ఆగస్టు నెలలో పుట్టిన వారి ఫలితాలు..
ఆగస్టు నెలలో పుట్టిన స్త్రీ పురుషులకు ధైర్యం, ఆత్మాభిమానం, ఆత్మ విశ్వాసం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇతరుల సలహాలు అడగకుండానే వారే నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనిని పూర్తి చేస్తారు. మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. వీరికి సమయస్ఫూర్తి ఎక్కువ.
వీరికి ఇతరులను గెలిచే అదృష్టం ఉంటుంది. ప్రతీ విషయంలో ముందుంటారు. వారు అనుకొన్నది వెంటనే ప్రారంభిస్తారు. అనుకొన్నవి అనుకున్నట్లుగా చేసి ఆశ్చర్యపడే పనులు చేస్తారు. వీరి పనులు ఆగవు. ఆగినచో కష్టములు పొందుతారు.
ఈ నెలలో పుట్టినవారు డబ్బు విషయంలో చాలా దురదృష్టవంతులు డబ్బు గురించి అనేక రకములుగా ఇబ్బందులు పడ్డారు. సమయానికి వారి ఆలోచనలు కలసిరాకపోతే జీవితంలో ఇబ్బందులు, బాధలు పడతారు.
వీరికి ఆలోచనలు ఎక్కువ. కలలుకనే స్వభావం ఉంటుంది. ఊహలలో తేలిపోతారు. ఊహాలోకాలలో విహరిస్తూ ఉంటారు. సోమరితనం కూడాఉండే అవకాశం ఉంది. అయినా ఇతరులను ఎదిరించగలరు. త్రిప్పికొట్టగలరు. శతృవులను జయించగలరు.
మంచి వాతావరణాన్ని, మంచి జీవితాన్ని కోరుకొంటారు. దేవుని నమ్ముతారు. సాంప్రదాయాలను నమ్ముతారు, పాటిస్తారు.
వీరికి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుంది. లోకజ్ఞానం, నాలెడ్జి ఎక్కువగా ఉంటుంది. జ్యోతిషంలో ప్రవేశం ఉంటుంది. మతము, పురాణ చరిత్రలపైన నమ్మకం అవగాహన ఉంటుంది వేదాంత విషయాలలో కూడా నమ్మకం ఉంటుంది. దైవభక్తి ఉంటుంది.
ఈ నెలలో జన్మించినవారు ప్రేమజీవులు. ఎవరినైతే ఇష్టపడతారో వారిపట్ల పూర్తి ప్రేమానురాగాలు చూపుతారు. వీరి ప్రేమ చాలా లోతైనది. తల్లితండ్రులను, సోదరులను కావలసిన వారిని మనసా వాచా ప్రేమిస్తారు. కుటుంబనియమాలు పాటిస్తారు. వృత్తి గౌరవం ఉంటుంది వీరికి,
ఆరోగ్యము: ఆగస్టునెలలో పుట్టినవారికి కంటిజబ్బులు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
లక్కీ వారములు: సోమ, బుధ, ఆదివారాలలో అదృష్టం కలిసి వస్తుంది.
లక్కీ కలర్ దుస్తులు: ఆకుపచ్చ గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్ దుస్తులు ధరిస్తే మంచి జరిగే అవకాశం ఉంది.
లక్కీ స్టోన్స్: పగడం కాని, పసుపు రంగు స్టోన్ గాని ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.
Related Posts:
> జనవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది
> ఫిబ్రవరి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మార్చి నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> ఏప్రిల్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> మే నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూన్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది .
> జూలై నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> అక్టోబరు నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> నవంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
> డిసెంబర్ నెలలో పుట్టిన వారి లక్షణాలు, భవిష్యత్తు ఇలా ఉంటుంది.
august, horoscope, august month future birth, birth, character august month
How to know raashi with date of birth
ReplyDelete