గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం. | Bathing procedure that removes planetary bugs

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం.

సూర్య దోషం తొలగడానికి : ఆదివారం

మనం స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు గాని ఎర్రటి పూలు గాని ఆ బకెట్లో కొంచెం వేసి స్నానం చేసుకుంటే సూర్య దోషం తగ్గుతుంది.

చంద్ర దోషం తొలగడానికి: సోమవారం

నీటిలో కొంచెం పాలు కానీ లేక పెరుగు గాని వేసుకుని స్నానం చేస్తే చంద్ర దోషం తగ్గుతుంది.

కుజదోషం తొలగడానికి: మంగళవారం

నీటిలో బిల్వ ఆకులను గాని బిల్వ ఆకు పొడిని గాని వేసి స్నానం చేస్తే కుజదోషం తగ్గుతుంది.

బుదదోషం తొలగడానికి: బుధవారం

నీటిలో సముద్రపు నీరు గానీ గంగా నది నీరు గాని లేక రాళ్ల ఉప్పు గాని వేసి స్నానం చేస్తే బుధ దోషం తగ్గుతుంది.

గురు దోషం తొలగడానికి: గురువారం

నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని మనం స్నానం చేసే నీటిలో పోసి స్నానం చేస్తే గురు దోషం తగ్గుతుంది.

శుక్ర దోషం తొలగడానికి: శుక్రవారం

యాలకులను నీటిలో ఉడికించి ఆ ఉడికించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శుక్ర దోషం తగ్గుతుంది.

శని దోషం తొలగడానికి: శనివారం

నీటిలో నల్ల నువ్వులను నేటి స్నానం చేస్తే శని దోషం తగ్గుతుంది.

రాహు దోషం తొలగడానికి: శనివారం

(మహి షాసి, అనేది సామ్రాణి ఇది నాటు మందు షాపులో దొరుకుతుంది )ఈ మహిషా సి పొడిచేసి నీటిలో ఉడకబెట్టి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే రాహు దోషం తగ్గుతుంది.

కేతు దోషం తొలగడానికి: మంగళవారం

గరిక (గడ్డి) నీ ఉడకబెట్టి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతు గ్రహ దోషం తగ్గుతుంది.

పైన చెప్పిన విధంగా ఆయా రోజుల్లో స్నానాన్ని ఆచరించి గ్రహ దోషాలను తగ్గించుకోవాలి.

Famous Posts:

> కొత్త కోడలు రాగానే సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?


> మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?

 

> భర్త భార్య మాట వినాలంటే ఏమి చేయాలి ? 


> వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.


> శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


> శివ గుణాలు లోకానికి సందేశాలు

Nine Planets, Navagraha, navagraha remedies in telugu pdf, navagraha dosha remedies in telugu, navagraha dosha nivaran mantra in telugu, sarva dosha nivarana mantra, నవగ్రహాలు పరిహారాలు

Post a Comment

Previous Post Next Post
CLOSE ADS
CLOSE ADS