నవరాత్రుల్లో 9వ రోజు చేయాల్సిన పూజ సిద్ధిధాత్రి ( రాజ రాజేశ్వరి ) | Navratri 9th Day Pooja Siddhidatri Mata
నవరాత్రుల తొమ్మిదో రోజు - మంగళవారం 4 అక్టోబర్ 2022- మహానవమి, శరన్నవరాత్రుల పరణ
సిద్ధిధాత్రి ( మహిషాసుర మర్దిని ) ( రాజ రాజేశ్వరి )
దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపం సిద్ధిధాత్రి. ఈమె అన్ని సిద్ధులనూ ప్రసాది స్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈదేవీ కృపతో పొందాడని దేవీ పురాణాలు చెబుతున్నాయి.
'సిద్ధిదాత్రీ దుర్గా, 'నవదుర్గల్లో తొమ్మిదవ, ఆఖరి అవతారం. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, దాత్రీ అంటే ఇచ్చేది. భక్తులు కోరుకున్న పనిని తీర్చే అమ్మవారు ఈమె. ఇహ సుఖాలనే కాక, జ్ఞానాన్నీ, మోక్షాన్నీ కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని భక్తుల నమ్మకం.
తామరపువ్వులో కూర్చుని ఉండే సిద్ధిదాత్రీ దుర్గాదేవికి నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం, మరో చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించేవారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని పురాణోక్తి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీ దుర్గాదేవిని పూజిస్తారు. ఈమెను ఉపాసించేవారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి.
ధ్యాన శ్లోకం
శ్లో|| సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి|
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
తొమ్మిదో రోజు అమ్మవారు మహిషాసుర మర్ధిని అమ్మవారి గా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి రవ్వతో చేసిన చక్కెర పొంగలిను నైవేద్యంగా సమర్పిస్తారు.
Related Posts:
> నవరాత్రుల్లో 1వ రోజు చేయాల్సిన పూజ శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)
> నవరాత్రుల్లో 2వ రోజు చేయాల్సిన పూజ బ్రహ్మచారిణి ( గాయత్రి )
> నవరాత్రుల్లో 3వ రోజు చేయాల్సిన పూజ చంద్రఘంట ( అన్నపూర్ణ )
> నవరాత్రుల్లో 4వ రోజు చేయాల్సిన పూజ కూష్మాండ ( కామాక్షి )
> నవరాత్రుల్లో 5వ రోజు చేయాల్సిన పూజ స్కందమాత ( లలిత )
> నవరాత్రుల్లో 6వ రోజు చేయాల్సిన పూజ కాత్యాయని (లక్ష్మి)
> నవరాత్రుల్లో 7వ రోజు చేయాల్సిన పూజ కాళరాత్రి ( సరస్వతి )
> నవరాత్రుల్లో 8వ రోజు చేయాల్సిన పూజ మహాగౌరి ( దుర్గ )
> నవరాత్రుల్లో 9వ రోజు చేయాల్సిన పూజ సిద్ధిధాత్రి ( రాజ రాజేశ్వరి )
> శరన్నవరాత్రుల 10వ రోజు - విజయదశమి దుర్గాదేవీ పూజా విధానం
సిద్ధిధాత్రీ, siddhidatri, siddhidatri Mata Story, siddhidatri Mantra, siddhidatri Mantra benefits, siddhidatri Devi photo, vijayadasami, devi navaratrulu, durga mata
Comments
Post a Comment