Drop Down Menus

చనిపోయినవారిని కొన్ని నిమిషాలు బతికించే దేవాలయం ..| Mysterious Temple: Where the Dead People Gets Alive Again

చనిపోయినవారిని కొన్ని నిమిషాలు  బతికించే  దేవాలయం ..

భారత దేశంలో చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం ఉదన్నది వాస్తవం.

ప్రపంచంలో శాస్త్ర, సాంకేతికత ఎంతగా అందుబాటులోకి వచ్చినా మానవ మేదస్సుకు అర్థం కాని ఎన్ని విషయాలు ఈ విశ్వంలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇందులో చావు, పుట్టుకలు కూడా ఉన్నాయిఅందులోనూ ప్రాణం పోకడ గురించి ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అదే కోణానికి చెందిన కథనం ఇది. ఈ దేవాలయంలో చనిపోయినవారు కొద్ది సేపు తిరిగి ప్రాణాలతో బతుకుతారు. ఇందుకుl సంబంధించిన వివరాలు..

Also Readకనక దుర్గమ్మ దిగివచ్చిన మూడు అద్భుత సంఘటనలు.

లఖమండల్ మందిరం

ఇందులో ప్రధాన దైవం ఆ పరమశివుడు. లఖ్ మండల్ ఒక పురాతన దేవాలయం. ఇందు పరమశివుడు నిత్యం నివశించే ప్రాంతంగా స్థానికులు నమ్ముతారు.

భారత దేశంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఈ లఖ్ మండల్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయాన్నిసందర్శనం వల్ల దురదృష్టం పోయి అదుష్టం వరిస్తుందని చెబుతారు.

పాండవులు కాలుపెట్టిన పవిత్రస్థలాల్లో లఖ్ మండల్ మందిరం కూడా ఒకటి. పాండవులు అజ్జాత వాసంలో ఉన్న సమయంలో ఈ లఖ్ మండల్ మందిరంలో కొద్ది రోజుల పాటు గడిపారని చెబుతారు.

లఖ్ మండల్ అనే పదం రెండు పదాల నుంచి ఉద్భవించిందని చెబుతారు. లఖ్ అంటే అనేక, మండల్ అంటే దేవాలయం లేదా లింగం అని అర్థం

ఇక్కడ భారతదేశ పురావస్తుశాఖ అధీనంలో జరిపిన తవ్వకాల్లో అనేక కళాఖండాలు బయటపడ్డాయి. అందులో అతి ముఖ్యమైన ఆకర్షణ స్వామి వారి లింగం 

అత్యంత పారదర్శకత కలిగిన ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం అంతా అ లింగం పై భాగంలో మనం గమనించవచ్చు. ఒక్కసారి ఈ లింగాన్ని చూస్తే ఆధ్యాత్మిక పొంగిపొర్లుతుంది.

ఇక్కడ స్థానికులు చెప్పే కథను అనుసరించి ధుర్యోధనుడు పాండవులను లక్క గృహంలో నిర్భంధించి చంపాలని నిర్ణయిస్తాడు. ఆ గృహమే ప్రస్తుత దేవాలయమని భక్తులు నమ్ముతారు.

ఇక ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు మనలను ఆకట్టుకొంటాయి. అయితే స్థానికులు మాత్రం ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడిదని, మరో విగ్రహం అర్జునుడిదని నమ్ముతారు.

మానవ, దానవ ప్రతిమలను విష్ణువు నివశించే వైకుంఠం ద్వారపాలకులైన జయ విజేయులతో పోల్చేవారు కూడా స్థానికులు చెబుతారు. ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లేదా చనిపోయిన వెంటనే ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువస్తారు

అనంతరం ఆ పరమశివుడు కొలువై ఉన్నట్లు భావించే ఇక్కడి శివలింగాన్ని అభిషేకించిన నీటిని ఆ చివరి ఘడియల్లో ఉన్న వారికి లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే తిరిగి కొద్ది సేపు బదుకుతాడని ఇక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు.

ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు. ఇక ఈ ప్రాంతానికి దగ్గర్లో దుంధి ఓడారి అని పిలువబడే ఓ గుహ ఉంది. స్థానికుల కథనం ప్రకారం పాండవులు తమను కాపాడుకోవడానికి ఈ గుహలోనే ఉన్నారని చెబుతారు

దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ జిల్లాలో చౌన్సర్ - బావర్ అనే ప్రదేశంలో ఈ దేవాలయం ఉంది.

ఈ దేవాలయాన్ని ఉత్తర భారత దేశ శైలిలో నిర్మించారు. లఖ్ మండల్ దేవాలయం చక్రతా నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఈ మెరిసే శివలింగం..శివలింగంపై నీరుపోస్తే అద్దంలా అద్భుతంగా మెరుస్తూ పోసినవారి బింబం  లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది..అభిషేకం చేసిన నీరు కూడా స్వఛ్చంగా మారటమే కాకుండా రుచి కూడా తియ్యగా మారడం ఈ లింగంలోని అద్భుతం.

Famous Posts:

పూరీ జగన్నాథ్ దేవాలయం యొక్క అంతుచిక్కని రహస్యాలు

> తిరిగి అతుక్కునే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా?

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments