దేవి నవరాత్రులలో ఎనిమిదొవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం | Navratri 8th Day Pooja Mahagauri
నవరాత్రులలో ఎనిమిదొవ రోజు అలంకారం, నైవేద్యం, చదవవలసిన శ్లోకం - ఆదివారం 22 అక్టోబర్ 2023- దుర్గా అష్టమి, మహాగౌరీ పూజ, మహానవమి
మహాగౌరి ( దుర్గ )
మహాగౌరీ దుర్గా నవదుర్గల అలంకారాల్లో ఎనిమదవ అవతారం. నవరాత్రులలో ఎనిమిదవ రోజైన ఆశ్వీయుజ శుద్ధ అష్టమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. హిందూ పురాణాల ప్రకారం తనను పూజించే భక్తుల అన్ని కోరికలనూ ఈ అమ్మవారు తీర్చగలదు. జీవితంలోని కష్టాలన్నిటినీ ఈ అమ్మవారి ఉపాసన ద్వారా దూరం చేసుకోవచ్చు అని భక్తుల నమ్మిక. మహాగౌరీదేవినాలుగు చేతులుతో ఉంటుంది. కుడిచేయి అభయముద్రలో ఉండగా, కింది కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది. కింది ఎడమ చేతిలో ఢమరుకం ఉండగా, పై ఎడమ చేయి దీవిస్తున్నట్టుగా ఉంటుంది.
కథ
పార్వతీదేవి తన భర్తగా శివుడిని పొందడంకోసం నారదుడు ఇచ్చిన సలహాతో తపస్సు చేయటానికి పూనుకుంది. కాబట్టి, ఆమె రాజ భవనాన్ని, అన్ని సౌకర్యాలను విడిచి, అడవికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది. ఆమె ఎండ, చలి, వర్షం, కరువు, భయంకరమైన తుఫానులను కూడా లెక్కచేకుండా చాలా సంవత్సరాలు కఠిన తపస్సు కొనసాగింది. దాంతో పార్వతి శరీరం దుమ్ము, ధూళి, నేల, చెట్ల ఆకులతో నిండిపోయింది. అప్పుడు ఆమె తన శరీరంపై నల్లటి చర్మాన్ని ఏర్పాటుచేసుకుంది. చివరికి, శివుడు ఆమెముందు ప్రత్యక్షమై, ఆమెను వివాహం చేసుకుంటానని మాట ఇచ్చాడు. అతను తన ముడి వేసిన జుట్టు నుండి వెలువడే గంగా నది పవిత్ర జలాల ద్వారా ఆమెను తడిపాడు. గంగ పవిత్రమైన జలాలు పార్వతికి అంటుకున్న మురికిని కడిగివేయడంతో ఆమె మహిమాన్వితమైన తెల్లని రంగులోకి మారింది. ఆ విధంగా తెల్లని రంగును సంపాదించడం ద్వారా పార్వతిని మహాగౌరి అని పిలుస్తారు.
తల్లి గౌరీ దేవి, శక్తి, మాతృదేవత, దుర్గా, పార్వతి, కాళీ అని అనేక రూపాల్లో కనిపిస్తుంది. ఆమె పవిత్రమైనది, తెలివైనది. చెడు పనులను చేసేవారిని శిక్షించి, మంచి వ్యక్తులను రక్షిస్తుంది. తల్లి గౌరీ మోక్షాన్ని ఇవ్వడం ద్వారా పునర్జన్మ భయాన్ని తొలగిస్తుంది.
ధ్యాన శ్లోకం
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః|
మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||
ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గాదేవి అవతారం లో దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు.
Related Posts:
> నవరాత్రుల్లో 1వ రోజు చేయాల్సిన పూజ శైలపుత్రి (బాలా త్రిపుర సుందరి)
> నవరాత్రుల్లో 2వ రోజు చేయాల్సిన పూజ బ్రహ్మచారిణి ( గాయత్రి )
> నవరాత్రుల్లో 3వ రోజు చేయాల్సిన పూజ చంద్రఘంట ( అన్నపూర్ణ )
> నవరాత్రుల్లో 4వ రోజు చేయాల్సిన పూజ కూష్మాండ ( కామాక్షి )
> నవరాత్రుల్లో 5వ రోజు చేయాల్సిన పూజ స్కందమాత ( లలిత )
> నవరాత్రుల్లో 6వ రోజు చేయాల్సిన పూజ కాత్యాయని (లక్ష్మి)
> నవరాత్రుల్లో 7వ రోజు చేయాల్సిన పూజ కాళరాత్రి ( సరస్వతి )
> నవరాత్రుల్లో 8వ రోజు చేయాల్సిన పూజ మహాగౌరి ( దుర్గ )
> నవరాత్రుల్లో 9వ రోజు చేయాల్సిన పూజ సిద్ధిధాత్రి ( రాజ రాజేశ్వరి )
> శరన్నవరాత్రుల 10వ రోజు - విజయదశమి దుర్గాదేవీ పూజా విధానం
mahagauri mantra, mahagauri story, mahagauri chakra, mahagauri mata telugu, mahagauri temple, navaratrulu 8th day, vijayadasami
ఇవి కూడా చూడండి |
---|
Tirumala info English |
తిరుమల సమాచారం |
ప్రసిద్ద ఆలయాలు |
టూర్ ప్యాకేజీలు |
ఫోన్ నెంబర్లు |
స్తోత్రాలు |
పంచాంగం |
పిల్లల పేర్లు |
ఉచిత సంగీత క్లాసులు |
రాశి ఫలాలు |
పెళ్లి ముహుర్తాలు |
Comments
Post a Comment