శని భగవానుని పుట్టినరోజు శని జన్మ వృత్తాంతం. - శని భగవానుని పుట్టినరోజున ఆచరించవలసినవి | Shani Jayanti significance

శని భగవానుని పుట్టినరోజు శని జన్మ వృత్తాంతం...

శని భగవానుని పుట్టినరోజున ఆచరించవలసినవి.

నేడు వైశాఖ బహుళ అమావాస్య శనైశ్చరుని జన్మతిథి అంటే శని భగవంతుని పుట్టినరోజు, వాడుక భాషలో శని జయంతి అంటుంటారు,

అలా జయంతి అనకూడదు కానీ ఇలా అనకపోతే చాలా మందికి అర్థం కావడం లేదు. శని భగవంతుని జన్మతిథి నాడు ఆయన్ను పూజించడం ఎంతో మంచిది. 

ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని దోషాలు, శని వలన బాధ పడేవారికి ఇది ఒక చక్కని అవకాశం.శని నవ గ్రహాలలో అత్యంత సున్నిత మనస్కుడు.

పరమ భాగవతోత్తముడు. జీవుల కర్మఫలాన్ని అనుసరించి వారికి ఫలాన్ని ప్రాప్తింప చేస్తాడు.

శని భగవంతుని ప్రసన్నం చేసుకుంటే ఎటువంటి బాధలు, భయాలు ఉండవు. శని భగవంతుని ప్రసన్నం చేసుకోవడం తేలికైన విషయమే.

ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఆయనకు ఇష్టమైనవి చేయాలి. అవేమిటో తెలుసుకుందాం.

శనైశ్చరుని జననం (వైశాఖ బహుళ అమావాస్య) శని దేవుని కథ ఏమిటి? 

నవగ్రహాలకు రారాజు, సకల జీవులకు ప్రత్యక్షదైవం సూర్యుడుభగవాను.

ఆయన సతీమణి సంధ్యాదేవి. వారికిరువురు సంతానం. యముడు, యమునా... వారే యమధర్మరాజు, యమునా నది. సూర్యుని వేడికి తాళలేని సంధ్యాదేవి తన నీడ నుంచి తనలాంటి స్ర్తీని పుట్టించి

ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర వుండమని కొంతకాలం పుట్టింటికి వెళ్ళి అక్కడ తండ్రైన విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒకచోట సూర్యుని గురించి తపస్సు చేయసాగెను.

అయితే ఆమె నీడ నుంచి వచ్చిన ఛాయకి శని, తపతి అను పిల్లలు పుట్టటం వలన ఆమె యమధర్మరాజుని, యమునను చిన్నచూపు చూడటం మొదలుపెట్టాడు. 

తన ప్రేమాను రాగాన్ని అంతా తన పిల్లలపై చూపించసాగెను.

ఆటలాడుకొను సమయంలో యముడు, శని మధ్య అభిప్రాయబేధాలొచ్చి యముడు శని కాలు విరిచాడు.

దానికి ఛాయదేవి కోపించి యముని శపించింది. యమునని నది కమ్మని శపించగా, యముడు కూడా తపతిని తిరిగి నది కమ్మని శపించాడు. 

అంతలో అక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్యదృషితో గ్రహించి వారికి కలిగిన శాపములకు చింతించి 

యమున కృష్ణ సాన్నిధ్యమున పవిత్రత పొందగలదని, లోకానికి ఉపకారిగా వుండమని ఎవరైనా నీ నదిని స్పర్శించినా, స్నానం చేసినా వారికి సర్వపాపాలు హరిస్తాయని చెప్పాడు.

అలాగే యమునికి కూడా శాంతి వాక్యాలతో ఓదార్చాడు. యముడిని యమలోకానికి, పట్టాభిషేకము చేయించాడు. 

ఆకాశంలో ఛాయను కాలుతో తన్నబోయిన యమధర్మరాజుని ఆమె ఆగ్రహంతో నీ కాలు మంటలలో కాలుతుంది అని శపించగా, 

ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై యుండును అని, రెండో కాలు ఎల్లవేళలా నీటిలో వుండునని, ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండి పోతుందని, 

నా వరం వల్ల నీ కాలు నీటిలో వుంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం అని తండ్రి చెప్పెను. అందుకే యమునికి సమవర్తి అనే పేరుంది.

(ధర్మాధర్మాలను, నీళ్లు, నిప్పును ఒకేలా చూస్తాడు కనుక). శనిని నవగ్రహాలలో ఒకనిగా చేసి జ్యేష్ఠాదేవికిచ్చి వివాహం జరిపించెను.

అయితే త్రిమూర్తులు శనికి కొన్ని అధిపత్యాలు ఇచ్చారు. ఆయువుకి అధిపతిగా, జనులపై ఆతని ప్రభావం వుండేట్లుగా అన్న మాట.

శివుడు అయితే శని, యముని ఒకటిగా చేసెను. అంటే యముడే శని, శనియే యముడు

పూర్వం సూర్యభగవానుడికి , ఛాయాదేవికి శనైశ్చరుడు వైశాఖ మాసం అమావాస్య నాడు జన్మించాడు. 

అందుకే ఈ తిథి శనైశ్చర జన్మ తిథి అని పిలవబడుతుంది. పంచాంగములో తెలియక జయంతి అంటున్నారు. కానీ అలా కాకుండా జన్మతిథి లేదా పుట్టినరోజు అనండి. 

ఈ రోజున శనైశ్చరుడు పుట్టాడు. ఆ మహానుభావుడు బలమైన గ్రహముగా మారాడు. గ్రహాలకు రాజైన సూర్యభగవానుని పుత్రుడు.

ఆయన అనుగ్రహం మనము పొందాలి కదా, కాబట్టి ఆయనకు ఉపచారాలు చేయాలి లేకపోతే అపచారం చేసినట్లు అవుతుంది. 

కనుక ఈ పితృతర్పణాది కార్యక్రమాలు చేసుకున్న తరువాత కానీ, లేదా లేచి సంధ్యావందనాదులు చేసుకున్న తర్వాత కానీ నవగ్రహాలయానికి వెళ్ళండి,

అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనైశ్చరుడికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. అర్చన అంటే వీలుంటే ఆయనకు ఇష్టమైన నువ్వులను అభిషేకానికి ఇవ్వండి 

లేదంటే ఆ ఆలయంలో ఎక్కడైనా ఒక పక్కన కూర్చుని (శనైశ్చరుడికి ఎదురుగుండా కూర్చో కూడదు కాబట్టి ఆయనకు అటు పక్క గాని ఇటు పక్క గాని కూర్చోండి) అనగా కోణంలో కూర్చోవాలి. 

శ్లో||

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||

అనే శ్లోకాన్ని చదవండి. 

వైశాఖ మాసం అమావాస్య నాడు హనుమంతుడు సూర్యుడ్ని పట్టుకోడానికి ఆకాశానికి ఎగిరాడు కాబట్టి హనుమంతుని స్త్రోత్రము చేయండి,

ఎప్పుడూ అమావాస్య నాడు తలంటి మాత్రం పోసుకోకూడదు. ఈ పూట అభ్యంగనం పనికిరాదు. కేవలం శిరస్నానం చేస్తే చాలు. 

శని మహత్యం

స్వయంగా శని భగవానుడే ఉపదేశించిన

మహాశక్తివంతమైన శని శాంతి స్తోత్రాలు 

ఈ స్తోత్రాన్ని పఠిస్తే శని బాధ కలగదు. ఈ స్తోత్రం వెనుక ఉన్న పురాణ గాథ ఇలా ఉన్నది.

నల మహారాజు రాజ్యభ్రష్టుడై బాధపడుతున్నప్పుడు అతనికి శనిదేవుడు కలలో కనిపించి ఈ స్తోత్రం ఉపదేశించాడు. 

ఈ మంత్రాన్ని పఠించిన నలమహారాజుకు తిరిగి పూర్వ వైభవం కలిగింది.

క్రోడం నీలాంజన ప్రఖ్యం నీలవర్ణసమస్రజమ్ 

ఛాయామార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరమ్

నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార

వర్ణాంజనమేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదశ్చ

ఫలప్రదో మే భవ సూర్యపుత్రం నమోస్తు ప్రేతరాజాయ కృష్ణదేహాయ వై నమః

 శనైశ్చరాయ కౄరాయ శుద్ధబుద్ధి ప్రదాయనే య ఏభిర్నామభి: స్తౌతి తస్య తుష్టా భవామ్యహమ్ మదీయం తు భయం తస్య స్వప్నేపిన

భవిష్యతి

నవగ్రహాల్లో శని దోషం ఎక్కువ అపకారం కలిగిస్తుంది. 

శని దోషం నుండి బయటపడేందుకు గురు చరిత్రలో శ్రీగురుడు చెప్పిన విధంగా  అశ్వత్థ వృక్షమును నకు ప్రదక్షిణ చేస్తూ

" కొణస్థ పింగళో బభ్రుః కృష్ణ రౌద్రాంతకో యమఃశౌరీ శనైశ్చరో మందః పిప్పలాదేవ సంస్తుత'ః' అనే శ్లోకాన్ని 11 సార్లు జపించి, తర్వాత కింది శ్లోకాన్ని 11 సార్లు జపించాలి.

శన్యారిష్టే తు సంప్రాప్తే

శనిపూజాంచ కారయేత్

శనిధ్యానం ప్రవక్ష్యామి

ప్రాణి పీడోపశాంతయే.

 ఓం శనైశ్చరాయ నమః.

Famous Posts:

సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఇన్ని లాభాలు

ఈ రాశులవారు జీవితంలో డబ్బు హోదాలతో ఉన్నత స్థితిలో ఉంటారు

ఈ ఉంగరం ధరిస్తే అన్ని శుభాలే

అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

Shani Jayanti significance, shani dev birthday 2022, shani jayanti 2022 telugu, shani jayanti, shani dev story, shani dev vahan, lord shani wife, shani dev mantra, shani jayanti 2022 drik panchang

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS