శివానుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఇలా చెయ్యాల్సిందే  | How To Worship and Get Blessings of Lord Shiva

 

శివానుగ్రహం పొందాలంటే తప్పనిసరిగా ఇలా చేయండి..

శివానుగ్రహం పొందుటకు శాస్త్రం చాలా మార్గాలు చెప్పింది అందులో కొన్ని..

★ ఒకడే శివుడైనప్పటికీ ఉదయకాలంలో దక్షిణామూర్తిగా, మధ్యాహ్నం కిరాతవేషునిగా, సాయంత్రం పార్వతీసహితునిగా ధ్యానించడం ఈశ్వరానుగ్రహాన్ని కలుగజేస్తుంది.

Also Read : మానవుని జన్మకు ముక్తినిచ్చే ఏడు ముఖ్య స్థలాలు.

★ సాలగ్రామం (బాణలింగం), పాదరసలింగం, రాతిలింగం, బంగారు లింగం, ద్విజ ప్రతిష్ఠిత లింగం, సిద్ధులు - దేవతలు - ప్రతిష్ఠించిన లింగం, స్ఫటిక లింగం, రత్నలింగం, జ్యోతిర్లింగాలకు నివేదించిన ప్రసాదం స్వీకరించడం వల్ల అనేక ప్రాయశ్చిత్తములతో కూడిన చాంద్రాయణ వ్రతం ఆచరించిన ఫలితం వస్తుంది.

★ శివపూజానంతరం, అంజలిముద్రలో పువ్వులను పట్టుకుని ఈ క్రింది విధంగా ప్రార్థించాలి. ప్రార్థన అయ్యాక దానం చెయ్యడం వలన సంపూర్ణఫలం లభిస్తుంది.

అనేనైవోపవాసేన యజ్జాతం ఫలమేవ చ,

తేనైవ ప్రీయతాం దేవః శంకరః సుఖదాయకః.

నియమో యో మహాదేవ కృతశ్చైవ త్వదాజ్ఞయా,

విసృజ్యతే మయా స్వామిన్ వ్రతం జాతమనుత్తమం.

వ్రతేనానేన దేవేశ యథాశక్తి కృతేన చ,

సంతుష్టో భవ శర్వాఽద్య కృపాం కురు మమోపరి.

పుష్పాంజలిం శివే దత్వా దద్యాద్దాన యథావిధి,

నమస్కృత్య శివాయైవ నియమం తం విసర్జయేత్.

★ అన్నిపాపములను నాశనము చెయ్యగల వ్రతములలో శివరాత్రికి సమానమైనది మరొకటి లేదు. శాస్త్రంలో నిర్దేశించిన విధంగా శివరాత్రినాడు జాగరణతో కూడిన ఉపవాసం చేసేవారికి మోక్షం కలుగుతుందనడంలో సందేహం లేదు.

★ మూడులోకాలలోనున్న పుణ్యతీర్థాలన్నీ సూక్ష్మరూపంలో మారేడుచెట్టు మూలంలో ఉంటాయి.

★ మారేడు చెట్టు మూలంలోనున్న నీటిని తలపై జల్లుకున్నవాడు సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని పొంది పావనుడౌతాడు.

★ మారేడు చెట్టు మొదలులో శివలింగాన్ని పెట్టి పూజించినవాడు పుణ్యాత్ముడై శివసాయుజ్యాన్ని పొందుతాడు.

★ న యస్య శివనైవేద్య గ్రహణేచ్ఛా ప్రజాయతే,

స పాపిష్ఠో గరిష్ఠః స్యాత్ నరకం యాత్యపి ధృవం.

శివ నైవేద్యం భక్తిగా, ఆనందంగా శిరసారా మ్రొక్కి ప్రయత్నపూర్వకంగా శివస్మరణ చేస్తూ ఆరగించాలి. ఎవరికి శివనైవేద్యం పుచ్చుకోవాలనిపించదో అటువంటివారు మహా పాపాత్ములు, నరకాన్ని చేరతారనడంలో సందేహం లేదు.

★ అభిషేకం వల్ల ఆత్మశుద్ధి, గంధ సమర్పణ వల్ల పుణ్యం, నైవేద్యం పెట్టడం వల్ల తృప్తి, ఆయుర్వృద్ధి, ధూపం వెయ్యడం వల్ల ధనప్రాప్తి/ప్రయోజనాలు సిద్ధించడం, దీప సమర్పణ వల్ల జ్ఞానప్రాప్తి, తాంబూలం ఇవ్వడం వల్ల భోగములు కలుగుతాయి. కాబట్టి ఈ ఆరు ఉపచారాలు ప్రయత్నపూర్వకంగానైనా చెయ్యాలి.

★ శివునకు చందనము, ముక్కలు కాని బియ్యంతో చేసిన అక్షతలు, నల్లనువ్వులతో పూజించడం వల్ల శివానుగ్రహం కలుగుతుంది.

★ శివుని పూజకు 8 ప్రధాన నామాలు: 

శ్రీ భవాయ నమః, శ్రీ శర్వాయ నమః, శ్రీ రుద్రాయ నమః, శ్రీ పశుపతయే నమః, శ్రీ ఉగ్రాయ నమః, శ్రీ మహతే నమః, శ్రీ భీమాయ నమః, శ్రీ ఈశానాయ నమః

★ చండేశ్వరుడికి అధికారం ఉన్న దేవాలయాల్లో మాత్రమే శివనైవేద్యం తినరాదు కానీ బాణలింగాలు, సిద్ధలింగాలు, స్వయంభూలింగాలు ఉన్న దేవాలయాల్లో చండాధికారం ఉండదు కనుక అక్కడి ప్రసాదాన్ని భక్తిగా స్వీకరించాలి.

★ శివరాత్రినాడు అహోరాత్రం జితేంద్రియుడై, ఉపవాసాదులతో యథాశక్తిగా శివుని అర్చించాలి. ఒక సంవత్సరమంతా శివార్చన చేసిన ఫలితాన్ని, శివరాత్రి వ్రతం నాడు శివుని అర్చించడం వలన పొందవచ్చును.

Also Readఆదివారం..మంగళవారం..దుర్గాపూజ ఎందుకు చేయాలి !!

 యే నిందంతి మహేశ్వరం త్రిజగతామాధారభూతం హరం,

యే నిందంతి త్రిపుండ్రధారణకరం దోషస్తు తద్దర్శనే,

తేవై సంకర సూకరాసుర ఖర శ్వక్రోష్టు కీటోపమం,

జాతా ఏవ భవంతి పాప పరమాస్తే నారకాః కేవలం

శివుని, త్రిపుండ్రధారణ చేసిన శివభక్తులను నిందించేవారు అనేక పశు - పక్ష్యాది జన్మలెత్తి అనేక నరకబాధలు అనుభవిస్తారు.

★ అష్టమి, సోమవారం, కృష్ణపక్ష చతుర్దశి (మాస శివరాత్రి), మహాశివరాత్రి- ఈ నాలుగు శివపూజకు ప్రశస్తాలు.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

శివానుగ్రహం, lord shiva blessings, Lord Shiva, lord shiva blessings quotes, lord vishnu blessings, signs that lord shiva is with you, lord shiva blessing messages, lord surya blessings, shiva storys, siva, shiva pooja, shiva images

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS