బియ్యం దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలివే ! Here are the benefits of donating rice

బియ్యం దానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలివే!

గత జన్మలో కర్మల ఫలితం ఈ జన్మలో ఉంటుందని అంటారు. ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుందనేది పండితుల వ్యాఖ్య. దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెబుతున్నాయి.

అయితే, నవగ్రహ దోష నివారణకు దానాలు చేయడం వల్ల సకల శుభాలు చేకూరి కోరిన కోర్కెలు తీరుతాయి. రవి గ్రహ దోషం ఉంటే గోధుమలను దానం చేసి, కెంపు పొదిగిన ఉంగరాన్ని ధరించడం వల్ల రోగాలు, మానసిక బాధలు తొలగి మనశ్శాంతి లభిస్తుంది. గురు గ్రహ శాంతికి శనగలు, చంద్రుడికి బియ్యం, కుజుడికి కందులు, బుధుడిక పెసలు, శుక్రుడికి అలసందలు, రాహువుకి మినుములు, కేతువుకు ఉలవలు, శనికి నువ్వులను దానం చేయాలి. మరణ భయంతో భీతిల్లే వారికి ప్రాణ అభయం ఇవ్వడం, వ్యాధులతో నరకయాతన అనుభవించే రోగులకు వైద్యం చేయడం, పేదలకు ఉచితంగా విద్యను అందించడం, ఆకలితో అల్లాడే వారికి అన్నదానం చేయడం ఈ చతుర్విద దానాలు చేసిన వారి పూర్వ జన్మ పాపాలు నశించి, ఈ జన్మలోనే సుఖిస్తారు.

శక్తి కొలది చేసే ధనసాయం కానీ, వస్తు సహాయం కానీ..'ధర్మం' అంటారు. ఇలా 'ధర్మం' చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునికి చేసిన దానఫలం, పరలోక సుఖాలను అందించడమే కాదు ఉత్తమ జన్మ ప్రాప్తికి ఉపయోగపడుతుంది. 'ధర్మం' చేయడానికి ఎలాంటి పరిధులు లేవు.

తోచింది ఏదైనా ధర్మం చేయవచ్చు. కానీ, 'దానం' చేయడానికి మాత్రం కొన్ని పరిధులు ఉన్నాయి. శాస్త్ర నియమానుసారం దాన యోగ్యమైన వాటిని మాత్రమే దానంగా ఇవ్వాలి. వీటినే 'దశ దానాలు' అంటారు.

దశ దానాలు- ఫలితాలు

దూడతో ఉన్న ఆవు, భూమి, నువ్వులు, బంగారం, ఆవు నెయ్యి, వస్త్రాలు, ధాన్యం, బెల్లం, వెండి, ఉప్పు...ఈ పదింటిని దశ దానాలుగా శాస్త్రాల్లో నిర్ణయించింది. వీటినే మంత్రపూర్వకంగా దానం చేయాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. ఏయే దానం వల్ల ఏయే ఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం.

గోదానం

గోవులో సమస్త లోకాలు ఉంటాయి. పాలిచ్చే ఆవు, దూడతో కలిపి బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురం, రాగి తోక, నూతన వస్త్రాలతో అలంకరించి, పాలు పితికే పాత్రను కలిసి దానం చేస్తే శ్రీమహావిష్ణువు సంతుష్టుడై దాతకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది.

భూదానం

 కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా భూమి శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చి తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు. సుక్షేత్రం, సమస్త సస్యసమృద్ధం అయిన భూమిని దానం చేయడం వల్ల అనంత పుణ్యఫలం లభిస్తుంది.వీరికి శివలోకప్రాప్తిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. 

తిలదానం

తిలలు అంటే నువ్వులు. శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించి విష్ణులోకం ప్రాప్తిస్తుంది 

హిరణ్య (సువర్ణ) దానం

 బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై అగ్నిలోక ప్రాప్తిస్తాడు.

నెయ్యి దానం

ఆజ్యం అంటే ఆవు నెయ్యి. ఇది కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. దీనిని యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అంతటి పవిత్రమైన ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యఙ్ఞఫలం లభిస్తుంది.

ఈ దానంతో ఇంద్రుడు సంప్రీతుడై, దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

వస్త్ర దానం

చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం. కేవలం అలంకారినికే కాకుండా మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వల్ల సర్వ దేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు.

ధాన్య దానం

 జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యం. జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం. అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయడం వల్ల సకల దిక్పాలకులు సంతృప్తి చెంది, ఇహలోకంలో సకలసౌఖ్యాలను అనుగ్రహించి, పరమందు దిక్పాలకలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు. 

గుడ దానం

రుచులలో మధురమైనది బెల్లం.

ఈ బెల్లం చెరుకు నుంచి ఉత్పత్తి అవుతుంది. బెల్లం అంటే వినాయకుడు, శ్రీమహాలక్ష్మీకి మహా ప్రీతి. ఈ దానంతో లక్ష్మీ, గణపతులు సంతుష్టులై దాతకు అఖండ విజయాలను, అనంత సంపదలను అనుగ్రహిస్తారు.

రజత దానం

అగ్నిదేవుని కన్నీటి నుంచి ఉత్పన్నమైనది ఈ వెండి.ఈ దానంతో శివకేశవులు సంతృప్తి చెందుతారు దాతకు సర్వసంపదలు వంశాభివృద్ది అనుగ్రహిస్తారు.

లవణ దానం

రుచులలో ఉత్తమమైనది ఉప్పు, ఈ దానంతో మృత్యుదేవత సంతృప్తి చెందుతుంది ఆయుష్షు బలం సంతోషాన్ని అనుగ్రహిస్తారు, వీటిని గ్రహణ సమయంలో చేస్తే దీనికి పడింతల ఫలితం ఉంటుంది

అంతేకాదు దానం భక్తి శ్రద్ధలతో చేయాలి గాని, దాన గ్రహీతకు ఎదో ఉపకారం చేస్తున్నామనే భావనతో గాని నలుగురిలో గొప్పగా చెప్పుకునేటందుకు గాని దానం చేయరాదు, ఒకవేళ అలా చేసినప్పుడు ఎలాంటి ఫలితం దక్కదు.

Famous Posts:

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు


ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే


అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం


> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి


100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం


> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం


అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం


ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

donating rice, dharma sandehalu telugu pdf, dharma sandehalu questions, dharma sandehalu online,

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS