ఈ కథ విన్నా, ఈ నామం పలికిన సమస్త కోరికలు నెరవేరుతాయి..ఈ కథను భవిష్యపురాణం నుంచి సేకరించటం జరిగింది.
ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు.
Also Read : కష్టాల నుంచి గట్టెక్కించే వేంకటేశ్వర వ్రతం సర్వాభీష్ట ప్రదాయకం.
ఈ "ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆ తరంగాలు కలిపురుషుడుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ చూడసాగాడు.
గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏమి జరిగిందో అస్సలు అర్దం కాలేదు, కాసేపయ్యకా చుస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు.
పట్టుకోబోతే ఈసారి మరింత దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. ఇతను చుస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు, కాని పట్టుకుందామనుకొంటే నేను ఎక్కడో పడిపోతున్నాను.
ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా? విష్ణువా? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి "మహానుభావ, సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి" అన్నాడు.
వేదవ్యాసుడు నవ్వి "ఇది నీరాజ్యం, ఈ కలికాలం నీది, నీకేసందేహమా? ఇక్కడ ఏ ఇద్దరిని సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకి నువ్వు కుశలమే కదా!" అని అడిగాడు.
"కుశలమే! నా రాజ్యంలో నేను కాకా, నువ్వు అయితే పాలించవు కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి" అని వేడుకున్నాడు.
వేదవ్యాసుడు నవ్వి "ఓహో అదా, నీ సందేహం అర్దమయింది, ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వటం లేదు. పట్టుకోవాలని ప్రయత్నించవా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు.
Also Read : వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి ? ముడుపు అంటే ఏమిటి?
త్రికరణ శుద్దిగా నిత్యం ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు" అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.
ఓం నమో భగవతే వాసుదేవాయ..
Famous Posts:
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి
om namo bhagavate vasudevaya, vishnu moola mantra, vishnu beej mantra, most powerful vishnu mantra for success, vishnu mantra telugu, vishnu mantra pdf, vishnu mantra lyrics, lord vishnu beej mantra, vishnu mantra in sanskrit, ఓం నమో భగవతే వాసుదేవాయ.