Drop Down Menus

మహిళలు బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టీలు ధరించాలి. ఎందుకొ మీకు తెలుసా ..? Women should wear silver straps and not gold straps. Do you know why ..?

మ‌హిళ‌లు బంగారు ప‌ట్టీల‌ను కాదు వెండి ప‌ట్టీల‌ను ధ‌రించాలి. ఎందుకో తెలుసా..?

వెండి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌నే ధ‌రించాలి...

మ‌హిళ‌లు పాదాల‌కు ప‌ట్టీలు ధ‌రించ‌డం అన్న‌ది మ‌న భార‌తీయ సంప్ర‌దాయాల్లో ఒక‌టి. మ‌న దేశంలో ఉన్న చాలా వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌లు కాళ్ల‌కు ప‌ట్టీల‌ను ధ‌రిస్తారు. అయితే ఆ ప‌ట్టీలు వెండితో చేసిన‌వే అయి ఉంటాయి. మ‌హిళ‌లు వివాహం చేసుకున్న సంద‌ర్భంలో కాలివేళ్ల‌కు మెట్టెలు తొడుగుతారు. అదే ప‌ట్టీలు అయితే ఆడ‌పిల్ల పుట్టగానే త‌ల్లిదండ్రులు చిన్న‌ప్ప‌టి నుంచే వారి పాదాల‌కు ప‌ట్టీల‌ను తొడుగుతారు. ప‌ట్టీలు తొడుక్కుని ఆడ‌పిల్ల‌లు ఇంట్లో సంద‌డిగా తిరుగుతుంటే ఆ ఇంట్లో ల‌క్ష్మీదేవి కొలువుంటుంద‌ని పండితులు చెబుతారు. 

అయితే ప‌ట్టీల‌ను ఏ మ‌హిళ అయినా స‌రే.. వెండి లోహంతో చేసినవే ధ‌రించాలి. కానీ నేటి త‌రుణంలో చాలా మంది బంగారంతో చేసిన ప‌ట్టీల‌ను తొడుగుతున్నారు. నిజానికి ఇలా చేయ‌డం స‌రికాదు. ఇందుకు శాస్త్రీయంగానే కాదు, పురాణాల ప‌రంగా కూడా కార‌ణాలు ఉన్నాయి. అవేమిటంటే..

సాధార‌ణంగా హిందూ పురాణాల ప్ర‌కారం.. బంగారం అంటే సాక్షాత్తూ ల‌క్ష్మీదేవి అనే చెబుతారు. అలాగే ల‌క్ష్మీదేవికి ప‌సుపు రంగు అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. ఈ క్ర‌మంలో బంగారం కూడా ప‌సుపు రంగులో ఉంటుంది క‌నుక‌.. ఆ రంగులో వస్తువులు ఏవైనా స‌రే.. ఆఖ‌రికి ప‌ట్టీలు అయినా స‌రే.. పాదాల‌కు ధ‌రించ‌కూడ‌దు. ఇక ఈ విష‌యంలో సైన్స్ చెబుతున్న‌దేమిటంటే…

వెండి మ‌న శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి వ‌స్తువులు ధ‌రిస్తే శ‌రీరంలో ఉన్న వేడి బ‌య‌ట‌కు పోతుంది. క‌నుక పాదాల‌కు ఎప్పుడూ వెండితో త‌యారు చేసిన ఆభ‌ర‌ణాల‌నే ధ‌రించాలి. అదే బంగారం అయితే ఒంట్లో వేడి పెరుగుతుంది. క‌నుక బంగారంతో చేసిన ప‌ట్టీల‌ను వేసుకోరాదు. అయితే వెండితో చేసిన ప‌ట్టీల‌ను ధ‌రిస్తే న‌డుం నొప్పి, మోకాళ్ల నొప్పులు పోతాయ‌ట‌. అందుకోస‌మైనా మ‌హిళ‌లు వెండితో చేసిన ప‌ట్టీల‌ను ధ‌రించాల్సిందే..

Famous Posts:

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?


మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి.


సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 


మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.


భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?


మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.


భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

మహిళలు, పట్టీలు, బంగారు పట్టీలు, వెండి పట్టీలు, benefits of wearing silver kada in leg, scientific reason for wearing anklets, scientific reason for wearing silver, benefits of wearing silver anklets 

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments