Drop Down Menus

అనేక బాధలు ఇబ్బందులు పడే వారి కోసం ఈ ఋణవిమోచన స్తోత్రాలు...........!! Most Powerful Runa Vimochana Stotrams Telugu

ఆర్దిక ఋణాలతో, అప్పులతో, డబ్బు సరియైన సమయానికి రాక , అనేక  బాధలు ఇబ్బందులు పడే వారి కోసం ఈ ఋణవిమోచన స్తోత్రాలు...........!!

ఈ కలికాలంలొ మానవులు ఆర్దిక ఋణాలతో,  అప్పులతో, డబ్బు సరియైన సమయానికి రాక , అనేక  బాధలు ఇబ్బందులు.. పడుతూ వుంటారు. ఇలాంటి వాటికి మన మహర్షులు, గౌతమ, అగస్త్య, వ్యాస మహర్షీ లాంటి వారు  ముందుగానే గ్రహించి ,  కొన్ని శక్తి వంతమైన స్తోత్రాలు చెప్పారు . . . .

వీటిని రోజూ మూడు పూటలు పఠిస్తే.. మీ ఋణబాధలు తొలుగుతాయి, 

డబ్బు సరియైన సమయంలొ మీ చేతికి అందుతుంది. కనీసం రోజుకు ఒక్కసారి అయిన చదవాలి.

1.ఋణ విమోచన గణేశ స్తోత్రం.....

ధ్యానం..

సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం

బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

స్తోత్రం.

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౧ ||

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||

హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||

పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః

సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం

ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్

పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్

ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం

సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్

అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్

భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం ||


2.ఋణవిమోచన అంగారక స్తోత్రం......

స్కంద ఉవాచ |

ఋణగ్రస్త నరాణాంతు ఋణముక్తిః కథం భవేత్ |

బ్రహ్మోవాచ |

వక్ష్యేహం సర్వలోకానాం హితార్థం హితకామదం |

అస్య శ్రీ అంగారక స్తోత్ర మహామంత్రస్య గౌతమ ఋషిః అనుష్టుప్ ఛందః అంగారకో దేవతా మమ ఋణ విమోచనార్థే జపే వినియోగః |

ధ్యానమ్ |

రక్తమాల్యాంబరధరః శూలశక్తిగదాధరః |

చతుర్భుజో మేషగతో వరదశ్చ ధరాసుతః || ౧ ||

మంగళో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రదః |

స్థిరాసనో మహాకాయో సర్వకామఫలప్రదః || ౨ ||

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకరః |

ధరాత్మజః కుజో భౌమో భూమిజో భూమినందనః || ౩ ||

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారకః |

సృష్టేః కర్తా చ హర్తా చ సర్వదేవైశ్చపూజితః || ౪ ||

ఏతాని కుజ నామాని నిత్యం యః ప్రయతః పఠేత్ |

ఋణం న జాయతే తస్య ధనం ప్రాప్నోత్యసంశయం || ౫ 

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సలః |

నమోఽస్తు తే మమాఽశేష ఋణమాశు వినాశయ || ౬ ||

రక్తగంధైశ్చ పుష్పైశ్చ ధూపదీపైర్గుడోదకైః |

మంగళం పూజయిత్వా తు మంగళాహని సర్వదా || ౭ ||

ఏకవింశతి నామాని పఠిత్వా తు తదండకే |

ఋణరేఖాః ప్రకర్తవ్యాః అంగారేణ తదగ్రతః || ౮ ||

తాశ్చ ప్రమార్జయేత్పశ్చాత్ వామపాదేన సంస్పృశత్ |

మూలమంత్రః |

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |

నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

ఏవం కృతే న సందేహో ఋణం హిత్వా ధనీ భవేత్ ||

మహతీం శ్రియమాప్నోతి హ్యపరో ధనదో యథా |

అర్ఘ్యం |

అంగారక మహీపుత్ర భగవన్ భక్తవత్సల |

నమోఽస్తుతే మమాశేషఋణమాశు విమోచయ ||

భూమిపుత్ర మహాతేజః స్వేదోద్భవ పినాకినః |

ఋణార్తస్త్వాం ప్రపన్నోఽస్మి గృహాణార్ఘ్యం నమోఽస్తుతే౧౨

3.శ్రీనరసింహఋణమోచన స్తోత్రం......

శ్రీగణేశాయ నమః.

ఓం దేవానాం కార్యసిధ్యర్థం సభాస్తమ్భసముద్భవమ్ ।

శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౧॥

లక్ష్మ్యాలిఙ్గితవామాఙ్గం భక్తానామభయప్రదమ్ ।

శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౨॥

ప్రహ్లాదవరదం శ్రీశం దైతేశ్వరవిదారణమ్ ।

శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౩॥

స్మరణాత్సర్వపాపఘ్నం కద్రుజం విషనాశనమ్ ।

శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౪॥

అన్త్రమాలాధరం శఙ్ఖచక్రాబ్జాయుధధారిణమ్ ।

శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౫॥

సింహనాదేన మహతా దిగ్దన్తిభయదాయకమ్ ।

శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౬॥

కోటిసూర్యప్రతీకాశమభిచారికనాశనమ్ ।

శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ॥ ౭॥

వేదాన్తవేద్యం యజ్ఞేశం బ్రహ్మరుద్రాదిసంస్తుతమ్ ।

శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే ఓం  ౮॥

ఇదం యో పఠతే నిత్యం ఋణమోచకసంజ్ఞకమ్ ।

అనృణీజాయతే సద్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ ॥ ౯॥

॥ ఇతి శ్రీనృసింహపురాణే ఋణమోచనస్తోత్రం సంపూర్ణం.

4.దారిద్ర్యదహన  శివస్తోత్రం......

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ

కర్ణామృతాయ శశిశేఖరధారణాయ |

కర్పూరకాంతిధవళాయ జటాధరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౧ ||

గౌరీప్రియాయ రజనీశకళాధరాయ

కాలాంతకాయ భుజగాధిపకంకణాయ |

గంగాధరాయ గజరాజవిమర్దనాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౨ ||

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ

ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ |

జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౩ ||

చర్మంబరాయ శవభస్మవిలేపనాయ

భాలేక్షణాయ మణికుండలమండితాయ |

మంజీరపాదయుగళాయ జటాధరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౪ ||

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ

హేమాంశుకాయ భువనత్రయమండితాయ |

ఆనందభూమివరదాయ తమోహరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౫ ||

భానుప్రియాయ దురితార్ణవతారణాయ

కాలాంతకాయ కమలాసనపూజితాయ |

నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౬ ||

రామప్రియాయ రఘునాథవరప్రదాయ

నాగప్రియాయ నరకార్ణవతారణాయ |

పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౭ ||

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ

గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ |

మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ

దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౮ ||

ఇతి శ్రీ దారిద్య్రదహన శివ స్తోత్రం సంపూర్ణం..!!

Famous Posts:

కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 

సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?

కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

మీకు ఏదైనా సమస్య ఉందా అయితే వెంటనే ఈ స్వామి వారికి ఉత్తరం రాయండి 

సంతానం కోరుకునే వారికీ కచ్చితమైన పరిష్కార మార్గం 

మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం రావాలంటే ఇలా చేయండి.

భస్మధారణ అంటే ఏమిటి? దాని వల్ల కలిగే లాభాలు ఏంటి?

మహాభారతం నుండి నేరచుకోవలసిన 12 ముఖ్యమైన విషయాలు.

భారతీయులు ప్రతి ఒక్కరూ  తెలుసుకోదగినవి అద్భుతమైన దేవాలయలు

Most Powerful Runa Vimochana Stotrams Telugu, runa vimochana stotram in telugu, runa vimochana stotram benefits, runa vimochana stotram, runa vimochana stotram lyrics, runa vimochana meaning, runa vimochana narasimha stotram pdf, runa vimochana stotram pdf, siva stotrams

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.