Drop Down Menus

సంసార సుఖాన్ని ఏ విధంగా పొందాలి ? How do married couples stay happy?

సంసార సుఖాన్ని ఏ విధంగా పొందాలి ?

పురుషుడు తనని నమ్మి ప్రేమించి, తనతో వచ్చిన స్త్రీకి మొదట కడుపునిండా తిండి పెట్టాలి. ఆ తర్వాత సిగ్గును దాచుకోవటానికి బట్టలివ్వాలి. తన అందచందాల రక్షణకి గాను గృహమనే భద్రత నివ్వాలి. ఆ తర్వాత రాత్రి యందే కలవాలి.

ఏ స్త్రీలలో రజస్సు వచ్చిన తర్వాత అనగా చివరి రోజులు మంచివి. రజస్సు కానవచ్చిన నాలుగు రోజులు దూరంగా ఉండాలి.

4, 6, 8, 10, 12, 14, 16, 18. ఇలా సరి సంఖ్య రోజుల్లో కలిస్తే పుత్రసంతానం కలుగుతుంది. అలాగే 5, 7, 9, 11, 13, 15, 17 బేసి సంఖ్యల్లో కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. ఆలాగే శనివారమూ, రవివారమూ, మంగళ వారమూ కూడదు.

నాలుగో రోజు కలిస్తే పుట్టిన వారు తక్కువ ఆయుర్దాయమునూ, అయిదొవ రోజు బహు సంతానవంతమైన స్త్రీ, ఆరో రోజు సామాన్య సగటు మనిషీ, ఏడో రోజు పిల్లలు పుట్టని ఆడపిల్లా, ఎనిమిదో రోజు అధిక ధనవంతుడూ, తొమ్మిదవ రోజున మహా పతివ్రతా, పదవరోజు తల్లి దండ్రుల పేరు నిలబెట్టే వాడూ, పదకొండో రోజున నలుగురు నోళ్ళలో నానేదీ, పన్నెండో రోజున ఉత్తమోత్తమమైన పురుషుడూ, పదమూడో రోజున ఎక్కువ మంది భర్తలు గలదీ, పధ్నాలుగో రోజు ఆధ్యాత్మిక చింతన కలవాడూ, పదిహేనవరోజున సకల భోగాలూ అనుభవించే పడతీ, పదహారవ రోజు లోకోత్తరమైన వాదిగా పేరు పొందే ||పుత్రుడు జన్మిస్తాడని శాస్త్రం చెబుతోంది.

* పగలూ, సంధ్యా సమయాల్లో స్త్రీ వద్దకు శృంగారము కొరకు వెళ్ళరాదు.

* తన కన్నా పెద్ద స్త్రీ లేదా గర్భవతితో శృంగారం నిషిద్ధం.

* బహు లావూ, బహు సన్నమూ, అవయవ లోపమున్న స్త్రీతో శృంగారం వలదు.

* గురుప్రదేశములోనూ దేవాలయ ప్రదేశము లోనూ, యజ్ఞయాగాదులు జరిగినా, జరుగుతున్నా ఆయా ప్రదేశాల్లో స్త్రీకి దూరంగా ఉండాలి.

* కడుపారా భుజించినప్పుడూ, పదహాడ సంవత్స రములముందూ, డెబ్భై సంవత్సరాల తర్వాత మైథునం 1 మంచిది కాదు.

* స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సిద్ధంగా ఉండాలి. తారుమారుగా శృంగారం చేస్తే తారుమారు సంతానమే కలుగుతుంది.

* మగవాడు పడకపై కుడిపాదం పెట్టి ఎక్కాలి. ఎడమ పాదం పెట్టి పదకపై రావాలి.

* సంసార సుఖాన్ని మధురంగా అనుభవించాలి.

Famous Posts:

స్త్రీల గూర్చి పురుషులు, పురుషుల గూర్చి స్త్రీలు తెలుసుకోవాల్సినవి?


సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ ఆదివారాల నోము


శనేశ్వరుడు శనివారాల నోము


శుక్రవారాల నోముకి ఎంతో ప్రాధాన్యత


శివదేవుని సోమవారపు నోము కథ

dharma sandesalu, wife and husband, relations, sex, romance, wife and husband relation

ఇవి కూడా చూడండి
తిరుమల సమాచారం
ప్రసిద్ద ఆలయాలు
టూర్ ప్యాకేజీలు 
ఫోన్ నెంబర్లు
స్తోత్రాలు
పంచాంగం
పిల్లల పేర్లు
ఉచిత సంగీత క్లాసులు
రాశి ఫలాలు
పెళ్లి ముహుర్తాలు

Comments

FOLLOW US ON :

మీరు హిందూ టెంపుల్స్ గైడ్ వాట్స్ యాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ కాకపోయి ఉంటే ఫోటో పై క్లిక్ చేస్తే జాయిన్ అవుతారు.