Drop Down Menus

ప్రతీ స్త్రీ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం | This is something every woman must know - Devotional Story's

ప్రతీ స్త్రీ తప్పకుండా తెలుసుకోవలసిన విషయం : -

దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడు ,ఏ సాధన చేస్తే అనుగ్రహిస్తాడో ఎవరి ఊహకు అందనిది.

Also Readచనిపోయినవారిని కొన్ని నిమిషాలు  బతికించే  దేవాలయం ..

నేటి సమాజంలో కొందరు స్త్రీలు తాము కోరినవి  భర్త  తేలేని  స్థితిలో ఉన్నప్పుడు, అందరి ముందూ తులనాడుతూ, అవహేళన చేస్తూ, అవమానకరంగా ప్రవర్తిస్తుంటారు. భర్తపై హాస్య ధోరణిలో మాట్లాడుతూ అపహాస్యం చేస్తుంటారు. పెళ్ళైన స్త్రీమూర్తి భర్తతో ఎలా ప్రవర్తించాలో చాటి చెప్పే గొప్ప శ్లోకం రామాయణంలో ఉన్నది.  పతివ్రతా ధర్మాన్ని ఆచరించి చూపిన మహా పతివ్రత సీతమ్మ తల్లి రావణునిచే అపరింప బడి అశోకవనంలో ఉన్నప్పుడు రాక్షస స్త్రీలతో జరిగిన సంభాషణ, అత్యంత రమణీయం.

వాల్మీకి మహర్షి విరచిత రామాయణం లో సుందర కాండము అత్యంత ప్రశస్తమూ రసబంధురం.అందులో ఈ శ్లోకం అత్యద్భుతంగా ఉంటుంది.ఆదికవి వాల్మీకి అని ఎందుకు అంటారో రామాయణం అంత అద్భుతంగా తాను తన దివ్య దృష్టితో కన్నదంతా పొల్లు పోకుండా విడమరచి వ్రాయడం సామాన్యులకు సాధ్యమేనా.

లంకా రాజ్యములో రావణుని అశోక వనములో శింశుపా వృక్షము కింద సీతకు కాపలా కాస్తున్న రాక్షస స్త్రీలు ఆమెను పలు పలు విధాలా దూషించారు.

రావణుని వరించి సుఖించమని లేకున్న చంపి తినివేస్తామని బెదిరించారు.

రావణుడు కూడా ఎన్నో ఆశలు చూపెట్టాడు. అయినా మహాపతివ్రత సీతా సాధ్వి కొంచెం కూడా చలించలేదు. ఆమె సుగుణాలు గన్న రాక్షస స్త్రీ గణం మారారు గానీ సీత ఆ లంకా సామ్రాజ్య వైభవం అంతా గడ్డిపోచతో సమానంగా భావించింది.

సీత సుగుణాలకు ముచ్చట పడిన రాక్షస కాంతలు - రాజ్యము వైభవం ఏ మాత్రం లేని రామునే భర్తగా ఇప్పటికీ కోరుకుంటున్నావు. ఆయన్ని తిరిగి చేరినా నీకు కష్టాలు తప్ప మరేముంటుంది అని అడిగారు.దానికి సీతా మహా సాధ్వి ఇచ్చిన సమాధానం ఈ అద్భుత శ్లోకం.

దీనోవా రాజ్య హీనోవా యో మే భర్తా సమే గురు:

తం నిత్యా మనురక్తా స్మి యథా సూర్యం సువర్చలా

యథా శచీ మహా భాగా శక్రం సముపతిష్టతి

అరుంధతీ వశిష్టంచ రోహిణీ శశినం యథా

లోపాముద్ర యగస్త్యం సుకన్యా చ్యవనం యథా

సావిత్రీ సత్యవంతంచ కపిలం శ్రీమతీ యథా

సౌదాసం మదయంతీవ కేశినీ సగరం యథా

నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా

తథాహు మిక్ష్వాకువరం రామం పతిమనువ్రతా

Also Read : నుదుట బొట్టు ఏ వేలితో పెట్టుకుంటే ఏం ఫలితమో తెలుసా ?

తన పతి అయిన రామునికి రాజ్యము లేకపోయినా అతను దీనస్థితిలో ఉన్నా..ఆయన యొడల నిత్యం అనురక్తితో సూర్య భగవానుని సువర్చలా దేవి , ఇంద్రుని మహాపతివ్రత శచీదేవి, క్షత్రియ వంశ గురువు వశిష్టులవారిని అరుంధతి, చంద్రుని వరించి ఆతన్నితోనే అనురక్తురాలైన రోహిణీ తార వలే , అగస్త్య మహామునిని సేవించిన లోపాముద్ర మాదిరి, చ్యవనుని సేవించిన సుకన్యవోలె, సత్యవంతుని బ్రతికించుకున్న సావిత్రి వలే, కపిలమహామునిని సేవించిన శ్రీమతి వలే, సౌదాసుని అనుసరించిన మదయంతి వోలె , సగర చక్రవర్తి ని అనుసరించిన కేశిని వలే, నలమహారాజుని వరించిన భీమ రాజ పుత్రి దమయంతీ దేవి వలే ఇక్ష్వాకు వంశ తిలకుడు తన పతి శ్రీరాముని అన్ని వేళలా అనుసరిస్తానని ఆమె చెప్పడముతో సీత శీల సౌభాగ్యానికి అమిత ముగ్ధులై ఆమె పాదాలను అప్రయత్నంగా తాకారట ఆ రాక్షస స్త్రీలు.

ఇదీ మన దేశ స్త్రీల ఔన్నత్యం.ఇదీ మన భారత దేశ సౌభాగ్యము.

Famous Posts: 

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

 స్త్రీ, women, stree, This is something every woman must know, life skills every woman should know, ramayanam, seetha, devotional storys, dharma sandehalu

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

తిరుమల దర్శనం టికెట్స్ ఇతర సేవ టికెట్స్ ప్రస్తుతం ఆగస్టు నెల వరకు బుక్ అయ్యాయి . సెప్టెంబర్ నెలకు జూన్ నెలలో 18వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.