శ్రీశైల క్షేత్రాన్ని ఏ మాసంలో దర్శిస్తే ఏ ఫలితం లభిస్తుంది. | Visiting Srisaila Kshetra in any month will give any result
శ్రీశైలక్షేత్ర దర్శన ఫలం
శ్రీశైల మహాక్షేత్రం మహిమాన్వితమైనది. ఈ క్షేత్రం యొక్క దివ్యశక్తి అమోఘం. భౌతిక ఇంద్రియాలతో మనం చూడలేని దివ్యత్వం శ్రీశైలములో అణువణువునా వ్యాపించి వుంది. ఎన్నో జన్మల పుణ్యఫలితం వలన మాత్రమే శ్రీశైల దర్శనభాగ్యం కలుగుతుందని స్కాందపురాణములోని శ్రీశైలఖండం చెబుతోంది.
ఈ క్షేత్రాన్ని ఏ మాసములో దర్శిస్తే ఏ ఫలితం లభిస్తుందన్న విషయాన్ని శ్రీపర్వతపురాణం యిలా చెప్పింది.
1. చైత్రమాసం:
సకల శుభాలు కలుగుతాయి. బహుయజ్ఞాలు ఆచరించిన ఫలం లభిస్తుంది. ఆయుషు పెరుగుతుంది.
2.వైశాఖ మాసం :
కష్టాలు తీరుతాయి. లక్షగోవులను దానం చేసినంత ఫలం లభిస్తుంది.
3. జ్యేష్ఠమాసం :
కోరికలు నెరవేరుతాయి. లగోవులను బంగారంతో అలంకరించి దానం చేసినంత ఫలం లభిస్తుంది.
4. ఆషాఢమాసం :
కోటిగోవులను శివాలయానికి దానమిచ్చినంత ఫలం లభిస్తుంది. బంగారు రాసులను దానం చేసిన ఫలం వస్తుంది.
5.శ్రావణమాసం :
యోజనం పొలమును పంటతో సహా పండితునికి దానం చేసినంత ఫలితం లభిస్తుంది.
6. భాద్రపదమాసం:
పండితులకు కోటి కపిల ఆవులను దానం చేసిన ఫలం లభిస్తుంది.
7. ఆశ్వయుజమాసం :
పాపాలన్ని హరించబడతాయి, అప్లైశ్వర్యాలు లభిస్తాయి. వేయి కన్యాదానాలు చేసిన ఫలం లభిస్తుంది.
8. కార్తికమాసం :
యజ్ఞాలలో ఎంతో గొప్పదిగా చెప్పబడే వేయి ఉంట వాజపేయ యాగాలు చేసినంత ఫలం లభిస్తుంది.
9. మార్గశిరమాసం :
పాపాలు తొలగిపోతాయి. పౌండరీకయాగం చేసినంత ఫలం లభిస్తుంది.
10. పుష్యమాసం :
పాపాలు హరించబడి మోక్షం లభిస్తుంది. మహర అతిరాత్రయాగం చేసినంత ఫలితం కలుగుతుంది.
11. మాఘమాసం :
శ్రేయస్సు కలుగుతుంది. భక్తులకు రాజసూయయాగం చేసిన ఫలం లభిస్తుంది.
12. ఫాల్గుణమాసం :
తరగని సంపదలు, ఆయుధా కలుగుతాయి. సౌతామణి యాగఫలం, భూషితుడై ఎనలేని పుణ్యాన్ని పొందవచ్చు.
Famous Posts:
> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ?
> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.
> శివ గుణాలు లోకానికి సందేశాలు
> భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?
> కూతురా కోడలా ఎవరు ప్రధానం...?
శ్రీశైల క్షేత్రం, srisailam temple timings, srisailam temple online booking, srisailam temple photos, srisailam temple accommodation, srisailam temple timings today, srisailam temple phone number, srisailam temple website, srisailam temple timings online ticket booking, srisailam,
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment