అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి? What are the pujas and vratas recited by the mother herself?

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి? ఈమాసాలలో అమ్మవారికి ఇలా పూజచేస్తే కష్టాలు తొలగిపోతాయీ.

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి?

ప్రతి రోజు సాయంత్రం / ప్రదోష కాలం లో అమ్మవారు , శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అట. ఈ సమయములో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇష్ఠం అట. అవి ఆర్ద్రనతకరి అని , అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణ వచనం. ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతికరం.

ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం , వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది. ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీడలు ఉండవు , రోగ నివారణ , అప్పులు , రుణాలు తీరిపోతాయి అని , కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికర్మయిన రోజు ఈ భౌమవారం (మంగళవారం) అని చెపుతారు. ఎవర్ని అయితే అమ్మవారు కరుణిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందట. పిలవని పేరంటంగా ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెపుతారు.

కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి కృపకి పాత్రులు కావచ్చు.

నవరాత్రి ద్వయం అంటే శరన్నవరాత్రులు ( దసరా నవరాత్రి ) , వసంత నవరాత్రులు ( ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది).

అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.

వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇష్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితాంబికా , శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే , స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు. శ్రీ రాముడికి పూజ చేసిన అమ్మవారికి పూజ చేసినట్టే. అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.

అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపం లో అనుగ్రహిస్తుంది ?

కాళి, చండి , బాల, లలిత , దుర్గ అనేక రూపాలలో ఉండి మనని నడిపిస్తుంది , కరుణిస్తుంది అని...

ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది . మాత్రు రూపం , శాంతి రూపం , ఆకలి రూపం లో , జాతి రూపం లో , చైతన్య స్వరూపం , నిద్ర రూపం లో , దయా రూపం లో , బుద్ది రూపం లో కూడా అమ్మవారు ఉంది మనని నడిపిస్తుంది.

అమ్మవారిని ఏమి కోరుకోవాలి?

కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కోరతాం. కానీ ఏది కోరిన మళ్ళీ దాని వలన కలిగే సుఖం అల్పం, క్షణికం . అది తీరగానే మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది.

మరి ఏమి కోరాలి ? 

శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు , నాతో ఉండు" మోక్షం వద్దు , విద్య వద్దు , సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు , నాతో ఉండాలి. ఎప్పుడూ నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి , ఎప్పుడు కరుణిస్తూ ఉండాలి , నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి అని  కోరుకోవాలి అంటారు.

Famous Posts:

> కోరిన కోర్కెలు వెంటనే తీర్చే కురుడుమలై గణపతి

100 అడుగుల పొడవైన సూర్యభగవానుడి ఆలయం

> మీకొక విషయం తెలుసా ? రావణ_ఆలయం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం

ఏలినాటి శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

గోవుతో గృహప్రవేశం ఎందుకు చేయిస్తారో తెలుసా?

శుక్రవారం ఈ పనులు తప్పకుండ చేయాలి

Ammavari navratri poojalu, Ammavari Pooja Vidhanam, అమ్మవారికి, Navratri, durga puja essay, duga mata, durga devi, ammavaru, goddess, pooja vidhanam

Post a Comment

Previous Post Next Post

Facebook

CLOSE ADS
CLOSE ADS