Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

ఇంటి ముందు దిష్టికోసం గుమ్మడికాయ ఎందుకు కట్టాలి? ఎప్పుడు కట్టాలి? What is the significance of hanging a pumpkin in front of the House

ఇంటి ముందు దిష్టికోసం గుమ్మడికాయ ఎందుకు కట్టాలి?ఎప్పుడు కట్టాలి?

ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే వెంటనే సూర్యోదయ సమయంలో ఒక తెల్లగుమ్మడికాయ తీసుకొని దానికి పసుపు,కుంకుమ రాసి దాన్ని ఇంటి ముందు ఉట్టిలో వేలాడదీయండి.

ముందు రోజు సాయంత్రం తెచ్చుకొని తరువాత రోజు సూర్యోదయ సమయంలో దాన్ని ఇంటి ముందు అలంకరించండి. రెండు అగరబత్తీలు వెలిగించి దానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు అంటే ఇంట్లో పూజ చేసుకున్నపుడు దానికి ఒక అగరబత్తిని  వెలిగించి గుచ్చండి.

ఇంటి ముందు గుమ్మడికాయ ఉండటం వలన ఇంట్లోకి వచ్చేటటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని అది రాకుండా అడ్డం పడుతుంది.మన ఇంటి మీద చూపించేటటువంటి చెడు ప్రబావాన్ని అది లాక్కుంటుంది.

ఒకవేళ మీరు తరచుగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుల్లిపోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి.

వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని కట్టాలి. ఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారబంధానికి పైన ఈ యొక్క గుమ్మడికాయను ఖచ్చితంగా కట్టుకోవాలి.

గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష,నరపీడ,నరదృష్టి, నరశాప నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.

పాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టేయాలి.ఇప్పటివరకు అసలు గుమ్మడికాయను కట్టకపోతే వెంటనే కొత్త గుమ్మడికాయను తీసుకువచ్చి కట్టేయండి.  ఇలా బుధ, గురు, ఆదివారం రోజు గానీ కట్టాలి...

Famous Posts:

హనుమ నామస్మరణం సర్వపాప నివారణం


స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత

దిష్టి గుమ్మడికాయ, నరదిష్టి, నరదృష్టి, disti gummadikaya, gummadikaya ela kattali, దిష్టి , Pumpkins

Comments