అనారోగ్య నివారణకు శని దేవుని శాంతి మంత్రం - Saturn is God's peace mantra for the prevention of illness
అనారోగ్య నివారణకు
శని దేవుని శాంతి మంత్రం
శని వలన కలిగే ఒంటి నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి కింద మంత్రం చదువుకోవాలి.
ఏల్నాటిశని,అష్టమ శని,కంటక శని,శని మహార్దశ, అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమందికి ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు నడుము నుండి క్రింది పాదాల వరకు నువ్వుల నూనె పట్టించి శని ఉపశమన మంత్రాన్ని పఠిస్తూ రెండు గంటల తరువాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
నువ్వుల నూనె లో కాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృడంగా ఉండేలా చేస్తాయి.
నువ్వుల నూనెతో ప్రతి రోజూ శరీరానికి మర్దన చేస్తే చర్మానికి నిగారింపే కాక చిన్నతనంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను కూడా అరి కట్టవచ్చు. అలాగే, చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు మాలిష్ చేయడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటు మేధాశక్తి ఎక్కువవుతుంది. పిల్లలు పక్క తడపకుండా ఉండడానికి కూడా నువ్వుల నూనె పని చేస్తుంది.
ఏల్నాటిశని, అష్టమ శని, కంటక శని, శని మహార్దశ, అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమందికి బద్దకం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు ప్రతిరోజు దేవాలయ ప్రదక్షిణలు గాని, వాకింగ్ గాని మేడిటేషన్ గాని చేస్తే శని తృప్తి పడి మన నిత్య కార్యక్రమాలు సవ్యంగా జరిగేటట్టు చేస్తాడు.
శనైశ్చరో మహాభాగో! సర్వారిష్ట నివారక: !
కాకధ్వజో రుద్రరూపో! కలికల్మష నాశక:!!
ధీరో గంభీరో !ధృడసంకల్ప కారక: !
దేవదేవో దుర్నిరీక్షో! దేవాసురవందిత:!!
కరాళో కంటకో క్రుద్ధో! కష్టనష్టకారక: !
పవిత్రో ప్రలోభో !ప్రారబ్ధకర్మ ఫలప్రద:!!
నిర్గుణో నిత్యతృత్పో! నిజతేజ ప్రకాశిత: !
నిరుపమో నిష్కళంకో! నీలాంజన సమప్రభ:!!
మందో మహావీరో! మదమాత్సర్య నాశక: !
ప్రసన్నో ప్రమోదో !శరణాగత వత్సల:!!
శనైశ్చర పంచకమిదం య: పఠేత్సతం నర:
సర్వకష్ట వినిర్ముక్తో శ్రీ శనైశ్చర కరుణాం లభేత్!!
Famous Posts:
> హనుమ నామస్మరణం సర్వపాప నివారణం
> స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?
> సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము
> శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత
saneeswara stotram in telugu,Shani Dev Maha Mantra, Shani Stotram, శనీశ్వర మంత్రం,
Comments
Post a Comment