యువతులు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు చేయవచ్చా? లేదా ? Can young women worship while pregnant? Or not?

సహజంగానే స్త్రీలకు భక్తి భావం ఎక్కువగా వుంటుంది. పూజ కోసం పూలు కోయడం … వాటిని మాలగాకట్టి దైవానికి సమర్పించడంలో వాళ్లు ఎంతో సంతోషాన్ని … సంతృప్తిని పొందుతుంటారు. పూజలు … అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ వుంటారు. శ్రావణ … కార్తీక మాసాల్లో వాళ్లు మరింత తీరికలేకుండా వుంటారు.

అలాంటి యువతులు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు చేయవచ్చా? … లేదా ? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంబించాలనీ, కొబ్బరికాయను మాత్రం కొట్ట కూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ, పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదని అంటోంది.

Also Read : భార్య గర్బవతిగా ఉన్నప్పుడు భర్త అస్సలు చేయకూడని పనులు

కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం … కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం … కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.

పూజల పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి … అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది. ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది … అది శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది కనుక ధ్యానం చేయడమే మంచిదని పండితులు కూడా చెబుతుంటారు.

Famous Posts:

> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా? 

> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 

> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

> శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు

> శివ గుణాలు లోకానికి సందేశాలు

> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?

> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?

women worship while pregnant? … Or not?, hindu traditions during pregnancy, spiritual rituals for pregnancy, religious views on pregnancy, preganty ladies pooja

Post a Comment

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS