి.

వ్యాపారాభివృద్ధికి 27 గోమతి చక్రాలను పట్టువస్త్రంలో మూటకట్టి వ్యాపార స్థలానికి లోపలిసింహద్వారం పైభాగాన కట్టండి. విపరీతమైన జనాకర్షణతో ధనాకర్షణకూడా పొంది నరఘోష, దిష్టి తొలిగి విపరీతంగా వ్యాపారాభివృద్ధి చెందగలదు.

పూజామందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పొంగలి నైవేద్యంగాపెట్టి ఉసిరికాయతో నేతి దీపారాధనచేస్తే లక్ష్మీకటాక్షం కలిగి దారిద్ర్యబాధలు తొలగుతాయి.

శత్రువులు ఎక్కువ ఉన్నప్పుడు లేదా కుటుంబసభ్యులే వ్యతిరేకులవుతూ ఉంటే లేదా ఏది తలచినా జరగకుండా ఉన్నప్పుడు నారింజకాయని రెండుముక్కలుగా చేసి డొప్పలలో ఉన్న తొనలని తొలగించి, పూజామందిరం దగ్గర వీటిని పసుపు కుంకుమలతో అలంకరించి డొప్పలమధ్యన తేనెలో ముంచిన పువ్వొత్తులతో దీపారాధన చేయండి. శత్రువులు మిత్రులవుతారు. ఊహించిన దానికంటే ఎక్కువగా శుభఫలితాలను పొంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు.

Also Read : ఇంటి ఇల్లాలు చేయకూడని కొన్ని పనులు

లక్ష్మీ దేవి ఆలయంలో ఏదైనా శుక్రవారం రోజున యజమాని చేతితో సమానమైన ఎత్తుకల్గిన రెండు దీపపుకుందెలను ఆవునెయ్యి ఒత్తులతో గుడిలో దీపారాధనచేసి అమ్మవారికి సమర్పిస్తే కటికదారిద్ర్యంతో బాధపడే వారికీ, ఆర్థికఇబ్బందులతో బాధపడేవారికీ, వ్యాపారాదులు నడవక ధనపరంగా రుణబాధలు పడుతున్నవారికీ ఈ దీపదానంవల్ల మంచి ధనికులు కాగలరు.

మంగళవారంరోజున సుబ్రహ్మణ్య స్వామిగుడిలో యజమాని లేదా యజమానురాలి యొక్క చేతిపరిమాణంలో గల దీపపుకుందెల్లో ఆవు నెయ్యి వత్తులు నింపి స్వామికి దీపారాధనచేసి అనంతరం ఆలయానికి సమర్పిస్తే గృహంలో కుజదోషమున్న పిల్లలు ఉంటే దోషనివృత్తి జరుగుతుంది. అలాగే ఋణం,రోగ, శత్రుబాధలు తొలగిపోతాయి.

Famous Posts:

పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ


హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ


తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?

How to Solve Big Problems, Small Solutions To Big Problems, telugu god stories in english, unknown stories of telugu mythology, devotional storys telugu, dharma sandehalu Telugu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.