గుమ్మం దగ్గర ఇవి ఉంచితే దరిద్రం పరార్..
గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం, ఐదు రూపాయి బిళ్ళలు అందులో వెయ్యండి.
అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం. వీలైతే ఒక వట్టివేళ్ళు గుత్తి అందులో పెట్టండి పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి.
ఇలా రోజూ పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చ కర్పూరం, వట్టివేళ్ళు, ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మిదేవి అడుగు పెడుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు.
దరిద్రదేవత ఆ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అని కూడా పెద్దలు చెబుతూఉంటారు. కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టివేళ్ళ పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి. అదేవిధంగా గుమ్మానికి బయటవైపు పక్కనే దీపాలు పెట్టండి. ప్రతి రోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని కచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు.
కాబట్టి ఈ పరిహారాల్ని పాటించండి దరిద్రదేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది.
Famous Posts:
> పంచముఖ ఆంజనేయ స్వామి వారి అవతార కథ
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
గుమ్మం, gummam, gummaniki pooja, Dwara Lakshmi Pooja, gadapa pooja