Drop Down Menus

వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేకత ఏంటి? ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? Vaikunta Ekadasi Special


వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం.. ప్రత్యేకత ఏంటి?
మార్గశిర మాసం శ్రీమహావిష్ణువుకు అంత్యంత ప్రీతికరమైంది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణుని స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నంగా చేసుకుంది. 
ఇక, పుష్యమాసంలో వచ్చే శుక్షపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఆరాటపడతారు. ఏడాదికి వచ్చే ఇరవైనాలుగు ఏకాదశుల్లో ప్రతిదీ పవిత్రమైందే. కానీ, వీటిలో వైకుంఠ ఏకాదశి మాత్రం లేదు. ఎందుకంటే మిగతా ఏకాదశులు చంద్రమానం ప్రకారం గణిస్తే వాటికి భిన్నంగా సౌరమానం ప్రకారం దీన్ని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు.

ముక్కోటి ఏకాదశి పేరు వెనుక పురాణ కథనాలు
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు వెనుక వేర్వేరు కథలు పురాణాల్లో కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువునకు నెలవైన వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయనం ప్రారంభం ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాల కడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన నారాయణుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. ఇలా మేల్కొన్న స్వామిని దర్శించుకోవడానికి పుష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు.
మురాసుర సంహారం
కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, రుషులను, ప్రజానీకాన్ని పట్టిపీడిస్తూ క్రూరంగా హింసించేవాడు. ముర అకృత్యాలను భరించలేని దేవతలు శ్రీహరికి తమ గోడు చెప్పుకున్నారు. దీంతో, మురాసురుని సంహరించడానికి శ్రీమహావిష్ణువు బయల్దేరతాడు. తనను సంహరించడానికి శ్రీహరి వస్తున్న విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతడిని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు ఓ గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. శ్రీహరిపై దాడికి ఇదే అదనుగా భావించిన మురాసురుడు గుహలోకి ప్రవేశించి స్వామిని వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురను సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు.

వైకుంఠ ఏకాదశి నాడు నమ్మాళ్వార్‌ శివైక్యం
వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే శివైక్యం చెందాడని ఒక విశేషంగా చెప్పుకుంటారు. శ్రీ నమ్మాళ్వారులకు ఈ రోజునే విష్ణులోకం ప్రాప్తించడంతో శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతమాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతోపాటు తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రాత:కాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరచుకుంటుంది. 
దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. ముక్కోటి ఏకాదశి నాడు తెల్లవారుజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం కోసం భక్తులు వేచి ఉంటారు. 

వైకుంఠ ద్వాదశి రోజున శ్రీవారి పుష్కరిణిలో ముక్కోటి తీర్థాలు
వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. మనిషి తలపై సహస్రార (ఉత్తరభాగం) శక్తి ఉత్తేజితమవడం కోసం కూడా ఉత్తరద్వార దర్శనం భక్తులకు శుభప్రదం. లియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. 
ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పునీతులవుతారు. వైకుంఠ ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలూ స్వామి పుష్కరిణిలోకి ప్రవహిస్తాయని భక్తుల విశ్వాసం.
Famous Posts:

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే


గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?


శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, vaikunta ekadasi in 2022, vaikunta ekadasi, vaikunta ekadasi 2022 in telugu, vaikunta ekadasi special, tirumala vaikunta ekadasi, uttaradwara darshnam.

ఇవి కూడా చూడండి
Tirumala info English
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FAQ'S

సెప్టెంబర్ నెల వరకు తిరుమల 300/- టికెట్స్ , సేవ టికెట్స్ , రూమ్స్ , సీనియర్ సిటిజెన్ టికెట్స్ , అంగప్రదక్షిణ టికెట్స్ అన్ని బుక్ అవ్వడం జరిగింది.
తిరుమల శ్రీవారి సేవ కూడా సెప్టెంబర్ నెల వరకు బుక్ అయ్యాయి
అక్టోబర్ నెల టికెట్స్ జులై 18వ తేదీ నుంచి విడుదల చేస్తారు. 

రాజమండ్రి నుంచి కుండలేశ్వరం క్షేత్రానికి రావాలంటే రావులపాలెం మీదుగా అమలాపురం వచ్చి అక్కడ నుంచి ముమ్మడివరం మహిపాల చెరువు కాట్రేనికోన తాసిల్దార్ కార్యాలయం రోడ్డు నుంచి కుండలేశ్వరం చేరుకోవచ్చు

కాకినాడ నుంచి వచ్చే భక్తులు ముమ్మడివరం పోలీస్ స్టేషన్ సెంటర్ నుంచి బాలయోగేశ్వరుల ఆశ్రమం రోడ్డు మీదగా కాట్రేనికోన చేరుకొని అక్కడి నుంచి కుండలేశ్వరం వెళ్ళవచ్చు

కుండలేశ్వరం కాకినాడ నుంచి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది కాట్రేనికోన నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది

మీకు సులువుగా అర్ధం కావాలంటే .. మురమళ్ళ క్షేత్రానికి 4 కిమీ దూరం లో ఉంది

శ్రీశైలం లో ఉచిత స్పర్శ దర్శనం మంగళవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజు 1pm కు ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధర ఒక్కరికి 500/- , ప్రతి రోజు 7:30 am , 12:30 pm , 9pm కు ఉంటుంది. నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు. 
శ్రీశైలం వెబ్ సైట్ : https://www.srisailadevasthanam.org/

తిరుమల ఉచిత దర్శనం కౌంటర్లు :
1) Vishnu Nivasam విష్ణు నివాసం ,
2) Srinivasam శ్రీనివాసం ,
3) Bhudevi Complex భూదేవి కాంప్లెక్స్ ,
శ్రీవారి మెట్టు 
Daily Opening Time 3:30 AM
పూర్తీ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాశి లో ప్రతి రోజు నాలుగు సార్లు హారతి ఇస్తారు . తెల్లవారు జామున 3 గంటలకు మంగళ హారతి ఇస్తారు టికెట్ ధర 500/- , భోగ హారతి ఉదయం 11:15 కి ఇస్తారు టికెట్ ధర 300/-, రాత్రి 7 గంటలకు సప్తఋషి హారతి ఇస్తారు టికెట్ ధర 300/- ,రాత్రి 9 గంటలకు ఇచ్చే హారతిని శృంగార హారతి అని పిలుస్తారు టికెట్ ధర 300/- . నెల రోజుల ముందుగా బుక్ చేసుకోవచ్చు .
వెబ్సైటు : https://shrikashivishwanath.org/

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.