Today Tirumala Darshan Information:

నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం. టెంపుల్స్ గైడ్ కాల్ సెంటర్. కాల్ సెంటర్ వారికి జీతాలు ఇవ్వాలి కాబట్టి టెంపుల్స్ గైడ్ సభ్యత్వం ఉన్న వారికి మాత్రమే కాల్ చేసే అవకాశం ఉంటుంది. జీవితకాల సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 8247325819 ఈ నంబర్ కు gpay లేదా ఫోన్ పే చేయగలరు.

Temples News

Welcome to Hindu Temples Guide ***హిందూ టెంపుల్స్ గైడ్ కు స్వాగతం . ***అరుణాచలంలో కార్తీక మహా దీపం డిసెంబర్ 6న గురువారం సాయంత్రం 4 గంటలకు వెలిగిస్తారు.**చార్ ధామ్ యాత్ర 2022 సమాచారం : అక్టోబర్ 26న గంగోత్రి , 27న కేదార్నాథ్ మరియు గంగోత్రి ఆలయాలు మూసివేస్తారు . చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేస్తారు మరల 6 నెలల తరువాత అక్షయ తృతీయ నాడు చార్ ధామ్ యాత్ర ప్రారంభం అవుతుంది. ** కాణిపాకం ఆలయ నిర్మాణం పూర్తీ అయింది దర్శనాలు జరుగుతున్నాయి.** శ్రీశైలం లో స్పర్శ దర్శనాలు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు , మధ్యాహ్నం 12 గంటలకు , రాత్రి 9 గంటలకు ఉంటాయి టికెట్ ధర 500 రూపాయలు ఆన్లైన్ లో లేదా నేరుగా ఆలయం దగ్గర కూడా బుక్ చేస్కోవచ్చు . ** అరుణాచలంలో కార్తీక దీపోత్సవం 10 రోజులు జరుగుతుంది నవంబర్ 27వ తేదీ నుంచి డిసెంబర్ 6వ వరకు. మహాదీపం డిసెంబర్ 6న పెడతారు** శ్రీకాళహస్తి లో అన్ని రోజులు రాహుకేతు పూజలు చేస్తారు శివరాత్రి నాడు భక్తుల రద్దీ అధికంగా ఉండటం వలన ఆ రోజు చెయ్యరు. రాహుకేతు పూజలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. ** 

గాయత్రి మంత్ర మహిమ..!! Gayatri Mantra, Gayatri Mahima With Lyrics

గాయత్రి మంత్ర మహిమ..!!

ప్రాచీన కాలంలో నెల్లై నగరాన్ని ముఖ్యనగరంగా చేసుకొని పాండ్యరాజు ఒకరు పాలిస్తూ వుండేవారు. ఆ రాజుగారు  తీరని కడుపునెప్పి వ్యాధితో  అవస్ధ పడుతూండేవాడు.

వైద్యులు ఎంత మంది ప్రయత్నించినా గుణపర్చలేకపోయారు.

అప్పుడు , ఒకనాడు రాజుగారి సభకి ఒక జ్యోతిష్కుడు   వచ్చాడు. మహారాజును చూసి

" తమకి ఏ ఔషధాలు అవసరం లేదు.  జాతకరీత్యా వున్న దోష  విముక్తికి పరిహారం చేస్తే చాలు,  అని చెప్పాడు. జ్యోతిష్కుడు  చెప్పిన ప్రకారం, పరిష్కార పూజ  మొదలయింది. 

మంత్రాలతో ఒక యమధర్మరాజు బొమ్మని చేసి, ఆ బొమ్మ చేతిలో  ఒక  కత్తి ని అమర్చాడు జ్యోతిష్కుడు. 

పిదప , "రాజా !  యీ  యముని బొమ్మ చేతిలో వున్న కత్తిని కింద

పడేట్లు చేసిన వారికి , ధనాన్ని  ,సువర్ణాన్ని  బహుమతిగా ప్రకటించమని చెప్పాడు.

రాజావారు అలాగే తన దేశమంతా చాటింపువేయించాడు.

రాజుగారిచ్చే బహుమతి కోసం రాజ్యంలోని ప్రజలంతా

సభకి  వచ్చి  బొమ్మ చేతిలోని కత్తిని క్రింద పడవేసేందుకు ఎంతో ప్రయత్నించారు. కాని ఒక్కొక్కరు  ఆ బొమ్మ వద్దకి రాగానే.. ఆ బొమ్మ మూడు వ్రేళ్ళను ఎత్తి చూపేది. వచ్చిన వారికి ఏమీ అర్ధం కాక ఏం చేయాలో తెలియక  తిరిగి వెళ్ళి పోయేవారు. 

ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజ సభకు వచ్చి  తను కూడా ప్రయత్నించి చూద్దామని ఆ మంత్రపు బొమ్మ దగ్గరకు రాగానే ప్రతిసారి లాగనే ఆ బొమ్మ మూడు వేళ్ళు ఎత్తి చూపింది. బ్రాహ్మణుడు అర్ధమైనట్లుగా

" కుదరదు"  అన్నాడు. వెంటనే బొమ్మ రెండు వేళ్ళు చూపించింది.  "అప్పుడు కూడా  ఒప్పుకోను"  అన్నాడు

బ్రాహ్మణుడు. తరువాత ఒక్క వేలు మాత్రమే ఎత్తి  చూపించింది బొమ్మ. దానికి   బ్రాహ్మణుడు సరేనని,  దగ్గర వున్న పాత్రలోని  నీటిని, తీసుకుని ఆ నీటి ధారతో దానం చేశాడు.

మరుక్షణమే  యమధర్మరాజు చేతిలోని కత్తి క్రింద పడిపోయింది. మరుక్షణమే  మహారాజు గారి కడుపునొప్పి  అదృశ్యమై పూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. పిదప  , ఆ మంత్ర బొమ్మ మూడు వ్రేళ్ళ రహస్యం ఏమిటి ? అని రాజు ,బ్రాహ్మణుని అడిగాడు.

రాజా ! .. బొమ్మ మూడు వ్రేళ్ళు ఎత్తి  చూపి  , నేను మూడు పూటలా చేసే గాయత్రి మంత్ర  జప పుణ్యఫలం దానంగా అడిగినట్లు తలచి,  ' వీలుకాదు' అని ఒప్పుకోలేదు.

తరువాత రెండు వ్రేళ్ళను మాత్రమే చూపింది బొమ్మ, అప్పుడు కూడా, రెండు పూటలా జపించిన గాయత్రి మంత్ర జప  పుణ్య ఫలాన్ని అడుగుతున్నదని తలచి ఇవ్వను అని చెప్పాను. ఆఖరికి ఒక వ్రేలు చూపినది బొమ్మ.   మహారాజావారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వెంటనే ఒక  పూట నేను జపించిన గాయత్రీ మంత్ర పుణ్య ఫలాన్ని యివ్వడానికి సమ్మతించి ఆ పుణ్యఫలాన్ని ధారపోశాను. దాని ఫలితంగా బొమ్మ కత్తిని క్రింద పడవేసింది.   అని బ్రాహ్మణుడు  వివరించాడు.

రాజు గారు , గాయత్రీ మంత్ర జప పుణ్యఫలాలను, అర్ధం చేసుకొని, బ్రాహ్మణునికి విలవైన కానుకలను యిచ్చి సత్కరించాడు.

ఒక పూట గాయత్రీ జపానికే అంతటి మహత్తు వుంటే , నిత్యమూ నియమ నిష్టలతో భక్తితో గాయత్రీ మంత్రాన్ని జపించేవారు మరెంతటి మహిమాన్విత శక్తులు కలిగివుంటారో ఊహించలేము స్వస్తి.....

ఓం భూర్ భువః స్వః

తత్-సవితుర్ వరేణ్యం |

భర్గో దేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్ ||

ఓం శ్రీ గాయత్రి మాత్రేనమః...

Famous Posts:

వాస్తు ప్రకారం ఈ మార్పులు చేసుకుంటే సంపదలు పెరుగుతాయి.

శివుడు చెప్పిన ‘ఆదివిద్య’లు


శివ గుణాలు లోకానికి సందేశాలు


భార్యలు భర్తల కాళ్లను వత్తాలట ఎందుకో మీకు తెలుసా ?


కూతురా కోడలా ఎవరు ప్రధానం...? 


సాంబ్రాణి ధూపం వేయడం వల్ల కలిగే లాభాలు?


కాకికి అన్నం ఎందుకు పెట్టడం ?

గాయత్రి మంత్రం, gayatri mantra in telugu, gayatri mantra meaning, gayatri mantra pdf, gayatri mantra, gayatri mantra, gayatri mantra benefits, gayatri mantra in sanskrit

Comments

Popular Posts