Drop Down Menus

కాలసర్ప దోష నివారణకు మానసా దేవి ద్వాదశనామ స్తోత్రం | Sri Manasa Devi Dwadasa nama Stotram Telugu Lyrics

కాలసర్ప దోషం తొలగడానికి మనసా దేవి స్త్రోత్రం

మానసాదేవి ద్వాదశనామస్తొత్రమ్

ఈ శ్లోకం ఎవరు  రోజు చదువుతారో వారికి సర్ప భయం ఉండదు . కాలసర్ప దోషం భాధించదు .

శ్లోకం

జరత్కారు  జగద్గౌరీ  మానసా  సిద్ధయోగినీ 

వైష్ణవీ నాగభగినీ  శైవీ  నాగేశ్వరీ  తథా

జరత్కారుప్రియా  ఆస్తీకమాతా  విషహరేతి  చ 

మహాజ్ఞానయుతా   చైవ  సా  దేవీ  విశ్వపూజితా 

ద్వాదశైతాని   నామాని  పుజాకాలేతు యఃపఠేత్    

తస్య నాగభయం  నాస్తి  తస్య  వంశోద్భవస్య  చ   

మానసాదేవిమంత్రం

" ఓం  హ్రీం శ్రీం  క్లీం  ఐం మానసాదేవ్యై స్వాహా"

మానసాదేవి చరిత్ర

మానసా దేవి వాసుకి   చెల్లెలు . వాసుకి జనమేజయుడు  చేస్తున్న సర్పయాగంలో సర్పాలు మరణిస్తునపుడు,   మానసాదేవిని తన కుమారుడైన అస్తీకుని తో చెప్పి  నాగజాతిని కాపాడమని కోరతాడు .మానసా దేవి ఆదేశానుసారం అస్తీకుడు     ఆ యాగాన్ని  ఆపి సర్పజాతిని  కాపాడతాడు .వారు అస్తీకుడు   కృతజ్ఞతలు తెలుపుతారు.అప్పుడు అస్తీకుడు వాసుకి తొ నేను నా తల్లి తపస్సు వల్ల ,అశీస్సులువల్ల ఈ పని సాధించాను అని చెబుతాడు . అప్పుడు ఇంద్రుడు అది నిజమని  పలికి. అమ్మ జరత్కారు ! నీవు  జగన్మాత అయిన లక్ష్మీదేవి అంస తో ఉదయించి ,పూర్వ జన్మలో మమహాతపస్సు  చేశావు .హరిహరులు నీ  తపస్సు కు సంతోషించి "సిథేశ్వరి" గా నీకు వరములు ప్రసాదించారు .ఆనాడు  దేవతలకు నీవు ఎన్నో ఉపకారాలు చేశావు.నన్ను   కూడా    నీవు రక్షించావు .  నీ  భర్త  అయిన జరత్కారు మునీశ్వరుడిని (ఆయనలో నారాయణ అంశ వున్నది) యంతో భక్తితో    సేవించి  ఈ అస్తీకుడిని వరప్రసాదంగా కన్నావు .దేవతలయందు ఆర్తుల యందు,ధర్మరక్షనయందు మనసు పెట్టినమాతగా నిన్ను "మానసాదేవి " అని   పిలిచేవారము .ఆ పేరు ఇప్పుడు కూడా  సార్ధకమైనది. ఆపదలోవున్న నాగజతిని కాపాడి  నాగపూజ్యవే  కాదు లోకపూజ్యవు  కూడా  అయినావు. ఈ నాటినుండి నిన్ను పూజించేవారు సమస్త  కామ్యములను పొందుతారు .నీ నామములను ఎవరు పఠిస్తారో  వారికి సర్ప భయం  వుండదు  అంటూ  లొకపాలకుడైన ఇంద్రుడు మానసాదేవి నామములను స్తుతించాడు . నాగ ప్రముఖులందరూ    మానసాదేవిని భక్తితో  పూజించారు.

గంగాతీరంలోని "మాయాపురి" దగ్గర వున్న కొండపైన అస్తీకుని ఆశ్రమంలో  మానసాదేవి అందరిచేత పూజలు  అందుకుంటుున్నది. ఈ గుడి హరిద్వార్ దగ్గర వుంది .

Click Here  : List of Stotralu in Telugu

మానసాదేవి ద్వాదశనామ స్తోత్రం, Sri Manasa Devi Dwadasa nama Stotram Telugu Lyrics, devi dasa nama stotram in telugu, manasa devi dwadasa nama stotram in telugu, manasa devi 12 names in telugu, manasa devi stotram in telugu pdf, manasa devi stotram pdf, manasa devi stotram benefits, manasa devi 108 names in english, manasa devi mantra

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

ఎక్కువమంది చదివినవి

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.