Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . .** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు .** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారురాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

శ్రీ వెంకటేశ్వరునికి గోవింద అనే నామం ఎందుకొచ్చిందో తెలుసా..? Do you know why Sri Venkateswara got the name Govinda?

శ్రీ వెంకటేశ్వరునికి గోవింద అనే నామం ఎందుకొచ్చిందో తెలుసా..?

నామ విశిష్టత ఏంటో తెలుసా..?

గోవింద అనగానే ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా అనే మాట ప్రతీ తెలుగువాడికి వెంటనే మదిలో మెదులుతుంది. ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురుచూసే సమయంలో భక్తుల గోవిందనామస్మరణతోనే ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అసలు గోవిందా అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకు అలా అంటారో తెలుసుకోవాలంటే, గోకులంనాటి కథ తెలుసుకోవాలి.

ఇంద్రుడు దేవతల అధిపతి,

ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం చేయ తలపెట్టారు.

గోకులంలోని ప్రజలంతా

గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ప్రతి యేడూ వర్షఋతువుకోసం గోకులంలో గోపాలురు ఇంద్రుడికి యజ్ఞయాగాదులు చేసుకుంటూ పిండివంటలు చేసి ఇంద్రుడికి అర్పించే పద్ధతి ఉండేది.

అయితే కృష్ణుడి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి,

అయితే కృష్ణుడి ఇదేంటో తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం.

ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ,

అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా, ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. అయితే శ్రీకృష్ణుడు మాత్రం ఒప్పుకోక ప్రకృతికి నిలయమైన పర్వతములు దైవనిర్ణితములని, పర్వతములకు తాము చేయు ప్రార్థనలతో పిండివంటలు అర్పించవలెనని చెప్పి వారితో ఆ పద్ధతే చేయించాడు.

ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అయ్యారు

ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురి అయ్యారు... తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు.ఏడు రోజులు ఏకధాటిగా తెరిపిలేకుండా గోకులంలో వర్షము, గాలితో ప్రళయము సృష్టిస్తాడు. గోపాలురను, గోకులాన్ని భయకంపితులను చేశాడు. గోకులమంతా శ్రీకృష్ణుడికి మొరపెట్టుకున్నాయి, ఈ విపత్తునుంచి కాపాడమని, విన్నపాలు చేసుకున్నారు.

గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోకులాన్నంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు.

చిన్నికృష్ణుడు ఏడేండ్ల ప్రాయముగలవాడు వారికి ధైర్యం చెప్పి గోవర్థన పర్వతాన్ని ఎత్తి గోకులాన్నంతా కాపాడి ఇంద్రుడికి గర్వభంగం చేశాడు. అప్పుడు బ్రహ్మ, ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుడికి క్షమాపణ చెబుతూ పాదాలు కడిగినారు. అప్పటినుండి స్వామి పాదాలు బ్రహ్మకడిగిన పాదములని భక్తులచేత కీర్తించబడినాయి.

గోవులను, గోకులాన్ని కాపాడినప్పుడు పిల్చిన నామం గోవిందా.. గోవిందా నామం.

ఈ ఏడు రోజులు గోవర్థన పర్వతాన్ని తన చిటికెన వ్రేలుపై నిలబెట్టి గోపాలురని, గోవులను, గోకులాన్ని కాపాడినప్పుడు పిల్చిన నామం గోవిందా.. గోవిందా నామం.

స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని,

స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకుని, క్షమాపణలు వేడుకునేందుకు అదే సమయంలో కృష్ణుని వద్దకు గోమాత అయిన కామధేనువు కూడా వస్తుంది. తన బిడ్డలైన గోవులన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా,ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది.

ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు

ఆ దృశ్యాన్ని చూసి పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరావతాన్ని కూడా గంగాజలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు. అటుపై ‘నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడిని (అధిపతిని).

అలా కృష్ణుడు ‘గోవిందుడు’ అన్న నామంతో పూజలందుకుంటున్నాడు.

కానీ మీరు గోవులన్నింటికీ కూడా అధిపతి. అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలవబడతారు,' అని పేర్కొటాడు. అప్పటి నుంచి అలా కృష్ణుడు ‘గోవిందుడు' అన్న నామంతో పూజలందుకుంటున్నాడు.

జలములనుండి భూమిని పైకి తీసుకొని వచ్చి సృష్టికి కారణమైనవాడు

జలములనుండి భూమిని పైకి తీసుకొని వచ్చి సృష్టికి కారణమైనవాడు కనుక గోవింద నామం ఇవ్వబడినది, పిలువబడినది. గోవులంటే ప్రీతి, ప్రేమ. వాటి కాపరిగా ఉండటం చేత గోవిందా గోవిందా అని పిలువబడ్డాడు. ఈ నామమెంతో మధురం, సర్వపాపహరం.

భూమికి వసుంధర అని పేరు వచ్చింది.

మనం ప్రతి వస్తువు భూమి నుండే పొందుతాం కనుక భూమికి వసుంధర అని పేరు వచ్చింది. భూమిని కాపాడినవాడు, పోషించువాడు కనుక వసుంధరుడు గోవిందా.. గోవిందా అని పిలువబడ్డాడు. ఆవులలో సమస్త దేవతలు వచ్చి ఉంటారు. వాటిని కాచేవాడుగా, పాలించేవాడిగా ఉండటంవల్ల గోవింద నామం వచ్చింది.

గోసేవ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుందంటారు.

గోసేవ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుందంటారు. గోదానంవల్ల పుణ్యం దక్కుతుంది. గోదానంవల్ల అక్రూరుడు పుట్టాడు. అక్రూరుడనగా క్రూరత్వం లేనివాడు. శుద్ధ బ్రాహ్మణుడు. శమంతకమణిని ఎవరూ తీసుకోలేనపుడు అక్రూరుడు ఆ మణిని ధరించి రాజ్యపాలన చేసిన ధర్మాత్ముడు.

‘గో’ అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి.

‘గో' అనే పదానికి ఒక్క అర్థం కాదు అనేక అర్థాలున్నాయి. ఏ ఒక్క నామం ద్వారానైనా మనం ఈశ్వరుణ్ణి చేరవచ్చు. గోపూజ గోవిందపూజతో సమానం. గోవిందనామం సర్వపాపహరం.

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ

venkateswaraswamy, govinda, ttd, tirumala, tirupati, vishnu, om namo venkatesa

Comments

Today Tirumala Darshan Information:

తిరుమల శ్రీవారి దర్శనానికి అలిపిరి నడక మార్గంలో నడచివెళ్లే భక్తులకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు . భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలి. అలాకాకుండా మరే మార్గం ద్వారా వెళ్లినా దివ్యదర్శనం టోకెన్ ద్వారా టైమ్ స్లాట్ దర్శనం పొందలేరు. కాగా, శ్రీవారి మెట్టు మార్గం లో వెళ్లే భక్తులకు యధాప్రకారం దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇస్తారు. Tirumala Free Darshan Tickets Counters SSD TOKENS AT SRINIVASAM, VISHNU NIVASAM, BHUDEVI COMPLEX స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్ల జారీ కేంద్రాలు a)ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం b)రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసం c)రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు జారీ చేస్తారు