సూర్యుని ఎందుకు ఆరాధించాలి...!!
భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు.
జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాశాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు.
అందుకే ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియ మానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే.
సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు.
ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.
ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచ మంతటా ఉంది.
జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సూర్యుడే కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సూర్యుడు దక్షినాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం.
ఒకటి సంక్రాంతి, రెండి వది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది.
నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన.
పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు.
విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం.
ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు.
సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనడానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మరాజు సూర్యుని ప్రార్థిస్తాడు.
అప్పుడు సూర్యుడ ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు.
ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలనుఅందిస్తుంది.
అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు.
ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.వెలుగే జ్ఞానం.
విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం.
ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలోనిష్ణాతుడు.
సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు.
బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం.
ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి.
జీవుల పుట్టుక పోషణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి.
మన కర్మలను మనస్సు నియంత్రిస్తే.
ఆ మనుస్సును నియంత్రించేవాడుచంద్రుడు.
చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడుసూర్యుడు.
ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు.
సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు.సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు.
శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు.
పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది.
అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి.
మన శరీరంలో ఉన్న ఆరుచక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది.
శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి.
శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది.
వెలుగు అపరిమిత మైనది.
కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది.
ఋషూలు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు.
ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు.
పంచ భూతాలతో కూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు.
సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది.
శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది.
మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకో వడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది.
అంటే భోగశరీరం యోగశరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.
సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు.
నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది.
జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది.
కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది.
ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయోగిస్తారు.
సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి.
సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది.
మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి.
అందుకే మనలోవలేఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియకుండా చేసేదే మాయ.
‘నేను ఎవరు?’
అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది.
వెలుపలిసూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు.
అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి.
ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని తెలుసుకుంటాం...
"ఓం హ్రీం సూర్యాయ నమః"
ఓం భాస్కరాయ విద్మహే | మహద్యుతికరాయ | ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ||..
Famous Posts:
> అదృష్టాన్ని తెచ్చి పెట్టే నవబ్రహ్మ ఆలయం
> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి
> 100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం
> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం
> అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం
> ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే
> గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?
> శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి?
surya bhagavan pooja, surya stotrams telugu, sun god, sun worship religion, sun worship in hinduism, sun worship symbols