Drop Down Menus

కొత్తగా పెళ్ళయినవారు ఆషాడమాసంలో ఎందుకు దూరంగా ఉండాలి? The New Couples Must Comply with Any Restrictions in Ashada Masam?

ఆషాఢం అంటే అందరికీ ఇష్టమైనా... కొత్తగా పెళ్ళైన దంపతులకు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుటాంరు.

వివాహం అయిన తరువాత వచ్చే తొలి ఆషాఢంలో కొత్తగా అత్తారింకి వచ్చే కోడలు, అత్తగారు ఒకే చోట ఉండకూడదని, ఒకరికొకరు ఎదురు పడకూడదని చెబుతుటారు. అంతే కాకుండా సాగు పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉంటా రు. కాబట్టి కొత్త అల్లుడికి మర్యాదల విషయంలో లోటు వస్తుందనే ఉద్దేశంతో కూడా ఎడబాటుగా ఉంచుతారు.

Also Readకొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

ఆషాఢమాసంలో కొత్త దంపతులు కలిసి ఉండరాదనే ఆచారాన్ని ఎందుకు పాటిస్తారు. దీనివల్ల కలిగే అనర్థం ఏమి? అసలు కలిసుంటే ఏమౌతుంది. ఆషాఢమాసం కాదిది, నవదంపతుల సరస శృంగారాల, సురభిళసింగారాల ప్రవిమల ప్రణయాల, వియోగాల విరహాల ఆరూఢమాసం అంటూ ఓ కవి దీని గురించి వర్ణించాడు.

ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన జంటలకు ఎడబాటు తప్పదు. అత్తా అల్లుడు ఎదురు పడకూడనే ఆచారం ఉంది. అందుకే ఆషాఢంలో కొత్త దంపతులు కలిసి ఉండకూదని అంటా రు. దీని వెనుక కూడా ఒక అర్థం ఉంది. పూర్వకాలంలో వ్యవసాయమే జీవనాధారం. సంపాదన మాట అటు నుంచి తినడానికైనా కొన్ని గింజలు ఉండాలని, కొత్త వలపు మోజులో పడి జీవనాధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అనీ ఈ నిబంధన పెట్టారు.

అంతే కాదు ఈ మాసంలోని వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుటాయి. చల్లని వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌లు అంటువ్యాధులుగా బాగా ప్రబలుతాయి. ఇలాటిం సమయంలో కొత్త పెళ్ళి కూతురు గర్భం దాల్చితే పుట్టబోయే బిడ్డమీద వాటి ప్రభావం ఉంటుందనేది శాస్త్రీయ నమ్మకం. పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడతాయి. కావున ఈ నెలలో వధువు పుట్టింట్లో ఉండడమే క్షేమమని పెద్దలు ఆచారంగా పెట్టారు. దీన్ని అనారోగ్య మాసంగా పెర్కొటారు. ఈదురు గాలులతో వర్షం కురుస్తుంది. కాలువల్లోనూ, నదుల్లోనూ ప్రవహించే నీరు అపరిశుభ్రంగా ఉంటుంది. మలినాలతో కూడిన నీరు వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ఇవన్నీ గర్భిణి ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో కడుపులోని పిండం కూడా అనారోగ్యం బారిన పడుతుంది.

అలాగే ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణంలో వ్రతాలు నోములు జరుగుతాయి. ఈ నెలో దాదాపు అన్నీ మంచి రోజులే ఉంటా యి. ఆ శుభ ఘడియల్లో గర్భదారణ జరిగితే మంచిదని పెద్దల నమ్మకం. జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలంలో భావించేవారు. ఆషాఢంలో గర్భం దాల్చితే తొమ్మిది నెలలకి అంటే చైత్రం పూర్తవుతుంది. ఆ సమయంలోఎండకు పుట్టిన  పిల్లలు, బాలింతలు తట్టుకోలేరని ఈ నియమం పెట్టారురు. అలాగే ఒక నెల వియోగం తర్వాత కలుసుకుంటే అన్యోన్యత దాంపత్యాన్ని పొందుతారని అని కూడా అంటా రు.

పూర్వకాలంలో కొత్తగా పెళ్లైన యువకులు ఆరు నెలలపాటు అత్తగారి ఇంట్లో ఉండే సంప్రదాయం ఉండేది. కష్టపడి పనిచేయాల్సిన యువకులు అత్తవారింట్లో కూర్చుంటే వ్యవసాయ పనులు సకాలంలో జరుగవు. వర్షాధారంగా పంటలు పండించుకోవడం వల్ల సకాలంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా ఆకలితో మాడిపోవాల్సిందే.

అందుకే కొత్త కోడలు పుట్టింట్లో ఉండాలి. అల్లుడు అత్తవారిం వైపు చూడకూడనే నియమం పెట్టారు.

Famous Posts:

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

ఆషాడమాసం,Bride and Groom, Ashada Masam, ashada masam in telugu, Ashadha, new couples ashadam

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments