నిద్రకు_ముందు_తర్వాత_ఏ_దేవుణ్ణి_స్మరించాలి..
శరీరానికి, మనస్సుకి ఎంతో ప్రశాంతతనిచ్చే నిద్ర రోజులో అందరికీ ఎంతో ముఖ్యం. అటువంటి నిద్రకు, ముందు తరువాత కూడా దేవుడ్ని స్మరిస్తే ఎంతో చక్కటి శాంతి లభించి, మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందనేది పెద్దల మాట. అయితే, ఇంతకీ, పడుకునే ముందు... తరువాత ఏ దేవుళ్లని స్మరించుకోవాలి.
మనం ప్రతీ రోజూ తప్పక చేసే రెండు పనులు… పడుకోవటం, లేవటం. ఈ పనులు మనిషే కాదు… జీవులన్నీ చేస్తాయి. మరి మనిషి కూడా జంతువుల్లాగా నిద్ర రాగానే పడుకుని , తెల్లవారగానే లేవటమేనా? ఇంకేం తేడా లేదా?
పెద్దలు ఏమంటున్నారు? దైవాన్ని నమ్మే మనిషి పడుకునే ముందు, నిద్ర లేవగానే దైవాన్ని స్మరించాలంటున్నాయి శాస్త్రాలు. ఏ పని చేసినా మనం దైవ నామ స్మరణ చేస్తాం. దీనివల్ల శాంతి లభించి, మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందట. ఇంతకీ ఏ దేవుణ్ణి స్మరించాలి? దీనికి కూడా పండితులు ఓ మాట చెప్పారు.
శంకరుడు..
నిద్రించే ముందు మనం శివుడ్ని స్మరించాలి. ఓం నమః శివాయ అంటూ శంకరుణ్ణి ధ్యానిస్తూ నిద్రలోకి జారుకోవాలి. ఇలా ఎందుకంటే, శివుడు లయకారుడు. ఆయన్ని స్మరిస్తూ నిద్రలో లయిస్తే పీడకలల వంటివి లేకుండా హాయిగా పడుకోగలుగుతాం.
విష్ణుమూర్తి..
అలాగే… నిద్ర లేచిన వెంటనే… మనస్సులో స్మరించాల్సిన నామం… విష్ణు నామం. విష్ణువు అంటే స్థితికారుడు. ఆయనే మనల్ని రోజంతా క్షేమంగా, ఆనందంగా ముందుకు నడిపేవాడు. కాబట్టి… విష్ణువును స్మరిస్తూ మేల్కొనాలి అంటారు పండితులు.
ఏదో ఒక విష్ణు మంత్రం జపిస్తూ నిద్ర లేవాలి. అప్పుడు ఆ నారాయణుడే మనల్ని రోజంతా భద్రంగా కాపాడుతూ వుంటాడని భావం.
ఇక నిద్ర మేల్కొన్న తరువాత కళ్లు తెరిచే ముందు రెండు అర చేతులు రాపిడి చేసుకుని కళ్లపై అద్దుకోవాలి. ఆ తరువాత అరచేతుల్లోకి చూస్తూ కళ్లు విప్పాలి. అరచేతుల్లో లక్ష్మీ, సరస్వతీ, గౌరీ దేవిలు కొలువై వుంటారని శాస్త్రం. అందుకే, ఇలా చేయటం వల్ల రోజంతా శుభప్రదంగా వుంటుంది.
Famous Posts:
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
> తీర్థం తీసుకున్న తర్వాత చేతిని తలపై రాసుకుంటే ఏంమవుతుంది?
> సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు
నిద్ర, devotional stories in telugu, hindu devotional stories, devotional stories in telugu, devotional stories
🙏🙏
ReplyDeleteVery good information
ReplyDelete